ఛునిబాయ్ వైద్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఛునిబాయ్ వైద్య (2 సెప్టెంబరు 1918 - 19 డిసెంబరు 2014)[1][2] ప్రముఖ గాంధేయవాది. గాంధేయ మార్గంలో పయనించి ఎందరికో స్పూర్తిగా నిలిచారాయన.

జీవిత విశేషాలు[మార్చు]

ఛునిబాయ్ స్వాతంత్య్రోద్యమ పోరాటంలో అలుపెరుగని పోరాటాన్ని చేశారు. ఆచార్య వినోబాభావే నడిపించిన భూదాన ఉద్యమంలో తన దైన పోరాటాన్ని కొనసాగించారు. 1975లో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించి.. జైలు పాలయ్యారు. విశ్వ గుజరాతీ సమితి ఛునిబాయ్ సేవలకు గాను ఆయనను విశ్వ గుజరాతీ ప్రతిభ అవార్డుతో సత్కరించింది. అంతేకాకుండా ఆయనను సేన్ గురూజీ నిర్భయ్ పత్రకారిత అవార్డు కూడా ఆయనను వరించింది[3][4].

మరణం[మార్చు]

ఆయన అహ్మదాబాద్‌లోని ఆయన నివాసంలో డిసెంబరు 19 2014 న తుదిశ్వాస విడిచారు. 97 ఏళ్ల ఛునిబాయ్‌కు వయస్సు రీత్యా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన మరణించారు.[5]

మూలాలు[మార్చు]

  1. PM condoles the passing away of eminent Gandhian Shri Chunibhai Vaidya
  2. "Veteran freedom fighter Chunibhai Vaidya died". Archived from the original on 2015-01-10. Retrieved 2015-08-15.
  3. ప్రముఖ గాంధేయవాది ఛునిభాయ్ మృతి[permanent dead link]
  4. http://indianexpress.com/article/cities/ahmedabad/chunibhai-vaidya-face-of-resistance-on-public-issues/
  5. ప్రముఖ గాంధేయవాది ఛునిభాయ్ మృతి[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]