ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యాన్ (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఛోటా భీమ్‌ అండ్‌ ది కర్స్‌ ఆఫ్‌ దమ్యాన్‌ (ఆంగ్లం: Chhota Bheem and the Curse of Damyaan), అనేది 2024 మే 31న థియేటర్లలో విడుదలైన భారతీయ హిందీ భాష లైవ్-యాక్షన్ సూపర్ హీరో యాక్షన్ చిత్రం, దీనికి రాజీవ్ చిలక దర్శకత్వం వహించాడు, శ్రీదిషా దిలీప్, నీరజ్ విక్రమ్ రాశారు.[1] ఇది అదే పేరుతో 2012లో వచ్చిన యానిమేటెడ్ చిత్రానికి లైవ్-యాక్షన్ రీమేక్. ఇందులో యజ్ఞ భాసిన్ టైటిల్ క్యారెక్టర్‌ పాత్ర పోషించాడు. నవనీత్ కౌర్ ధిల్లాన్, స్వర్ణ పాండే, ఆశ్రియ మిశ్రా, సుమిత్ కేష్రీ, దావిక్ దావర్, అనుపమ్ ఖేర్, మకరంద్ దేశ్‌పాండే, సురభి తివారీ, సంజయ్ బిష్ణోయ్, షాజీ చౌదరి, కబీర్ సాజిద్ ఖాన్, దియాన్ షేక్, దియాన్ ఖాన్ అద్విక్ జైస్వాల్ తదితరులు భీమ్, చుట్కీ, రాజు, కాలియా, ధోలు, భోలుల పాత్రలు పోషించారు, జగ్గు అనే యానిమేటెడ్ కోతికి ఆర్యన్ ఖాన్ గాత్రం అందించాడు,

తారాగణం

[మార్చు]
  • భీమ్‌గా యజ్ఞ భాసిన్
  • తషికాగా నవనీత్ కౌర్ ధిల్లాన్
  • ఇందుమతి యువరాణిగా స్వర్ణ పాండే
  • చుట్కీగా ఆశ్రియ మిశ్రా
  • దమ్యాన్‌గా సుమిత్ కేశ్రీ
  • ధోలుగా డేవిక్ దావర్
  • గురు శంభుగా అనుపమ్ ఖేర్
  • స్కంధిగా మకరంద్ దేశ్‌పాండే
  • తుంతున్ మౌసిగా సురభి తివారీ
  • ఇంద్రవర్మ రాజుగా సంజయ్ బిష్ణోయ్
  • చురన్ సింగ్‌గా షాజీ చౌదరి
  • కలియాగా కబీర్ సాజిద్ షేక్
  • భోలుగా దివ్యం దావర్
  • రాజుగా అద్విక్ జైస్వాల్

రాజా ఇంద్రవర్మ పాలనలోని సుందరమైన ఢోలక్‌పూర్‌ రాజ్యంపై కొందరి దుర్మార్గుల కళ్లు పడ్తాయి. ఆ రాజ్యంలో ఉండే శాంతిని విద్వంసంగా మార్చేందుకు చూస్తాయి.

తన స్నేహితులతో కలిసి ఢోలక్‌పూర్‌ని కాపాడేందుకు కింగ్ దమ్యాన్‌తో  తలపడేందుకు భీమ్‌ గతంలోని సోనాపూర్ వెళతాడు.

సినిమా ప్రకటన

[మార్చు]

2023 సెప్టెంబరు 14న, రాజీవ్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో తాను 2012 యానిమేటెడ్ ఛోటా భీమ్‌ అండ్‌ ది కర్స్‌ ఆఫ్‌ దమ్యాన్‌ సినిమా లైవ్-యాక్షన్ రీమేక్‌పై పని చేస్తున్నానని చెప్పాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "chhota bheem: ఢోలక్‌పూర్‌ని కాపాడేది ఒకే ఒక్కడు | chhota-bheem-and-the-curse-of-the-man-update". web.archive.org. 2024-06-02. Archived from the original on 2024-06-02. Retrieved 2024-06-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Chhota Bheem and the Curse of Damyaan teaser: Anupam Kher, Makarand Deshpande star in live-action feature. Watch". The Indian Express. 13 September 2023. Archived from the original on 14 September 2023. Retrieved 14 September 2023.