Jump to content

జనధర్మ

వికీపీడియా నుండి
జనధర్మ
జనధర్మ ప్రారంభ సంచిక మొదటిపేజీ
జనధర్మ
రకంప్రతి గురువారం వారపత్రిక
రూపం తీరుటాబ్లాయిడ్
ప్రచురణకర్తఎం.శంకరరావు
సంపాదకులుఎం.శంకరరావు
సహ సంపాదకులుఎం.ఎస్.ఆచార్య, టి.వై.నరసింహాచార్య
స్థాపించినది1958 నవంబరు 27
భాషతెలుగు
కేంద్రంవరంగల్లు

జాతీయ తెలుగు వారపత్రిక జనధర్మ 1958 నవంబరు 27 న ప్రారంభమైంది.[1] వరంగల్లు నుండి ప్రతి గురువారం వెలువడేది. 1976 నుండి ఈ పత్రిక వారానికి రెండుసార్లు ప్రతి సోమవారం, ప్రతి గురువారం వెలువడేది. ఎం.ఎస్.ఆచార్య ఈ పత్రికను నడిపాడు. ఈ పత్రిక పతాక శీర్షిక పై భాగాన అనవరత జాగరమే ప్రజాస్వామ్య సుస్థిరతకు ఆధారము అనే వాక్యాన్ని ప్రచురించేవారు. ఈ పత్రికలో దేశ, రాష్ట్ర, ప్రాంతీయ వార్తలతో పాటుగా, కథలు, ఏకాంకికలు, గేయనాటికలు, కవితలు, సీరియల్ నవలలు ప్రచురితమయ్యాయి.THE LARGEST CIRCULATED BI-WEEKLY IN APగా ఈ పత్రిక గుర్తించబడింది. వరంగల్లుకు మంచినీటి సమస్యను పరిష్కరించిన కాకతీయ కాలువ, కాకతీయ విశ్వవిద్యాలయ స్థాపన, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు తెప్పించటం లాంటి అనేక అభివృద్ధి పనులను వరంగల్లుకు సాధించి పెట్టడంలో ఈ పత్రిక కృషి ఉంది.[2]

శీర్షికలు

[మార్చు]
  • లంబోదరాయణం
  • నారదవీణ
  • గీతామృతం
  • గ్రామాయణం
  • మన పార్లమెంటు
  • లేఖావళి
  • వాణిజ్యరంగం
  • రూప్య శతకం
  • స్థానిక వార్తలు
  • క్రీడావని
  • కులాసా కబుర్లు
  • రాజధాని విశేషాలు
  • భావతరంగిణి
  • జనవాణి
  • పుస్తక సమీక్ష
  • చిత్ర సమీక్ష
  • శేషధర్మములు
  • చాణక్య నీతి సూత్రములు
  • మిర్చీ-మసాలా
  • కళారవళి
  • ఇంతే సంగతులు
  • కత్తిరింపులు
  • జీవనగమ్యం
  • చదువు సంధ్యలు
  • మినీమనసులు
  • వార్తాలేఖ మొదలైనవి.

రచయితలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. అకాడెమీ ఆర్కీవ్స్‌లో జనధర్మ ప్రతి[permanent dead link]
  2. కోవెల, సంతోష్ కుమార్. "అక్షరాయుధంతో అలుపెరుగని పోరు". ఆనందిని. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 30 January 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=జనధర్మ&oldid=4388890" నుండి వెలికితీశారు