జనసాహితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జన సాహితి ఒక ప్రజాతంత్ర సాహితి సంస్థగా చెప్పుకోబడిన సంస్థ. ఈ సంస్థని కె.రవిబాబు, రంగనాయకమ్మ, జ్వాలాముఖి తదితరులు స్థాపించారు. రంగనాయకమ్మ ఈ సంస్థ నాయకత్వంతో విభేదించి సంస్థ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జన సాహితితో మా విభేదాలు అనే పేరుతో పుస్తకం కూడా వ్రాసారు. జన సాహితి సంస్థ ప్రజాసాహితి అనే పేరుతో పత్రిక కూడా నడుపుతోంది. ఈ పత్రికని రంగనాయకమ్మ స్థాపించారు. ఈ పత్రికని ఈమె కొంత కాలం స్వయంగా నడిపి తరువాత పత్రికను జన సాహితి సంస్థ పేరు మీద బదిలీ చేశారు.

అభిప్రాయాలు[మార్చు]

  • సాహిత్యోద్యమాన్ని ఒక సామాజిక బాధ్యతాయుత కర్తవ్యంగా స్వీకరించి, కాలం చెల్లినా కొనసాగుతున్న కుళ్ళి కంపుకొడుతున్న భూస్వామ్య సంస్కృతిని అంతం చేసే లక్ష్యంతో సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించి దాన్ని నిరంతరం కాపాడుకుంటూ, భారత సమాజంలో వివిధ చారిత్రక దశల్లో వర్గ సంఘర్షణల ఫలితంగా వ్యాప్తిలోకి వచ్చిన ప్రగతిశీల పురోగామిక సాంస్కృతిక భావజాలాన్నీ కళాసాహిత్యాలనూ ‘జనసాహితి’ తన వారసత్వంగా స్వీకరించింది. [1]

మూలాలు[మార్చు]

  1. గుర్రం సీతారాములు - ప్రాణహిత Archived 2009-01-08 at the Wayback Machine వెబ్ పత్రికలో "నల్లకలువలు పూయించిన ప్రజాసాహితి" అనే వ్యాసం
"https://te.wikipedia.org/w/index.php?title=జనసాహితి&oldid=2958711" నుండి వెలికితీశారు