జబ్ తక్ హై జాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Pagetype/setindex' not found.]]

జబ్ తక్ హై జాన్
దర్శకత్వంయశ్ చోప్రా
రచనఆదిత్య చోప్రా
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణంషారుఖ్ ఖాన్,
కత్రినా కైఫ్,
అనుష్క శర్మ
ఛాయాగ్రహణంఅనీల్ మెహ్తా
కూర్పునమ్రతా రావు
సంగీతంఎ.ఆర్. రెహ్మాన్
నిర్మాణ
సంస్థ
యశ్ రాజ్ స్టూడియోస్
పంపిణీదార్లుయశ్ రాజ్ ఫిలింస్
విడుదల తేదీ
నవంబర్ 13, 2012
సినిమా నిడివి
175 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్600 మిలియన్ రూపాయలు
బాక్సాఫీసు2.11 బిలియన్ రూపాయలు

యశ్ రాజ్ స్టూడియోస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ప్రేమ కథా చిత్రం జబ్ తక్ హై జాన్. షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని ప్రముఖ హిందీ దర్శకుడు యశ్ చోప్రా తెరకెక్కించాడు. ఎ. ఆర్. రహ్మాన్ సంగీతాన్ని అందించాడు. యశ్ చోప్రా చివరి సినిమా ఐన ఈ చిత్రం 2012 నవంబరు 13న విడుదలై 100 కోట్ల పై చిలుకు వసూళ్ళను సాధించి ఘనవిజయం అనిపించుకుని ఎన్నో అవార్డ్ ఫంక్షన్లలో పురస్కారాలనందుకుంది.

కథ[మార్చు]

కాశ్మీర్ ప్రాంతంలో మేజర్ సమర్ ఆనంద్ (షారుఖ్ ఖాన్) భారతీయ మిలిటరీలో బాంబ్ డిస్పోసల్ శాఖలో పనిచేస్తుంటాడు. బాంబ్ సూట్ వేసుకోకుండా, చిన్న గాయనికి కూడా గురి కాకుండా 97 బాంబులను నిర్వీర్యం చేసినవాడు. ఇంకా చేస్తూనే ఉంటాడు. తన ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా తను చేసే ఈ సాహసం వెనకున్న కారణాల గురించి ఎవరికీ తెలియదు. ఓ రోజు డిస్కవరీ ఛానల్లో డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ గా పనిచేసే అకీరా రాయ్ (అనుష్క శర్మ) తన స్నేహితులతో కాసిన పందెం గెలవడానికి అక్కడే ఓ చల్లటి నీళ్ళున్న సరస్సులోకి దూకి ఈదలేక సహాయం కోసం అరుస్తుంటుంది. అప్పుడు సమర్ తనని కాపాడి తన ఆర్మీ కోటుని కప్పుకోడానికిచ్చి తను వెళ్ళిపోతాడు. తన గదికి వెళ్ళాక అకీరా ఆ కోటులో ఓ డైరీని చూస్తుంది.

ఆ డైరీలో సమర్ లండన్ జీవితం, తన తొలిప్రేమ గురించి; తను నిర్వీర్యం చేసిన బాంబులు, ఆయా స్థలాలు, బాంబ్ మోడల్, నిర్వీర్యం చేసిన సమయం మొదలగు సమాచారాలు ఉంటాయి. అకీరా ఆ డైరీలో సమర్ గతాన్ని చదవడం మొదలుపెడుతుంది. సమర్ లండన్ దేశంలో చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కాలం వెళ్ళదీసే ఓ పంజాబీ యువకుడు. సంగీతంలో ప్రావీణ్యం ఉన్న సమర్ స్ట్రీట్ మ్యుజీషియన్ అవతారమెత్తి కొంత డబ్బును సంపాదిస్తుంటాడు. అప్పుడే తనకి మీరా (కత్రినా కైఫ్) అనే ధనవంతుడి కూతురు పరిచయమౌతుంది. వాళ్ళిద్దరూ స్నేహితులుగా మారాక వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి శారీరకంగా ఒక్కటయ్యేంతవరకూ సాగుతుంది. ఓ రోజు సమర్ మీరాని కలిసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడతాడు. చిన్నప్పటి నుంచి జీసస్ భక్తురాలైన మీరా ఆయన దగ్గర ఓ వరం కోరుకుంటే అందుకు బదులుగా ఎదో ఒకటి వదిలేస్తుంటుంది. ఈ పరిస్థితిలోనూ సమర్ ప్రాణాలను కాపాడటానికి తను ప్రాణాలతో ఉండాలని వరం కోరుకుని తనని బ్రతికిస్తే తనని పెళ్ళి చేసుకోననీ, కలిసి బ్రతకననీ మాటిస్తుంది. సమర్ కోలుకున్నాక ఇదే విషయం మీరా తనతో చెప్తే సమర్ మీరాని వెళ్ళిపొమ్మంటాడు. తన ప్రేమని లాక్కుని ప్రాణాలను ఇచ్చాడు కనుక రోజూ మృత్యువు వడిలో ఉండేలా మిలిటరీలో చేరి అలా పదేళ్ళలో దేవుడిపై కోపంతో 97 బాంబులను నిర్వీర్యం చేస్తాడు సమర్.

అకీరా ఇదంతా చదివి సమర్ పై డాక్యుమెంటరీ తియ్యాలని తన బాస్ దగ్గర అనుమతి తీసుకుని వెళ్తుంది. మెల్లగా సమర్ స్నేహాన్ని గెలుచుకున్న అకీరా డాక్యుమెంటరీని విజయవంతంగా పూర్తి చేస్తుంది. చివరి రోజున అకీరా అప్పటికే 100 పై చిలుకు బాంబులను నిర్వీర్యం చేసిన సమర్ దగ్గరకి వెళ్ళి ప్రేమిస్తున్నానని చెప్తుంది. సమర్ మనసులో అకీరాపై సదాభిప్రాయమే ఉన్నా మీరాని మర్చిపోయి నీతో బ్రతకలేనని చెప్తాడు. అకీరా తిరిగి లండన్ వెళ్ళిపోతుంది. కానీ తన డాక్యుమెంటరి " ఎ మేన్ హూ కెనాట్ డై"ని ఆమోదించడానికి సమర్ లండన్ రావాలని డిస్కవరీ వర్గాలు అకీరాతో చెప్తాయి. ఇష్టం లేకపోయినా అకీరా మీదున్న ప్రేమతో సమర్ లండన్ వస్తాడు. ఐతే అకీరా వల్ల అనుకోకుండా మళ్ళీ రోడ్డు ప్రమాదంలో గాయపడతాడు. హాస్పిటల్లో చేర్చాక సమర్ రెట్రోగ్రేడ్ అమ్నీషియాతో బాధపడుతున్నాడని, ఆ వ్యాధి కారణంగా సమర్ మెమరీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ జోయా అలీ ఖాన్ (సారిక హాసన్) ద్వారా అకీరా తెలుసుకుంటుంది. ఇదే విషయం వాళ్ళిద్దరూ మీరాకి చెప్తారు. సమర్ ఆరోగ్యం బాగుపడేంతవరకూ మీరా తన భార్యగా నటించేందుకు ఒప్పుకుంటుంది. అంతా బాగానే సాగుతోంది అనుకోగానే సమర్ ఓ రోజు లండన్ మెట్రో ట్రైనులో ఓ బాంబుని చూసి దాన్ని నిర్వీర్యం చేస్తాడు. ఆ ప్రక్రియలో సమర్ తన గతాన్ని తిరిగి పొందుతాడు. మీరా తనతో అబద్ధాలాడుతోందని తెలుసుకున్న సమర్ తనకి రెండు దారులను సూచిస్తాడు - తనతో కలిసి బ్రతకడం, లేదా ఎప్పటిలాగే సమర్ కాశ్మీరులో బాంబులను నిర్వీర్యం చేస్తూ మృత్యువుతో సహవాసం చెయ్యడం. కాశ్మీర్ తిరిగివచ్చాక సమర్ తన 107వ బాంబుని నిర్వీర్యం చేసిన రోజు అకీరా తన "ఎ మేన్ హూ కెనాట్ డై" డక్యుమెంటరీని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అదే రోజు మీరా తన కోరిక వల్ల సమర్ చావు కన్న హీనమైన శిక్ష అనుభవిస్తున్నాడని గ్రహించి కాశ్మీరుకి వెళ్తుంది. తనతో కలిసి బ్రతకాలని అనుకుంటున్న మీరాను కలిసాక సమర్ తన చివరి బాంబ్, అదే 108వ బాంబుని విజయవంతంగా నిర్వీర్యం చేసి తనని పెళ్ళిచేసుకోమని అడిగి మీరా సమ్మతిని పొండటంతో సినిమా ముగుస్తుంది.