జమీందారు గారి అమ్మాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమీందారు గారి అమ్మాయి
(1975 తెలుగు సినిమా)
Zamindarugari Ammayi.jpg
దర్శకత్వం సింగీతం శ్రీనివాస రావు
నిర్మాణం నవతా కృష్ణంరాజు
తారాగణం శారద
సంగీతం జి.కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
విడుదల తేదీ జనవరి 31, 1975 (1975-01-31)
దేశం భారత్
భాష తెలుగు

జమీందారు గారి అమ్మాయి సినిమా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శారద, రంగనాథ్, గుమ్మడి తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా 1975లో విడుదలైన చలనచిత్రం. సినిమాకి సంగీతాన్ని జి.కె.వెంకటేష్ సమకూర్చారు. నవత కృష్ణంరాజు సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా, అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైంది. సినిమా వందరోజుల పాటు ప్రదర్శితమై, మంచి విజయాన్ని సాధించింది.[1]

నిర్మాణం[మార్చు]

నేపథ్యం[మార్చు]

నవతా కృష్ణంరాజు ఈ సినిమా తీద్దామని నిర్ణయించుకుని అప్పటికి తన తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సింగీతం శ్రీనివాసరావును దర్శకునిగా తీసుకున్నారు. అయితే సింగీతం తీసిన తొలి సినిమా నీతి నిజాయితి పరాజయం పాలవడంతో పంపిణీదారులు వెనక్కితగ్గారు. సినిమాను నవతా కృష్ణంరాజు వదులుకోవలసివచ్చింది. ప్రముఖ రాజకీయవేత్త, రచయిత రాజాజీ రాసిన కథని సింగీతం శ్రీనివాసరావు తమిళంలో దిక్కట్ర పార్వతిగా తీసి, ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ పురస్కారం పొందారు. ఆ సినిమా బాగా నచ్చడంతో పంపిణీదారుని మార్చినా, సింగీతం శ్రీనివాసరావుతోనే సినిమా తీయాలని నవతా కృష్ణంరాజు నిశ్చయించుకున్నారు.[2]

విడుదల[మార్చు]

జమీందారు గారి అమ్మాయి సినిమా 1975లో విడుదలైంది. సింగీతం శ్రీనివాసరావు మొదటి సినిమా వైఫల్యంతో వెనక్కితగ్గిన డిస్ట్రిబ్యూటర్లను వదిలి, నిర్మాత అన్నపూర్ణ పిక్చర్స్ వారిని పంపిణీదారుగా ఒప్పించారు. దాంతో సినిమా అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైంది. సినిమా వందరోజులు ప్రదర్శితమై ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శక జీవితంలో తొలి విజయంగా నిలిచింది.[2]

పాటలు[మార్చు]

  • మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే - పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2012/02/1975.html?m=1
  2. 2.0 2.1 ఎం.బి.ఎస్., ప్రసాద్. "రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!". గ్రేట్ ఆంధ్రా. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 13 July 2015. Check date values in: |archive-date= (help)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు[మార్చు]