జమున బారువా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమున బారువా
జిందగీ (1940) సినిమాలో జమున బారువా
జననం
జమున గుప్తా

(1919-10-10)1919 అక్టోబరు 10
మరణం2005 నవంబరు 24(2005-11-24) (వయసు 86)
క్రియాశీల సంవత్సరాలు1934–1953
జీవిత భాగస్వామిప్రమథేష్ బారువా

జమున బారువా (1919 అక్టోబరు 10 - 2005 నవంబరు 24) భారతీయ సినిమా నటి. 1935లో వచ్చిన తొలి దేవదాస్ (టాకీ సినిమా)లో నటించిన జమున, భారతీయ సినిమారంగ చరిత్రలో తొలి పార్వతిగా నిలిచింది. భారతీయ టాకీలలో మొదటి పార్వతి[1] గా భారత ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్కారాలు అందుకుంది.

దేవదాస్‌లో కుండల్ లాల్ సైగల్, జమున, బారువా 1936 హిందీ వెర్షన్.

తొలి జీవితం[మార్చు]

జమున 1919 అక్టోబరు 10న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రా సమీపంలోని ఒక గ్రామంలో జన్మించింది. పూరాన్ గుప్తా ఆరుగురు కుమార్తెలలో, జమున నాల్గవ కుమార్తె.

వ్యక్తిగత జీవితం[మార్చు]

జమునకు ప్రముఖ నటుడు దర్శకుడు ప్రమథేష్ బారువాను ప్రేమ వివాహం చేసుకుంది. అస్సాంలోని గౌరీపూర్‌కు చెందిన బారువాకు అప్పటికే రెండుసార్లు వివాహం కాగా, జమున అతడికి మూడవ భార్య. 1936లో తన భర్త నిర్మాణంలో[2] దేవదాస్[3] సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. బారువా మరణించిన తర్వాత సినిమాలలో నటించడం మానేసింది.[4]

సినిమారంగం[మార్చు]

జమున 1930లలో సినిమారంగానికి వచ్చింది. 1934లో పిసి బారువా దర్శకత్వం వహించిన మొహబ్బత్ కి కసౌతి (బెంగాలీ రూప్ లేఖ సినిమా హిందీ వెర్షన్)లో ఒక చిన్న పాత్రను పోషించింది.[5] బారువా 1935లో తీసిన దేవదాస్ (1935)లో పార్వతి పాత్రలో నటించింది. [6] అలా, జమున మొదటి పార్వతిగా భారతీయ సినిమారంగ చరిత్రలో నిలిచింది. హిందీ వెర్షన్‌లో కూడా జమున అదే పాత్రను పోషించింది. గృహదహ (1936), మాయ (1936), అధికార్ (1939), ఉత్తరాయణ్ (1941), శేష్ ఉత్తర్ (1942), చందర్ కలంక (1944) వంటి బారువా రూపొందించిన సినిమాలలో, వాటి హిందీ వెర్షన్‌లలో నటించింది.

1940లో బారువా ప్రతిష్టాత్మకమైన న్యూ థియేటర్స్‌ను వదిలేసి, సినిమా దర్శకత్వంతోపాటు సొంతంగా నిర్మించాడు. ఆ తరువాత బారువా దర్శకత్వం వహించిన అమీరీ, పెహచాన్, ఇరాన్ కీ ఏక్ రాత్ వంటి అనేక హిందీ చిత్రాలలో నటించింది. ఇతర దర్శకులు తీసిన దేబార్ (1943), నీలాంగురియా (1943) వంటి బెంగాలీ సినిమాలలో కూడా నటించింది. 1953లో చివరిసారిగా మలంచ సినిమాలో, దాని హిందీ వెర్షన్ ఫుల్వారీ సినిమాలో కూడా నటించింది.

1951లో 48 ఏళ్ళ వయసులో బారువా మరణించిన తరువాత, జమున జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ సమయానికి తన ముగ్గురు కుమారులు (దేబ్ కుమార్, రజత్, ప్రసూన్) మైనర్లు. గౌరీపూర్ ఎస్టేట్ వారి బాధ్యతలు తీసుకోవడానికి నిరాకరించడంతో జమున, ఆ రాజ కుటుంబంతో న్యాయ పోరాటం చేయాల్సివచ్చింది. ఆ తురవాత వారు కొంత భూమితోపాటు భరణం కూడా ఇచ్చారు. పిల్లల బాధ్యత చూసుకోవడంకోసం సినీ పరిశ్రమకు వీడ్కోలు పలికింది.

చివరి జీవితం, మరణం[మార్చు]

చివరి దశలో మరణానికి ముందు ఆరునెలల కంటే ఎక్కువకాలం మంచం మీద ఉంది. 2005 నవంబరు 24న దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో మరణించింది.

దేవదాస్ (1935) లో ప్రమథేష్ బారువా, జమున బారువా

సినిమాలు[మార్చు]

 • మలంచా [బెంగాలీ వెర్షన్]/ఫుల్వారీ [హిందీ వెర్షన్] (రెండూ 1953)
 • ఇరాన్ కీ ఏక్ రాత్ (1949)
 • సులేహ్ (1946)
 • సుబహ్ శ్యామ్ (1944)
 • చందర్ కలంక (1944)
 • దేవర్ (1943) . . . . నమిత
 • రాణి (1943)
 • శేష్ ఉత్తర్ (1942). . . . రెబా
 • జవాబ్ (1942) . . . . రెబా
 • ఉత్తరాయణ్ (1941) . . . . ఆరతి
 • హిందుస్థాన్ హమారా (1940) . . . . వీణ
 • జిందగీ (1940) . . . . శ్రీమాత
 • అధికార్ (1939) . . . . ఇందిర
 • దేవదాస్ (1936) . . . . పార్వతి / పారో
 • గృహదా (1936) . . . . అచల
 • మంజిల్ (1936) . . . . అచల
 • మాయ (1936/I) . . . . మాయ
 • మాయ (1936/II) . . . . మాయ
 • దేవదాస్ (1935) . . . . పార్వతి/పారూ
 • రూప్ లేఖ (1934) /( హిందీలో మొహబ్బత్ కి కసౌతి ) . . . . హిందీ వెర్షన్‌లో చిన్న పాత్ర

మూలాలు[మార్చు]

 1. "Radiating with brilliance". The Hindu. 2015-06-25. Retrieved 2022-02-09.
 2. Pallab Bhattacharya (2015-08-21). "A grand cinematic exchange". The Daily Star. Retrieved 2022-02-09.
 3. "Looking back at Bollywood in Posters". Rediff.com. 2010-06-01. Retrieved 2022-02-09.
 4. "IndiaGlitz - Original Paro of 'Devdas' passes away - Bollywood Movie News". Indiaglitz.com. Archived from the original on 2008-01-15. Retrieved 2022-02-09.
 5. "Roop Lekha (1934)". chiloka.com. Retrieved 2022-02-09.
 6. Namrata Joshi. "Namrata Joshi on Shivendra Singh Dungarpur's enviable collection of film memorabilia". The Hindu. Retrieved 2022-02-09.

బయటి లింకులు[మార్చు]