Jump to content

జయరామ్ పాంగి

వికీపీడియా నుండి
జయరామ్ పాంగి
జయరామ్ పాంగి


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
ముందు గిరిధర్ గమాంగ్
తరువాత జినా హికాకా
నియోజకవర్గం కోరాపుట్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1977 - 1980
1990 - 1995
2000 - 2009
నియోజకవర్గం పొట్టంగి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్, బిజూ జనతాదళ్, బీఆర్ఎస్
బంధువులు చంద్రమా శాంత (మేనత్త)

జయరామ్ పాంగి ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పొట్టంగి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జయరామ్ పాంగి 1977లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పొట్టంగి శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన 1990లో రెండోసారి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. జయరామ్ పాంగి ఆ తరువాత జనతాదళ్ పార్టీని వీడి బిజూ జనతాదళ్ పార్టీలో చేరి 2000, 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

జయరామ్ పాంగి 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2017లో బీజేడీని వీడి బీజేపీలో చేరి[2], 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఆయన 2023 జనవరి 27న హైదరాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరాడు.[3]

జయరామ్ పాంగి 2 డిసెంబర్ 2023న బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (12 April 2024). "ఒకే కుటుంబం నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  2. "Former BJD MP Jayaram Pangi joins BJP | Indiablooms - First Portal on Digital News Management" (in ఇంగ్లీష్). 9 May 2017. Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  3. Eenadu (27 January 2023). "కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  4. ThePrint (2 December 2023). "Ex-BJD MP Jayaram Pangi joins Congress in Odisha". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024. Ex-BJD MP Jayaram Pangi joins Congress in Odisha