జయసిన్హ్‌రావ్ ఘోర్పడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయసిన్హ్‌రావ్ ఘోర్పడే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జయసిన్హ్‌రావ్ మాన్‌సిన్హ్‌రావ్ ఘోర్పడే
పుట్టిన తేదీ(1930-10-02)1930 అక్టోబరు 2
పంచ్‌గని, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1978 మార్చి 29(1978-03-29) (వయసు 47)
వడోదర, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుLegbreak googly
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 70)1953 ఫిబ్రవరి 19 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1959 ఆగస్టు 20 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 8 82
చేసిన పరుగులు 229 2,631
బ్యాటింగు సగటు 15.26 25.54
100లు/50లు 0/0 2/16
అత్యధిక స్కోరు 41 123
వేసిన బంతులు 150 3,515
వికెట్లు 0 114
బౌలింగు సగటు 30.83
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 6/19
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 33/–
మూలం: CricInfo, 2022 నవంబరు 20

జయసిన్హ్‌రావ్ మాన్‌సిన్హ్‌రావ్ ఘోర్పడే (1930 అక్టోబరు 2 - 1978 మార్చి 29) 1953 నుండి 1959 వరకు ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయ క్రికెట్ ఆటగాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్

[మార్చు]

జయసిన్హ్‌రావ్ ఘోర్పడే ఫస్ట్-క్లాస్ క్రీడా జీవితం 1948-49 సీజన్ నుండి 1965-66 సీజన్ వరకు కొనసాగింది. ఘోర్పడే దూకుడుగా ఉండే కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. లెగ్ బ్రేక్ బౌలర్‌గా కళ్లద్దాలు ధరించి బౌలింగ్ చేసేవాడు.

అరవైల మధ్యలో బరోడా తరపున ఆడటం ప్రారంభించాడు. అతను 1957-58 సీజన్‌లో రాజస్థాన్ తరఫున 123 పరుగుల వ్యక్తిగత అత్యుత్తమ స్కోర్ చేశాడు. 1952-53 సీజన్‌లో పాకిస్తాన్‌పై భారత విశ్వవిద్యాలయాలలో సభ్యుడిగా 6/19 తో వ్యక్తిగత అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసాడు. అతని మొత్తం ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో, రెండు సెంచరీలతో, 25.54 సగటుతో 2631 పరుగులు చేశాడు. 30.91 సగటుతో 114 వికెట్లు తీశాడు.[1]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

జైసింగ్‌రావ్ ఘోర్పడే తన క్రీడా జీవితంలో ఎనిమిది టెస్టులు ఆడాడు. అతను 1953 ఫిబ్రవరి 19 న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై తన తొలి టెస్టు ఆడాడు. 1959 ఆగస్టు 20 న ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో తన చివరి టెస్టు ఆడాడు.

1953లో భారత్ వెస్టిండీస్‌లో పర్యటించింది. పర్యటనలో అతన్ని ప్రత్యామ్నాయ ఆటగాడిగా తీసుకున్నారు. తొమ్మిదో నంబర్‌లో ఆడుతూ విలువైన 35 పరుగులు చేశాడు. చివరి టెస్టులో సమయోచితంగా 24 పరుగులు చేసి జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. అయినప్పటికీ, ఆల్-రౌండర్‌గా అవసరమైన లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, అతను యాభైలలో ఒక టెస్ట్ మ్యాచ్‌ ఆటగాడిగా తనను తాను స్థాపించుకోవడంలో విఫలమయ్యాడు.

1955-56 సీజన్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించింది. కోల్‌కతాలో జట్టు చేసిన 132 పరుగులలో 39 పరుగులతో ఘోర్పడే, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 1956-57 సీజన్‌లో బాంబేలో ఆస్ట్రేలియాతో ఆడాడు. రెండేళ్ల తర్వాత కోల్‌కతాలో వెస్టిండీస్‌తో తలపడ్డాడు. 1959లో ఇంగ్లండ్ వెళ్లే అవకాశం వచ్చింది. ఫస్ట్ క్లాస్ గేమ్‌లలో 23.80 సగటుతో 833 పరుగులు చేశాడు. అతను పాల్గొన్న మూడు టెస్టుల్లో 100 పరుగులు చేశాడు. అతను లార్డ్స్‌లో జరిగిన సిరీస్‌లోని రెండవ టెస్టులో జట్టు చేసిన 168 పరుగులలో 41 పరుగులు చేయడం ద్వారా అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఇదే అతని అత్యధిక టెస్టు స్కోరు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Jayasinghrao Ghorpade Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-28.
  2. "Jayasinghrao Ghorpade Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-28.