జర్లపాలెం (కొండపి)
జర్లపాలెం (కొండపి) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°23′26.12″N 79°46′21.76″E / 15.3905889°N 79.7727111°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కొండపి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
జర్లపాలెం ప్రకాశం జిల్లా కొండపి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]జాళ్ళపాలెం గ్రామం, పెదకండ్లగుంట పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం, ఉగాది పర్వదినం సందర్భంగా వైభవంగా నిర్వహించెదరు. ఈ తిరునాళ్ళకు ప్రకాశం జిల్లా నుండియేగాక హైదరాబాదుచెన్నై, బెంగళూరు వంటి దూర ప్రాంతాల నుండి గూడా భక్తులు విరివిగా విచ్చేయుదురు. ఆ రోజు ఆలయంలో ఉదయం నుండియే స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. స్వామివారికి మ్రొక్కుకున్న భక్తులు, ఉదయం నుండి పొంగళ్ళు, తలనీలాలు సమర్పించుకొని, మ్రొక్కులు తీర్చుకుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చు భక్తుల కొరకు, అన్నసంతర్పణ, మజ్జిగ, మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేసెదరు. తిరునాళ్ళ సందర్భంగా, గ్రామంలో విద్యుత్తు ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసెదరు. దూరప్రాంతాల నుండి వచ్చు భక్తులకొరకు, ఆర్.టి.సి. వారు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయుదురు.