జల్ మహల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జల్ మహల్ (నీటి భవంతి అని అర్ధం) భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్ర  రాజధాని జైపూర్ నగరంలో గల మన్ సాగర్ సరస్సు లో ఉన్న భవంతి. ఈ భవంతినీ, దాని చుట్టూ ఉన్న సరస్సునీ 18వ శతాబ్దంలో అంబర్  మహారాజు జై సింగ్ II పునర్నిర్మించారు. పునర్నిర్మాణం తర్వాత  ఈ సరస్సు, భవంతీ చాలా మారిపోయాయి. బృందావన్ కు చెందిన  సంప్రదాయ పడవ తయారీదారులు రాజపుత్ శైలిలో చెక్క పడవలను తయారు చేశారు. ఆ పడవల్లో పర్యాటకులు భవంతి దగ్గరకు వెళ్తూ ఉంటారు. భవంతి మొదటి అంతస్తులో సంప్రదాయ వస్తువులతో  అలంకరించిన  హాలు, దారులు ఉన్నాయి. అవి దాటితే చమేలీ భాగ్ అనే  తోటకు చేరుకోవచ్చు. ఈ సరస్సులో ప్రయాణం చేసేటప్పుడు చుట్టూ ఎత్తైన కొండలు, ప్రాచీన కోటలు, దేవాలయాలు, మరోపక్క సందడిగా ఉండే జైపూర్ నగరాన్ని వీక్షించవచ్చు. ఈ సరస్సును పునర్నించినపుడు ఆ నీటిలోని చెడు పదార్ధాలను డ్రైన్ల ద్వారా బయటకు పోయే మార్గాన్ని  తయారు చేశారు. ఈ సరస్సులోని జలచరాలనూ, చుట్టూ ఉన్న  చెట్లనూ మార్చి వేరేవి వేశారు. పక్షులు ఆవాసాలు ఏర్పరుచుకునేందుకు చిన్న చిన్న ద్వీపాలను నిర్మించారు. మొత్తానికి ఈ సరస్సు,  భవంతిల పునర్నిర్మాణం తర్వాత పర్యాటకంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ జల్ మహల్.

రాత్రిపూట జల్ మహల్ సోయగం.
జల్ మహల్- జైపూర్ నగరంలోని మన్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న భవంతి.

భౌగోళిక విశేషాలు

[మార్చు]
జైపూర్ లోని ఆరావళీ పర్వత శ్రేణులు.

రాజస్థాన్ రాజధాని జైపూర్, అమెర్ నగరాల మధ్య ఉంది ఈ సరస్సు. ఆరావళీ పర్వత శ్రేణుల మధ్య 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ సరస్సును ఉత్తర, తూర్పు, పడమర దిక్కులలో పూర్తిగా ఆరావళీ పర్వతాలు కప్పబడి ఉన్నాయి. దక్షిణం వైపు మాత్రం పూర్తిగా నగరం ఉంటుంది. ఈ పర్వతాలలో నహర్ గఢ్ కోట ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మన్ సాగర్ లేక్, జల్ మహల్ లు, మరోవైపు నగరం కనపడుతూ ఉంటాయి. ఈ కోట నుంచి వీటిని చూడటానికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఈ సరస్సును నిర్మించేందుకు ఖిలగఢ్ కొండలు, నహర్ గఢ్ ల మధ్య దర్భవతీ నదిపై ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్టను 16వ శతబ్ధంలో కట్టారు. ఈ సరస్సు డ్రైనేజ్ ఏరియా 23.5 కిలోమీటర్లు. ప్రతీ ఏడాదీ దాదాపు 657.4 మిల్లీమీటర్ల వర్షం పడుతూ ఉంటుంది. ఈ నీరు రిజర్వాయర్ లో నిలిచి ఉంటుంది. డ్యాం చివరి భాగంలో నీటిపారుదల వ్యవస్థ ఉంది. నాహర్ గఢ్ కొండలు, జైపూర్, బ్రహ్మపురి, నగ్టలైల నుంచి పెద్ద ఎత్తున చెత్త పదార్ధాలతో కూడిన నీ రు ఇందులోకి కలుస్తోంది.[1][2][3][4]  ఈ సరస్సు ఈశాన్య దిక్కులో  ఆరావళీ పర్వతశ్రేణుల్లో ఉన్న కొండలో ఎన్నో ఖనిజాలున్నాయి. అదే  దిక్కులో కనక్ వృందావన్ లోయలో ఒక గుడి కూడా ఉంది.

చరిత్ర

[మార్చు]
జల్ మహల్ సరస్సు వద్ద ఉన్న మన్ సాగర్ డ్యామ్

గతంలో ఈ ప్రదేశం దగ్గర నీరు పేరుకుపోవడంతో బురదగా మట్టి అణిగిపోయి గుంటలు గుంటలుగా ఉండేది. 1596లో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు సంభవించింది. ఆ సమయంలో అమెర్ ప్రాంత చక్రవర్తి ఒక డ్యాం నిర్మించి నీటి కరవు తీర్చాలని భావించారు. అమెర్, అమగఢ్ పర్వతాల్లో దొరికే మట్టి, లోహాలను ఉపయోగించి ఈ డ్యాంను నిర్మించారు. 17వ శతాబ్దంలో దీనిని పూర్తిగా రాతితో పునర్నిర్మించారు. ఈ డ్యాం 300 మిటర్ల ఎత్తు, 28.5-34.5 మీటర్ల వెడల్పుతో ఉంది. మూడు గేట్లు గల ఈ డ్యాం నుంచి నీరు వ్యవసాయానికి మళ్ళిస్తారు. అప్పట్నుంచీ రాజస్థాన్ ప్రాంత రాజులు ఈ సరస్సు, డ్యాం, భవంతికి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం ఈ భవంతి, సరస్సుల పునర్నిర్మాణం, సుందరీకరణ చేసిన అమెర్ ప్రాంతపు 18వ శతాబ్దపు రాజు జై సింగ్ IIకు ఘనత ఇస్తుంటారు అందరు. ఆయన హయాంలోనే ఈ ప్రాంతంలో అమెర్ కోట, జైగఢ్ కోట, నహర్ గఢ్ కోట, ఖలింగఢ్ ఖోట, కనక్ వృందావన్ లోయ వంటి ఎన్నో చారిత్రక కట్టడాలు నిర్మించారు. ప్రస్తుతం ఈ కట్టడాలన్నీ జైపూర్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Innovation Report: Jal Mahal Tourism Project" Archived 2010-01-03 at the Wayback Machine (pdf).
  2. "Mansagar Lake".
  3. "Lake Restoration toward Creating Tourism Infrastructure".
  4. 4.0 4.1 "Impact of Urbanization on Urban Lake Using High Resolution Satellite Data and GIS(A Case Study of Man Sagar Lake of Jaipur, Rajasthan)"[permanent dead link] (pdf).  ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Joshi" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. "Tourism deal"[permanent dead link].
  6. "Jal Mahal gets a Rs1000 cr facelift". rediff.com.
"https://te.wikipedia.org/w/index.php?title=జల్_మహల్&oldid=3101266" నుండి వెలికితీశారు