జాతీయ పౌర సేవల దినోత్సవం
స్వరూపం
జాతీయ పౌర సేవల దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | భారతదేశం |
ప్రారంభం | 2016 |
జరుపుకొనే రోజు | 21 ఏప్రిల్ |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
జాతీయ పౌర సేవల దినోత్సవం ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.[1][2] భారతదేశంలోని ప్రజలందరికి ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్య లక్ష్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.[3]
ప్రారంభం
[మార్చు]ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా ప్రజలు వారివారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పౌర సేవల సంస్థ 2016, ఏప్రిల్ 21 ఈ పౌర సేవల దినోత్సవాన్ని ప్రారంభించింది.
కార్యక్రమాలు
[మార్చు]- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రధానమంత్రి పేరిట అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. 2006లో ప్రారంభించబడిన అవార్డుల ప్రకారం, వ్యక్తిగతంగా లేదా సమూహంగా లేదా సంస్థగా ఉన్న ప్రతినిధులందరు ఈ పథకానికి అర్హులు. వ్యక్తిగత బహుమతి లక్ష, సంస్థ బహుమతి ఐదు లక్షలు ఉంటుంది.[4]
- పౌర సేవల విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలోనన్న అంశంపై పౌర సేవల ఉద్యోగులకు శిక్షణా కార్యాక్రమాలు నిర్వహించబడుతాయి.
- పౌర సేవల గురించి, పౌరుల హక్కుల గురించి గ్రామస్థాయిలో గ్రామస్తులకు, విద్యార్థులకు అవగాహన కలిపిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, జాతీయం (6 March 2016). "కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్!". Archived from the original on 21 April 2019. Retrieved 21 April 2019.
- ↑ "Civil Services Day". New Delhi: Department of Administrative Reforms & Public Grievances, Ministry of Personnel, Public Grievances and Pensions. 8 June 2011. Archived from the original on 27 November 2011. Retrieved 21 April 2019.
- ↑ నమస్తే తెలంగాణ, మహబూబాబాద్ (22 April 2017). "మెరుగైన సేవలందిస్తేనే ఉద్యోగులకు గుర్తింపు". Archived from the original on 21 April 2019. Retrieved 21 April 2019.
- ↑ "The Prime Minister's Awards for Excellence in Public Administration Award Scheme" (PDF). New Delhi: Department of Administrative Reforms & Public Grievances, Ministry of Personnel, Public Grievances and Pensions. 8 June 2011. Archived from the original (PDF) on 4 April 2015. Retrieved 21 April 2012.