Jump to content

జాతీయ భద్రతా పరిషత్తు, భారతదేశం

వికీపీడియా నుండి
జాతీయ భద్రతా పరిషత్తు
సంకేతాక్షరంNSC
స్థాపన4 March 1966
కేంద్రీకరణపారిశ్రామిక భద్రత
ప్రధాన
కార్యాలయాలు
ప్లాట్ నెం.98-A, ఇన్స్టిట్యూషనల్ ఏరియా, సెక్టర్ 15, సి.బి.డి బేలాపూరు, కొత్త ముంబై - 400 614
సేవా ప్రాంతాలుభారతదేశం
ప్రధానభాగంపరిషత్తు
అనుబంధ సంస్థలుకేంద్ర కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము
జాలగూడుOfficial website

జాతీయ భద్రతా పరిషత్తు అనేది భారతదేశంలో జాతీయ స్థాయిలో ఒక ప్రధాన, లాభాపేక్షలేని, స్వయం-ఫైనాన్సింగ్, త్రైపాక్షిక శిఖరాగ్ర సంస్థ.[1] ఇది జాతీయ స్థాయిలో భద్రత, ఆరోగ్యం , పర్యావరణం (SHE- భ.ఆ.ప.) పై స్వచ్ఛంద ఉద్యమాన్ని రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి, కొనసాగించడానికి, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం 1966 మార్చి 4 న ఏర్పాటు చేయబడిన ఒక స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, 1860 క్రింద సొసైటీగా నమోదు చేయబడింది, తరువాత, బాంబే పబ్లిక్ ట్రస్ట్ చట్టం, 1950 ప్రకారం పబ్లిక్ ట్రస్ట్ గా నమోదు చేయబడింది.

ధ్యేయం

[మార్చు]

నివారణ సంస్కృతి, శాస్త్రీయ మనస్తత్వం, SHE- భ.ఆ.ప సమస్యలకు వ్యవస్థీకృత విధానాన్ని సృష్టించడం ద్వారా సమాజానికి సేవలు అందించడం. ఈ సమస్యలు ప్రాథమిక మానవతా అవసరాలని సంస్థ నమ్మకం. నాణ్యత, ఉత్పాదకతతో వాటి అంతర్గత సంబంధాన్ని సరిగ్గా అనుసంధానించగలిగితేనే, ఉత్పాదకత ప్రభావవంతమైనదవుతుందని కూడా సంస్థ నమ్ముతుంది.

నిర్వాహక బృందం

[మార్చు]

జాతీయ భద్రతా పరిషత్తు యొక్క నిర్వాహక బృందంలో., కేంద్ర ప్రభుత్వంచే నామినేట్ కాబడిన అధ్యక్షులతో సహా., బహుళపక్షాలకు చెందిన 51 మంది స్వతంత్ర సభ్యులు ఉంటారు., వారిలో

  • పరిషత్తు యొక్క తాజా మాజీ అధ్యక్షులు
  • 16 మంది కేంద్ర ప్రభుత్వంచేత నామినేట్ కాబడిన సభ్యులు ( యాజమాన్య సంఘాలు., కార్మిక సంఘాల నుండి ఎనిమిదేసి మంది).
  • సంయుక్త కార్యదర్శి, పారిశ్రామిక భద్రత & ఆరోగ్య విభాగం, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము
  • జాతీయ భద్రతా పరిషత్తు సాధారణ విభాగం నుండి ఎన్నిక కాబడిన 32 మంది సభ్యులు.
  • నిర్వాహక బృందం చేత నామినేడ్ కాబడిన నిపుణులు., ఒకరు.

విస్తృతి

[మార్చు]
  • శాఖలు - స్థానిక అవసరాలను., స్థానిక భాషలలో సేవలను గుర్తించేందుకు., అందుకునేందుకు., అవకాశమున్న చోట్లలో జాతీయ భద్రతా పరిషత్తు, రాష్ట్ర శాఖలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 21 రాష్ట్రలు & కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలకై 18 శాఖలు పనిచేస్తున్నాయి.
  • సభ్యత్వం - "భద్రత, ఆరోగ్యం , పర్యావరణం" గురించి ఆసక్తి ఉండి, సంస్థ సిద్ధాంతాలకు అంగీకరించే., సంస్థలు, వ్యక్తులు ఎవరైనా., పరిషత్తులో సభ్యులుగా చేరవచ్చు. ప్రస్తుతం., పరిషత్తులో 8500 వరకూ సభ్యులు ఉన్నారు. వీరిలో పరిశ్రమలు, విద్యాసంస్థలు, కార్మిక సంఘాలు, వృత్తి నిపుణులు, సాధారణ వ్యక్తులు కూడా ఉన్నారు.[2]

కార్యక్రమాలు

[మార్చు]
  • దేశవ్యాప్తంగా ప్రత్యేక శిక్షణా కోర్సులు, సమావేశాలు, సదస్సులు, శిక్షణా తరగతులు నిర్వహించడం
  • భద్రతా తనిఖీలు (Safety Audits), ఆపద లెక్కింపు (Hazard Evaluation), అత్యవసరాల నిర్వహణా ప్రణాళిక (Emergency Management Planning) & నష్ట-సంభావ్యత లెక్కింపు (Risk Assessment) వంటి సలహా కార్యక్రమాలను.
  • HSE ప్రచార సామగ్రి & ప్రచురణల రూపకల్పన, అభివృద్ధి
  • రహదారి భద్రతా వారం, భద్రతా దినం, అగ్నిమాపక సేవా వారం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వంటి ప్రచారాలను జరుపుకోవడంలో సంస్థలకు సహకారాన్ని అందించడం
  • అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించారు ఉదా. XIII వరల్డ్ కాంగ్రెస్ (1993), XI అపోషో కాన్ఫరెన్స్ (1995), అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అమలు చేశాయి

సంస్థ తన లక్ష్యాన్ని సాధించేందుకు, అంటే సమాచారాన్ని సేకరించడం, తిరిగి పొందడం, వ్యాప్తి చేయడానికి కంప్యూటరీకరించిన నిర్వహణ సమాచార సేవ ఏర్పరచింది.[3]

విద్యార్థుల కోసం అగ్ని నష్ట-సంభావ్యత లెక్కింపు (Fire Risk Assessment) యొక్క DVD ను రూపొందించింది.[4]

జాతీయ/అంతర్జాతీయ సహాయసహకారాలు

[మార్చు]

జాతీయ భద్రతా పరిషత్తు, అనేక జాతీయ / అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వాటిలో జాతీయ విపత్తు నిర్వహణ శాఖ (NDMA), జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM), భారతీయ కొలమానాల సంస్థ (BIS), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), ఐక్య రాజ్య పర్యావరణ కార్యాచరణ (United Nations Environment Programme), ఆసియా - పసిఫిక్ వృతి భద్రత & అరోగ్య సంస్థ (APOSHO), అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ భద్రతా పరిషత్తు, జర్మనీయ సామాజిక ప్రమాద బీమా (DGUV), జపనీయ పారిశ్రామిక భద్రత & ఆరోగ్య సంఘం (JISHA), కొరియా వృతి భద్రత & ఆరోగ్య సంస్థ (KOSHA), ఇతర దేశాల భద్రతా పరిషత్తులు మొదలైనవి ఉన్నాయి.[2]

మూలాలు

[మార్చు]
  1. "అధికారిక జాలగూడు". Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
  2. 2.0 2.1 పరిషత్తు వార్షిక డెయిరీ
  3. "భారతీయ పారిశ్రామిక భద్రత & భద్రతా సరఫరాదారులు". Archived from the original on 2012-07-24. Retrieved 2019-10-06.
  4. ఫైర్ రిస్క్ అసెస్‌మెంట్ వీడియో