జానపద సాహిత్యంలోని మహిళా యోధుల జాబితా
స్వరూపం
యుద్ధాల్లో పాల్గొని పౌరాణిక, జానపద కథల్లో నిలిచిపోయిన మహిళల జాబితా ఇది, వీరిని సాహిత్యం, సామాజిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, మానవ శాస్త్రం, ఫిల్మ్ స్టడీస్, కల్చరల్ స్టడీస్, వుమెన్స్ స్టడీస్ వంటి రంగాలలో అధ్యయనం చేశారు. మైథలాజికల్ ఫిగర్ అంటే వాళ్ళు కల్పితం అన్న అర్థం సర్వత్రా వర్తించదు, వాళ్ళ గురించిన కథలు ప్రజల సాంస్కృతిక వారసత్వంలో చేరిపోతే వారిని మైథలాజికల్ ఫిగర్స్ అంటారు. కొంతమంది మహిళా యోధుల గురించి లిఖితపూర్వక, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి,[1] [2] మరికొందరు నేరుగా చరిత్రలో భాగంగానే ఉంటారు. అయితే, యోధురాలిగా పరిగణింపబడాలంటే వారు వ్యవస్థీకృత మిలటరీలోనో, తిరుగుబాటుదారుల గుర్తింపులేని మిలటరీలోనో ఏదోక సైన్యంలో పాలుపంచుకుని ఉండాలి.
సముద్రపు దొంగలు, నావికులు
[మార్చు]- సుప్రసిద్ధ ఇంగ్లిష్ సముద్రపు దొంగ కాలికో జాక్‌తో కలసి అన్నే బోనీ, మేరీ రీడ్ నౌకలను నడిపారు. మేరీ మగవారిలా కనిపించే దుస్తులు ధరించేది. అన్నే చివరికి జాక్ ని ప్రేమించింది, వారిద్దరికీ ఒక సంతానం కలిగింది. 1720 అక్టోబరులో వారి ఓడపై ఒక బ్రిటిష్ రాయల్ ఫ్లీట్ దాడి చేసింది. ఒకరు మినహా మగ సముద్రపు దొంగలందరూ తప్పతాగి, భయంతో డెక్ కింద దాక్కుని చూస్తూండగా ఈ ఇద్దరు మహిళలు సాహసంతో ఆ సైనికులతో పోరాడారు. చివరకు దొరికిపోయి ఖైదు చేయబడినప్పుడు, బోనీ ఉరితీయబడ్డ తన ప్రేమికుడి గురించి ఇలా అన్నట్టు చెప్తారు: "అతన్ని ఆ పరిస్థితిలో చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది, కానీ అతను మగాడిలా పోరాడినట్లయితే, అతన్ని కుక్కలా ఉరితీయబడేవాడు కాదు."[3]
- చింగ్ షి, సుప్రసిద్ధ చైనీస్ "సముద్రపు దొంగల రాణి". 300 పైచిలుకు నౌకలకు, 20,000 నుండి 40,000 మంది సముద్రపు దొంగల సైన్యానికి నాయకత్వం వహించి ప్రసిద్ధి చెందింది. ఆమె 18, 19 శతాబ్దాలలో జీవించింది.
- గ్రైనే ఓ'మలే, ఐర్లాండ్‌కు చెందిన సుప్రసిద్ధ "సముద్రపు దొంగల రాణి". ఆమె 16వ శతాబ్దంలో జీవించింది.
- ముయిరిస్క్, ఐర్లాండ్ కు చెందిన అరవై-ఆరవ హై కింగ్ (పెద్ద రాజు) ఉగైన్ మోర్ (హుగోనీ ది గ్రేట్) కుమార్తె.
- జీన్ డి క్లిసన్, ఫ్రెంచ్ రాజు తన భర్తను ఉరితీసినందుకు ప్రతీకారంగా వందేళ్ళ యుద్ధంలో ఆంగ్లేయుల పక్షాన నిలిచిన ఫ్రెంచ్ బ్రెటన్ సముద్రపు దొంగ.
- రాచెల్ వాల్, ఒక అమెరికన్ పైరేట్. ఆమె భర్త జార్జ్ వాల్ తో కలసి సముద్రపు దొంగతనాలు చేసేది. 1781-1782 మధ్యకాలంలో ఆమె, ఆమె సిబ్బంది కలసి 12 పడవలు స్వాధీనం చేసుకుని 23 సిబ్బందిని చంపేశారు. ఈ పని మానుకుని రిటైర్ అవుదామన్న ప్రయత్నం చేస్తూండగా దొంగతనంలో పట్టుబడి, 1789 అక్టోబర్ 8న ఉరిశిక్షకు గురై చనిపోయింది.[4]
ఆఫ్రికా
[మార్చు]అంగోలా
[మార్చు]- డోంగో, మతాంబకు చెందిన జింగా 17వ శతాబ్దం ప్రారంభంలో పోర్చుగీసుతో పోరాడి 30 ఏళ్ళ పాటు అంగోలాకు పోర్చుగీసు పాలన లేకుండా చేసింది.
బెనిన్ చరిత్ర
[మార్చు]- దహోమీ అమెజాన్స్ అనేది ఒక ఫొన్ తెగకు చెందిన అందరూ మహిళలే ఉండే సైనిక రెజిమెంటు, ఇది ఒక ఆఫ్రికన్ రాజ్యం (c. 1600–1894) ప్రస్తుత రిపబ్లిక్ ఆఫ్ బెనిన్ ప్రాంతంలో ఉంది. అనటోలియాలోనూ, నల్ల సముద్రంలోనూ ఉండేవారని ప్రాచీన కాలంలో పేరున్న అమెజాన్స్ తెగవారి పేరు మీదుగా వారికి పాశ్చాత్య పరిశీలకు, చరిత్రకారులు ఆ పేరు పెట్టారు.
బెర్బెర్ చరిత్ర
[మార్చు]- కహీనా లేదా అల్-కహీనా ( క్లాసికల్ అరబిక్ ప్రకారం మహిళా ద్రష్ట (సీర్)) 7వ శతాబ్దపు బెర్బర్ తెగకు చెందిన మత, సైనిక నాయకురాలు. వాయువ్య ఆఫ్రికాలో అరబ్ విస్తరణ ఆనాడు సుమిడియా అనీ, ఇప్పుడు మాగ్రెబ్ అని పిలిచే ప్రాంతంలో స్థానిక ప్రజల నుంచి ప్రతిఘటనకు ఈమె నేతృత్వం వహించింది. 7వ శతాబ్ది ప్రారంభంలో జన్మించిన ఈమె, 7వ శతాబ్దం చివరిలో బహుశా ఇప్పటి అల్జీరియా ప్రాంతంలో మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ Newitz, Annalee (January 1, 2021). "What New Science Techniques Tells Us About Ancient Women Warriors - Recent studies show that man was not always the hunter". The New York Times. Retrieved January 2, 2021.
- ↑ Haas, Randall (4 November 2020). "Female hunters of the early Americas".
- ↑ ^ Druett, Joan (2000). She Captains : Heroines and Hellions of the Sea. New York: Simon & Schuster.
- ↑ https://www.nps.gov/articles/dyk-women-pirates-in-the-usa. htm https://www.nps.gov/people/rachel-wall.htm