జాన్ వార్డ్
దస్త్రం:John Ward of New Zealand.jpg | ||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జాన్ థామస్ వార్డ్ | |||||||||||||||||||||
పుట్టిన తేదీ | తిమారు, న్యూజీలాండ్ | 1937 మార్చి 11|||||||||||||||||||||
మరణించిన తేదీ | 2021 జనవరి 12 తిమారు, న్యూజీలాండ్ | (వయసు 83)|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||
బంధువులు | బారీ వార్డ్ (కుమారుడు) | |||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 99) | 1964 ఫిబ్రవరి 21 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||
చివరి టెస్టు | 1968 మార్చి 7 - ఇండియా తో | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: CricInfo, 2017 ఏప్రిల్ 1 |
జాన్ థామస్ వార్డ్ (1937, మార్చి 11 - 2021, జనవరి 12) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1964 - 1968 మధ్యకాలంలో ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లలో వికెట్ కీపర్‌గా ఆడాడు.[1]
క్రికెట్ కెరీర్
[మార్చు]వార్డ్ 1958 ఇంగ్లాండ్ పర్యటన కోసం ట్రయల్ మ్యాచ్‌లో నార్త్ ఐలాండ్‌పై సౌత్ ఐలాండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు తీసుకున్నాడు. పర్యటనలో ఎరిక్ పెట్రీ డిప్యూటీగా ఎంపికయ్యాడు. 1959-60లో కాంటర్‌బరీ కోసం తన ప్లంకెట్ షీల్డ్ అరంగేట్రం చేసాడు. 1961-62లో దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు, అక్కడ ఆర్టీ డిక్‌కు డిప్యూటీగా పనిచేశాడు.[3]
చివరకు 1963-64లో దక్షిణాఫ్రికా పర్యాటక జట్టుతో జరిగిన మొదటి టెస్ట్‌లో తన టెస్టు అరంగేట్రం చేసాడు. [4] కానీ తర్వాత అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయిన డిక్‌కి తన స్థానాన్ని కోల్పోయాడు. 1964-65లో న్యూజీలాండ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మూడవ టెస్టుకు డిక్ స్థానంలో ఉన్నాడు. 1965లో ఏకైక వికెట్ కీపర్‌గా భారతదేశం, పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళాడు. భారత్‌తో జరిగిన మొదటి టెస్టులో తన అత్యధిక టెస్ట్ స్కోరు 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు, రిచర్డ్ కొలింగేతో కలిసి చివరి వికెట్‌కు 61 పరుగులు జోడించాడు.[5] సంవత్సరం తరువాత ఇంగ్లాండ్‌లో, వార్డ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మూడవ టెస్టుకు డిక్ స్థానంలో ఉన్నాడు. 1967-68లో భారత్‌తో జరిగిన నాల్గవ టెస్టు ఇతని చివరి టెస్టు.
వార్డ్ 1970-71 సీజన్ ముగిసే వరకు కాంటర్‌బరీ తరపున ఆడటం కొనసాగించాడు. 1969-70లో వెల్లింగ్టన్‌పై తన ఏకైక ఫస్ట్-క్లాస్ అర్థ సెంచరీని సాధించాడు. ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.[6] 1960 నుండి 1976 వరకు హాక్ కప్‌లో సౌత్ కాంటర్‌బరీకి ప్రాతినిధ్యం వహించాడు.[7]
మరణం
[మార్చు]వార్డ్ తన 83 సంవత్సరాల వయస్సులో 2021, జనవరి 12న స్వల్ప అనారోగ్యంతో తిమారులో మరణించాడు.[8] ఇతని కుమారుడు బారీ 1986-87 సీజన్‌లో కాంటర్‌బరీ తరపున ఆడాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Joseph Romanos, John Reid: A Cricketing Life, Hodder Moa Beckett, Auckland, 2000, p. 216.
- ↑ "North Island v South Island 1957-58". CricketArchive. Retrieved 14 January 2017.
- ↑ Piddington, Stu (11 February 2016). "Wicketkeeper Ward first 'South Canterbury Sportsperson of Year' 50 years ago". Stuff.co.nz. Retrieved 12 June 2020.
- ↑ "New Zealand v South Africa, Wellington 1963-64". CricketArchive. Retrieved 14 January 2017.
- ↑ India v New Zealand, Madras 1964-65
- ↑ "Wellington v Canterbury 1969-70". CricketArchive. Retrieved 14 January 2017.
- ↑ "Hawke Cup Matches played by John Ward". CricketArchive. Retrieved 11 May 2022.
- ↑ "Former New Zealand wicketkeeper John Ward remembered as a sharp gloveman". stuff.co.nz. 13 January 2021. Archived from the original on 15 January 2021. Retrieved 14 January 2021.
- ↑ Barry Ward at Cricket Archive