Jump to content

జాఫ్రా

వికీపీడియా నుండి

జాఫ్రా
జాఫ్రా గింజలు
Scientific classification
Genus:
బిక్సా
Species:
ఓరేళ్ళనా

జాఫ్రా దీనిని లిప్‌స్టిక్ చెట్టు, సింధూరీ, అనోట అని కూడా పిలుస్తారు. ఈ మొక్క గింజల నుండి లిప్‌స్టిక్ను తయారు చేస్తారు. దీనిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో సాగుచేస్తున్నారు. ఇది ఉత్తర, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది[2]. దీనిని భారతదేశం, శ్రీలంక, జావా వంటి ఆసియాలోని ఉష్ణమండల ప్రాంతాలలో ప్రధానంగా విత్తనాలను రంగుల కోసం సాగు చేస్తున్నారు[3].

వివరణ

[మార్చు]

ఈ పంటకు పూర్తి నీటి సదుపాయము ఉండాలి. పొడిగా ఉండే భూమి జాఫ్రా పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే పంట చేతికి వస్తుంది. ఒక్కసారి నాటిన జాఫ్రా మొక్క దాదాపు 25 సంవత్సరాల పాటు కాపు ఇస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి ధర దాదాపు రూ.1000 నుంచి 1200 వరకు ఉంటుంది. ఈ చెట్టు 6–10 మీ (20–33 అడుగులు) ఎత్తు పెరుగుతుంది. దీనికి తెలుపు లేదా గులాబీ రంగులో పువ్వులు పూస్తాయి, దీని కాయలు ఎరుపు-గోధుమ రంగులో ఉంటాయి. లోపలి గింజలు రక్త వర్ణంలో ఉంటాయి.[4]

ఉపయోగాలు

[మార్చు]
  • లాటిన్ అమెరికన్, జమైకన్, చమోరో, ఫిలిపినో వంటకాలలో ఈ గింజలను సూప్, గ్రేవీ, సాస్‌ కోసం వాడతారు[5].
  • ఇది విషపూరితం కానందున దీనిని ప్రధానంగా ఐస్ క్రీం, మాంసాలు, పాల ఉత్పత్తులు (చీజ్‌లు, వెన్న, వనస్పతి), మసాలా దినుసులకు రంగు వేయడానికి ఉపయోగిస్తారు.[6]
  • దీనిని సౌందర్య ఉత్పత్తులలో లిప్‌స్టిక్, హెయిర్ కలరింగ్ ఉత్పత్తులు, నెయిల్ పాలిష్, సబ్బులు, లక్కలలో ఉపయోగిస్తారు.
  • జాఫ్రా నూనెలో టోకోట్రినాల్స్, బీటా-కెరోటిన్, ముఖ్యమైన నూనెలు, సంతృప్త, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి ఉన్నాయి[7].

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Wheeler, L. & Beech, E. 2019. Bixa orellana. The IUCN Red List of Threatened Species 2019: e.T61986316A61986320. https://dx.doi.org/10.2305/IUCN.UK.2019-2.RLTS.T61986316A61986320.en. Downloaded on 11 October 2021.
  2. Lord, Tony (2003) Flora : The Gardener's Bible : More than 20,000 garden plants from around the world. London: Cassell. ISBN 0-304-36435-5.
  3. "లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్‌లోనూ జోరుగా సాగు". BBC News తెలుగు. 2019-05-09. Retrieved 2022-08-20.
  4. "Bixa orellana (annatto)". www.cabi.org. Retrieved 2022-08-20.
  5. Vilar, Daniela de Araújo; Vilar, Marina Suênia de Araujo; Moura, Túlio Flávio Accioly de Lima e; Raffin, Fernanda Nervo; de Oliveira, Márcia Rosa; Franco, Camilo Flamarion de Oliveira; de Athayde-Filho, Petrônio Filgueiras; Diniz, Margareth de Fátima Formiga Melo; Barbosa-Filho, José Maria (2014). "Traditional Uses, Chemical Constituents, and Biological Activities of Bixa orellana L.: A Review". The Scientific World Journal. 2014: 857292. doi:10.1155/2014/857292. ISSN 2356-6140. PMC 4094728. PMID 25050404.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  6. "Achiote: The Spice That Dyes Food Yellow". The Spruce Eats. Retrieved 2022-08-20.
  7. Ângela de Almeida Meireles, Maria; Lima Cavalcante de Albuquerque, Carolina. "Processo otimizado para obtenção de óleo rico em antioxidantes de urucum" (PDF). Inova. Unicamp. Retrieved 2 Jun 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=జాఫ్రా&oldid=4099605" నుండి వెలికితీశారు