Jump to content

జార్జియా ప్లిమ్మర్

వికీపీడియా నుండి
జార్జియా ప్లిమ్మర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జార్జియా ఎల్లెన్ ప్లిమ్మర్
పుట్టిన తేదీ (2004-02-08) 2004 ఫిబ్రవరి 8 (వయసు 20)
వెల్లింగ్టన్, న్యూజిలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 146)2022 సెప్టెంబరు 25 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 జూలై 2 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 61)2022 ఆగస్టు 6 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2023 జూలై 12 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019/20–presentవెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20
మ్యాచ్‌లు 2 7
చేసిన పరుగులు 17 46
బ్యాటింగు సగటు 17.00 9.20
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 17 17
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/–
మూలం: Cricinfo, 13 February 2023

జార్జియా ఎల్లెన్ ప్లిమ్మర్ (జననం 2004, ఫిబ్రవరి 8) న్యూజీలాండ్ క్రికెటర్. ప్రస్తుతం వెల్లింగ్‌టన్ బ్లేజ్ తరపున కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడుతున్నది.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

2022 ఫిబ్రవరిలో, గాయపడిన లారెన్ డౌన్ స్థానంలో ఆమె 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికైంది.[2] 2022 మే లో, 2022–23 సీజన్ కోసం న్యూజీలాండ్ మహిళల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో పేరు పొందింది.[3][4]

2019–20 హాలీబర్టన్ జాన్‌స్టోన్ షీల్డ్‌లో వెల్లింగ్టన్ కోసం ప్లిమ్మర్ తన లిస్ట్ ఎ అరంగేట్రం చేసింది.[5] 2020–21 సూపర్ స్మాష్‌లో వెల్లింగ్టన్ తరపున తన టీ20 అరంగేట్రం చేసింది.[6]

2022 జూన్ లో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ కోసం న్యూజీలాండ్ జట్టులో ప్లిమ్మర్ ఎంపికయింది.[7] ప్లిమ్మర్ 2022 ఆగస్టు 6న కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాపై న్యూజీలాండ్ తరపున మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసింది.[8][9] 2022, సెప్టెంబరు 25న వెస్టిండీస్‌పై తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.[10]

2022 డిసెంబరులో, ప్లిమ్మర్ 2023 ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ అండర్-19 జట్టులో ఎంపికయ్యాడు.[11] టోర్నమెంట్‌లో 51.66 సగటుతో 155 పరుగులతో న్యూజీలాండ్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచింది.[12] 2023 జనవరిలో, ప్లిమ్మర్ 2023 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికైంది, దీనిలో ఆమె మూడు సార్లు ఆడింది.[13][14]

మూలాలు

[మార్చు]
  1. "Georgia Plimmer". ESPN Cricinfo. Retrieved 6 August 2022.
  2. "Lauren Down ruled out of World Cup with thumb fracture, uncapped Georgia Plimmer named replacement". ESPN Cricinfo. Retrieved 6 August 2022.
  3. "Plimmer offered first WHITE FERNS contract". Cricket Wellington. Retrieved 27 May 2022.
  4. "WHITE FERNS eye future: six new players offered contracts". New Zealand Cricket. Archived from the original on 26 మే 2022. Retrieved 27 May 2022.
  5. "Women's List A Matches played by Georgia Plimmer". NZC archive. Retrieved 6 August 2022.
  6. "Women's Twenty20 Matches played by Georgia Plimmer". NZC archive. Retrieved 6 August 2022.
  7. "Eden Carson, Izzy Gaze earn maiden New Zealand call-ups for Commonwealth Games". ESPN Cricinfo. Retrieved 20 May 2022.
  8. "2nd Semi-final (D/N), Commonwealth Games 2022, Aug 6 2022". ESPN Cricinfo. Retrieved 6 August 2022.
  9. "Australia enter Finals after beating New Zealand in a thriller by 5 Wickets". Female Cricket. Retrieved 6 August 2022.
  10. "3rd ODI, North Sound, September 25 2022, New Zealand Women tour of West Indies: West Indies Women v New Zealand Women". ESPN Cricinfo. Retrieved 12 December 2022.
  11. "White Ferns Spearhead First-Ever NZ Under-19 World Cup Squad". New Zealand Cricket. 13 December 2022. Archived from the original on 13 డిసెంబరు 2022. Retrieved 13 December 2022.
  12. "Records/ICC Women's Under-19 T20 World Cup, 2022/23 - New Zealand Women/Batting and Bowling Averages". ESPNcricinfo. Retrieved 30 January 2023.
  13. "Bernadine Bezuidenhout named in New Zealand's squad for Women's T20 World Cup". ESPNcricinfo. 19 January 2023. Retrieved 25 January 2023.
  14. "Records/ICC Women's T20 World Cup, 2022/23 - New Zealand Women/Women's Twenty20 Internationals/Batting and Bowling Averages". ESPN Cricinfo. Retrieved 8 March 2023.

బాహ్య లింకులు

[మార్చు]