జాస్తి ఈశ్వర్ ప్రసాద్
జస్టిస్ జాస్తి ఈశ్వర ప్రసాద్ | |||
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
| |||
పదవీ కాలం మార్చ్ 1990 – ఏప్రిల్ 1994 | |||
కర్ణాటక హైకోర్టు
| |||
పదవీ కాలం ఏప్రిల్ 1994 – ఆగష్టు 1996 | |||
స్పెషల్ కోర్డు చైర్మన్
| |||
పదవీ కాలం జనవరి 1997 – మార్చ్ 1997 | |||
పదవీ కాలం మార్చ్ 1997 – మార్చ్ 2003 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | మద్రాస్ , భారతదేశం | 1934 ఆగస్టు 4||
మరణం | 2021 జూలై 6 | (వయసు 86)||
జీవిత భాగస్వామి | జాస్తి చామంతి |
జస్టిస్ జాస్తి ఈశ్వర ప్రసాద్ భారతదేశానికి చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి. ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు.[3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఈశ్వర ప్రసాద్ 1934 ఆగస్టు 4లో మద్రాస్లో జాస్తి సాంబశివరావు, సీతామహాలక్ష్మీ దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి జాస్తి సాంబశివరావు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తిగా, తల్లి జాస్తి సీతామహాలక్ష్మీ న్యాయవాదిగా, సామాజికవేత్త పనిచేశారు. ఆయన మద్రాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. ఆయన 1959లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
వృత్తి జీవితం
[మార్చు]జస్టిస్ జాస్తి ఈశ్వర ప్రసాద్ 1990లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఆయన 1994లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యి 1996లో పదవీ విరమణ పొందాడు. ఆయన 1997లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూ ఆక్రమణల నిరోధక ప్రత్యేక కోర్టుకు 1997 జనవరి నుంచి 1997 మార్చి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన 1997 మార్చి నుండి 2003 మార్చి వరకు నేషనల్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా పనిచేశారు.[4]
మరణం
[మార్చు]జస్టిస్ జాస్తి ఈశ్వర ప్రసాద్ 6 జూలై 2021న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Indian Express: Harshad plea rejected
- ↑ Outlook News[permanent dead link]
- ↑ Sakshi Education (7 July 2021). "జస్టిస్ జాస్తి ఈశ్వర్‌ప్రసాద్ కన్నుమూత". Archived from the original on 8 July 2021. Retrieved 8 July 2021.
- ↑ Telugu, TV9 (6 July 2021). "Justice J Eswara Prasad: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వర ప్రసాద్ కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. - judge Justice J Eswara prasad dies at Hyderabad". TV9 Telugu. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andrajyothy (9 July 2021). "జస్టిస్ జాస్తి ఈశ్వర ప్రసాద్ కన్నుమూత". andhrajyothy. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.