జాస్మిన్ కౌర్ రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాస్మిన్ కౌర్ రాయ్
విశ్వవిద్యాలయాలులేడీ శ్రీరామ్ కళాశాల
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వృత్తిఫిల్మ్ మేకర్
పురస్కారాలురెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

జాస్మిన్ కౌర్ రాయ్ భారతదేశం నుండి రెండుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్వతంత్ర చిత్రనిర్మాత, వాండర్‌లస్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌లో అవినాష్ రాయ్‌తో కలిసి షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలను రూపొందించింది.[1] ఆమె చిత్రం అమోలి భారతదేశంలో పిల్లలపై వాణిజ్యపరమైన లైంగిక దోపిడీకి సంబంధించిన డాక్యుమెంటరీ. ఈ చిత్రం 2018 సంవత్సరానికి గాను ఉత్తమ పరిశోధనాత్మక చిత్రంగా 66వ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

విద్య

[మార్చు]

జాస్మిన్ న్యూఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి పొలిటికల్ సైన్స్ (ఆనర్స్)లో పట్టభద్రురాలయ్యింది. ఆ తరువాత పూణేలోని ఫిల్మ్ & టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఫిల్మ్ డైరెక్షన్‌లో నైపుణ్యం పొందింది. ఆమె బెర్లినేల్ టాలెంట్స్ 2015లో పార్టిసిపెంట్ డైరెక్టర్‌గా కూడా ఎంపికైంది.

కెరీర్

[మార్చు]

జాస్మిన్ షార్ట్ ఫిల్మ్స్, పలు డాక్యుమెంటరీలు తీసింది. ఆమె సాంజ్, మీనా, స్కావెంజింగ్ డ్రీమ్స్ వంటి కొన్ని చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి. అవి అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించబడ్డాయి.[2][3][4] ఆమె 'సాంజ్' అనే లఘు చిత్రానికి 52వ జాతీయ చలనచిత్ర అవార్డు (కుటుంబ సంక్షేమంపై ఉత్తమ చిత్రం), ఆమె డాక్యుమెంటరీ చిత్రం అమోలికి 66వ జాతీయ చలనచిత్ర అవార్డు (ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం) వరించాయి.[5] ఆమె షార్ట్ ఫిల్మ్ రావి (2022) న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించింది.

అమోలి

[మార్చు]

ఆమె 30 నిమిషాల డాక్యుమెంటరీ చిత్రం అమోలిని ది కల్చర్ మెషిన్ కింద నిర్మించింది. మే 2018లో ఆన్‌లైన్‌లో ఇది విడుదలైంది.[6][7][8][9][10] అమోలి భారతదేశంలో పిల్లలపై వాణిజ్యపరమైన లైంగిక దోపిడీకి సంబంధించిన డాక్యుమెంటరీ.[11][12][13][14] ఈ చిత్రానికి రాజ్‌కుమార్ రావ్ (హిందీ), విద్యాబాలన్ (ఇంగ్లీష్), కమల్ హాసన్ (తమిళం), పునీత్ రాజ్‌కుమార్ (కన్నడ), జిషు సేన్‌గుప్తా (బెంగాలీ), నాని (తెలుగు) కథనాలు అందించగా, తాజ్దార్ జునైద్ సంగీతం అందించాడు.[15][16][17] [18][19]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
  • స్కావెంజింగ్ డ్రీమ్స్
  • మీనా
  • సాంజ్ (లఘు చిత్రం)
  • అమోలి (2018 డాక్యుమెంటరీ)
  • రావి (2022 లఘు చిత్రం)

మూలాలు

[మార్చు]
  1. "Kamal Haasan, Vidya Balan lend voice to film on sexual exploitation". The News Minute. 2018-05-06. Retrieved 2018-05-27.
  2. "Ah, Light Of Day". Outlook India. Retrieved 2018-05-27.
  3. "L'UNESCO sort une série de films sur le thème des droits de l'homme". SIGNIS (in ఫ్రెంచ్). 2006-05-31. Archived from the original on 2018-05-11. Retrieved 2018-05-27.
  4. "'Scavenging dreams' to be screened at Eco-Vision fest - Times of India". The Times of India. Retrieved 2018-05-27.
  5. "Lights, camera, action - Times of India". The Times of India. Retrieved 2018-05-27.
  6. "Kamal Haasan, Rajkummar lend voice to film on sexual exploitation". The New Indian Express. Retrieved 2018-05-27.
  7. "Vidya Balan, Rajkummar Rao, Kamal Haasan, And Others Lend Voice To Amoli, A Documentary On Child Sex Trafficking". Silverscreen.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-05-08. Retrieved 2018-05-27.
  8. Kappal, Bhanuj (2018-05-04). "Amoli: The search for India's missing girls". Live Mint. Retrieved 2018-05-27.
  9. "Amoli: The fate of children kidnapped in India for sex". Deccan Herald (in ఇంగ్లీష్). 2018-05-05. Retrieved 2018-05-27.
  10. "अमोली: फिल्मी हस्तियों ने यौन शोषण पर फिल्म के लिए आवाज उठाई". Sakshipost Hindi (in ఇంగ్లీష్). Retrieved 2018-05-27.
  11. Sinha, Sayoni (2018-05-19). "Have you seen my girl?". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-05-27.
  12. Team, ELLE India. "This documentary exposes India's billion-dollar sex trafficking industry". Elle India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-05-27.
  13. Scroll Staff. "Watch: In 'Amoli', the hunt for a missing girl unravels the horrors of child sex trafficking". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-05-27.
  14. "This new documentary shines light in the life of a girl child trafficked for sex". mid-day. 2018-04-15. Retrieved 2018-05-27.
  15. R, Shilpa Sebastian; R, Shilpa Sebastian (2018-05-11). "Voicing his support". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-05-27.
  16. "AMOLI -The Silent Crusade Against Child Trafficking And Sex Trade!". tollytrip (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-05-07. Archived from the original on 2018-05-11. Retrieved 2018-05-27.
  17. IANS (2018-05-06). "Kamal Haasan, Rajkummar lend voice to film on sexual exploitation". Business Standard India. Retrieved 2018-05-27.
  18. "Kamal Haasan lends voice to film on sexual exploitation - Times of India". The Times of India. Retrieved 2018-05-27.
  19. "The Telegraph - Calcutta : Weekend". www.telegraphindia.com. Archived from the original on 29 August 2006. Retrieved 2018-05-27.