Jump to content

జింజివైటిస్

వికీపీడియా నుండి
జింజివైటిస్
చిగురువాపు తీవ్రమైన పరిస్థితి
ప్రత్యేకతదంత వైద్యం
లక్షణాలుసులభంగా రక్తస్రావం అయ్యే విధంగా ఎర్రటి వాపు చిగుళ్ళు
సంక్లిష్టతలుపెరిడాంటైటిస్, ఇంకా దంతాల నష్టం
కారణాలుపంటి గార, విటమిన్ సి లోపం, గర్భం దాల్చడం, ఫెనిటోయిన్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వంటి మందులు, ధూమపానం, నోరు పొడిగా ఉండటం
రోగనిర్ధారణ పద్ధతిదంత పరీక్ష
నివారణనోటి పరిశుభ్రత
చికిత్సదంత వైద్యులచే దంతాలు శుభ్రపరచుకోవడం, యాంటీబయాటిక్స్ లేదా శస్త్రచికిత్స
ఔషధంయాంటీబయాటిక్స్
రోగ నిరూపణచికిత్సతో మంచి ఫలితాలు ఉంటాయి

జింజివైటిస్ అనేది దంతాల దగ్గర చిగుళ్ళ వాపు. దీంట్లో కణజాల నాశనం జరుగదు[1][2].

లక్షణాలు

[మార్చు]

ప్రధానంగా చిగుళ్ళలో ఎర్రటి వాపు ఉండి సులభంగా రక్తస్రావం జరిగే విధంగా లక్షణాలు ఉండవచ్చు. సాధారణంగా నొప్పి ఉండదు. చిగుళ్ల వ్యాధి, ఇంకా దంతాల నష్టం ఉండవచ్చు[1].

కారకాలు

[మార్చు]

సాధారణంగా దంతాలకు అతుక్కుని గారలాంటి పొర ఉంటుంది. దానిలో బాక్టీరియా ఉంటుంది. ఆ పొరని 'ప్లాక్' అంటారు. ఇతర కారణాలలో విటమిన్ 'సి' లోపం, గర్భం దాల్చడం, ఫెనిటోయిన్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వంటి కొన్ని మందులు ఉన్నాయి. ధూమపానం, నోరు పొడిగా ఉండటం వంటివి ఇతర ప్రమాద కారకాలు[1]. రోగ నిర్ధారణ సాధారణంగా దంత పరీక్ష ద్వారా జరుగుతుంది. ఇది చిగుళ్ల వ్యాధికి ప్రారంభరూపం[3].

నివారణ

[మార్చు]

ప్రధానంగా నోటి పరిశుభ్రత వలన సమస్యను నివారించ వచ్చు. సాధారణంగా దంత వైద్యులచే దంతాలు శుభ్రపరచుకోవడం వంటి చికిత్స ఉంటుంది[4]. తీవ్రమైన పరిస్థితిలో యాంటీబయాటిక్స్ లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు[5]. సాధారణంగా చికిత్స వలన మంచి ఫలితాలు ఉంటాయి.

వ్యాప్తి

[మార్చు]

జింజివైటిస్ అనేది అత్యంత సాధారణమైన చిగుళ్ల వ్యాధి. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ప్రభావితమవుతారు. పిల్లలు, పెద్దవాళ్ళు ఇద్దరూ ప్రభావితమవుతారు[1]. చిగుళ్ళవాపు గురించి హిప్పోక్రేట్స్ క్రీ.పూ 400 లోనే వివరించాడు[6].

ఇవి చూడండి

[మార్చు]
  1. చిగుళ్ల వ్యాధి
  2. నోటి దుర్వాసన

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 M., Rathee; Jain, P (2021). Gingivitis. StatPearls. PMID 32491354.
  2. Limeback, Hardy (11 April 2012). Comprehensive Preventive Dentistry (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 58. ISBN 978-1-118-28020-1. Archived from the original on 28 August 2021. Retrieved 8 July 2021.
  3. "Gingivitis - Mouth and Dental Disorders". Merck Manuals Consumer Version (in కెనడియన్ ఇంగ్లీష్). Archived from the original on 27 February 2021. Retrieved 8 July 2021.
  4. "Periodontal Disease". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 14 December 2018. Archived from the original on 17 July 2021. Retrieved 8 July 2021.
  5. "Gingivitis - Dental Disorders". Merck Manuals Professional Edition (in కెనడియన్ ఇంగ్లీష్). Archived from the original on 28 August 2021. Retrieved 8 July 2021.
  6. Newman, Michael G.; Takei, Henry; Klokkevold, Perry R.; Carranza, Fermin A. (14 February 2011). Carranza's Clinical Periodontology (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 2. ISBN 978-1-4557-0638-9. Archived from the original on 28 August 2021. Retrieved 8 July 2021.