Jump to content

జిబ్రాల్టర్‌లో హిందూమతం

వికీపీడియా నుండి

జిబ్రాల్టర్‌లో హిందూమతం మైనారిటీ మతం. జనాభాలో 2% మంది హిందువులు. [1] హిందువుల్లో చాలా మంది సింధీ మూలానికి చెందినవారు.

జనాభా వివరాలు

[మార్చు]

2000 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 491 మంది ఉన్నారు. ఇది జిబ్రాల్టర్ జనాభాలో 1.8%. [2] 2012 నాటి అంచనా ప్రకారం, హిందువుల జనాభా దేశ జనాభాలో 2%. [3] [1]

1970 నుండి 2012 వరకు హిందువుల జనాభా కింది విధంగా ఉంది: [1]


సంవత్సరం హిందువుల జనాభా హిందువుల శాతం శాతం పెరుగుదల
1970 238 1.0%
1981 393 1.5% +0.5%
1991 555 2.1% +0.6%
2001 491 1.8% -0.3%
2012 628 2.0% +0.2%

చరిత్ర

[మార్చు]
జిబ్రాల్టర్ హిందూ దేవాలయంలో సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్రుడు

బ్రిటిషు భారతదేశం నుండి జిబ్రాల్టర్‌లోకి మొదటిగా 1870లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం నుండి కొత్త సూయజ్ కెనాల్‌ ద్వారా వచ్చినట్లు భావిస్తున్నారు. కొత్త సింధీ వ్యాపారులు రిమోట్‌గా నిర్వహించగలిగే వ్యాపారాలను స్థానిక నిర్వాహకులతో ఏర్పాటు చేసుకున్నారు. భారతీయులు జిబ్రాల్టేరియన్ల నుండి కొంత ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. 1921లో ఏడుగురు హిందూ వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి లైసెన్సులు పొందారు. 1950 నాటికి లైసెన్సుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. అయితే స్పానిష్‌ వారు సరిహద్దును మూసివేసినప్పుడు, స్పానిష్ షాప్ అసిస్టెంట్‌లు లేనప్పుడూ సహాయం కోసం అసలైన డిమాండు ఏర్పడింది. 1970 నాటికి దాదాపు 300 ట్రేడింగ్ లైసెన్సులు ఉన్నాయి [4]

హిందూ సమాజానికి ప్రతిఘటన ఉండేది. కానీ పెద్దలు కుదిర్చిన వివాహాలు తగ్గడం, జిబ్రాల్టర్‌లోని ఇతర సమూహాలతో కలిసి ఒకే పాఠశాలలకు పిల్లలను పంపడం వంటివి జరిగాయి. పౌరులు నిజమైన జిబ్రాల్టేరియనా కాదా అని నిర్ణయించే తేదీని, సాధ్యమైనంత ఎక్కువ మంది భారతీయులను మినహాయించటానికి రూపొందించబడింది. అయితే 1973 నాటికి స్థానిక హిందూ న్యాయవాది హరేష్ బుధ్రానీ హిందువులు పూర్తిగా సంఘంలో చేరగలరని అంచనా వేశాడు. [5]

1993 దీపావళి రోజున సంఘం జిబ్రాల్టర్ హిందూ దేవాలయాన్ని ప్రారంభించింది. 1999 నాటికి అలంకరణ పూర్తయింది. ప్రాణ ప్రతిష్ట వేడుకను భారతదేశానికి చెందిన ఒక పూజారి అధికారికంగా నిర్వహించాడు. జిబ్రాల్టర్ గవర్నర్ రిచర్డ్ లూస్ 2000 మార్చి 1 న ఆలయాన్ని అధికారికంగా ప్రారంభించాడు.

సమకాలీన సమాజం

[మార్చు]

2004లో బుధ్రానీ, హౌస్ ఆఫ్ అసెంబ్లీలో స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. [6] తరువాత అతను జిబ్రాల్టర్ పార్లమెంట్‌కు మొదటి స్పీకర్ అయ్యాడు. [7]

2012లో జిబ్రాల్టర్ మేయర్ హిందువుల పండుగ దీపావళిని జరుపుకోవడానికి హిందూ సమాజాన్ని జిబ్రాల్టర్ సిటీ హాల్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించడం సంచలనం కలిగించింది. [8]

5 లేదా అంతకంటే ఎక్కువ GCSE (గ్రేడ్‌లు A-C) సాధించిన విద్యార్థులలో హిందువులలో అత్యధిక నిష్పత్తి (%) ఉంది. డిగ్రీ ఉన్న పని చేసే వయస్సు గలవారిలో అత్యధిక శాతం హిందువులే. జిబ్రాల్టర్‌లో అత్యల్ప నేరాల రేటు కూడా హిందువుల్లోనే ఉంది.  

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 https://www.gibraltar.gov.gi/new/sites/default/files/HMGoG_Documents/Full%20Census%20Report%202012%20FINAL.pdf
  2. "Flag of Gibraltar". GeoNova Flags via HighBeam Research. 1 August 2007. Archived from the original on 24 September 2015. Retrieved 12 November 2012.(subscription required)
  3. The World Factbook
  4. Archer, Edward G. (2006). Gibraltar, Identity And Empire. Routledge. p. 233. ISBN 9780415347969.
  5. Archer, Edward G. (2006). Gibraltar, Identity And Empire. Routledge. p. 233. ISBN 9780415347969.
  6. Archer, Edward G. (2006). Gibraltar, Identity And Empire. Routledge. p. 233. ISBN 9780415347969.
  7. Gibraltar Parliament (ed.). "Composition of Parliament". Retrieved 2012-10-21.
  8. "Hindu laud Gibraltar Mayor". Bharat Press. November 2012. Archived from the original on 18 జనవరి 2013. Retrieved 12 December 2012.