జియా ఖాన్
జియా ఖాన్ | |
---|---|
జననం | నఫీసా ఖాన్ 1988 ఫిబ్రవరి 20 న్యూయార్క్, అమెరికా |
మరణం | 2013 జూన్ 3 | (వయసు 25)
మరణ కారణం | ఉరి |
ఇతర పేర్లు | నఫీసా ఖాన్ |
పౌరసత్వం | బ్రిటీష్[1] |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2007–2013 |
తల్లిదండ్రులు | అలీ రిజ్వీ ఖాన్ రబియా అమిన్ |
జియా ఖాన్ ఒక హిందీ సినీ నటి. జన్మతహ బ్రిటీష్ పౌరురాలు. నటించించి కేవలం మూడు చిత్రాలైనా బాగా పేరు తెచ్చుకుంది. 25 ఏళ్ళ చిన్న వయస్సులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
నేపధ్యము
[మార్చు]1988 ఫిబ్రవరి 20 న న్యూయార్క్ నగరంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి అలీ రిజ్వీ ఖాన్ ఒక భారత అమెరికన్ సంతతి వ్యక్తి. తల్లి రబియా ఆమిన్, ఆగ్రాకు చెందిన భారతీయ నటి. 1980 లలో ఈవిడ కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. జియా ఖాన్ విద్యాభ్యాసమంతా లండన్లో సాగింది. తర్వాత హిందీ సినిమాలలో నటించాలనే ఆసక్తితో తన మకాంను ముంబాయికి మార్చింది.వ్ ఈమెకు ఇద్దరు సోదరీమణులు కరిష్మా, కవిత. ఈమెకు ఆరేళ్ళపుడు విడుదలైన రాంగోపాల్‌వర్మ హిందీ చిత్రం స్ఫూర్తితో తను కూడా నటనను వృత్తిగా స్వీకరించాలని నిర్ణయించుకుంది.
సినీ ప్రస్థానము
[మార్చు]2007 లో 18 ఏళ్ళ వయస్సులో రాంగోపాల్ వర్మ నిశ్శబ్ద్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ సరసన కథానాయికగా సినీరంగ ప్రస్థానం ప్రారంభించింది. ఈ చిత్రం పరాజయం పాలైనా చిత్రంలో ఈవిడ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి గానూ ఫిలింఫేర్ పురస్కారానికి నామినేట్ అయ్యింది. తర్వాతి సంవత్సరంలో తమిళ హిందీ రీమేక్ గజిని లో నటించింది. తమిళంలో నయనతార పోషించిన పాత్రను హిందీలో ఈవిడ పోషించింది. 2010 లో సాజిద్ ఖాన్ చిత్రం హౌస్‌ఫుల్ లో ఆఖరిసారిగా నటించింది. ఈ చిత్రం తర్వాత మరేచిత్రంలో కూడా ఈవిడ కనిపించలేదు.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జియా ఖాన్ పేజీ
- ట్విట్టర్ లో జియా ఖాన్