Jump to content

జిరియాట్రిక్స్

వికీపీడియా నుండి

వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునే దానిని జిరియాట్రిక్స్ (Geriatrics) అంటారు. ఈ పదం గ్రీకు భాష నుంచి కనుగొనబడింది. Geron అంటే old man. Iatros అంటే heals అని అర్థం.

వృద్దుల సంరక్షణ నివాసంలో ఉన్న ఒక వృద్దురాలు.

నేపధ్యము

[మార్చు]
నార్వే లోని ఒక ఆసుపత్రిలో వృద్దుడు.

వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవ టం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం, వచ్చిన వ్యాధులకు మంచి చికిత్స ఇవ్వటం దీని ముఖ్య ఉద్దేశం. అరవైఐదు ఏళ్ళు పైబడినవారికి శరీరంలో వచ్చే మార్పుల వల్ల సరిగ్గా నిలబడలేక పోవటం, నడవలేకపోవటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, విసర్జనాలను ఆపుకోలేకపోవటం, చూపు మందగించ టం, వినికిడి తగ్గిపోవటం వంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. అంతేకాకుండా డిలిరియమ్, మానసిక ఒత్తిడికి గురి కావటం, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం. కొంతమందిలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకపోవచ్చు. కొంతమంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుండొచ్చు.

ఈ సమస్యలన్నీ జిరియాట్రిక్స్ అనే విభాగంలో పొందుపరచబడతాయి. వృద్ధులకు మంచి చికిత్స ఇవ్వటానికి ఒక ప్రత్యేక వైద్యుని నియమిస్తారు. వారినే Geriatrician అంటారు. ఈ విభాగం మొదటిసారిగా 1942లో అమెరికాలో స్థాపించబడింది.

ఆస్టియో ఆర్థరైటిస్

[మార్చు]

ఎముకలలో ఉండే మజ్జ కీళ్ళ మధ్య ఒక కుషన్‌లాగ పనిచేస్తుంది. వయస్సులో వచ్చే మార్పుల వల్ల కార్టిలేజ్ తరిగిపోవటం మార్పుల వల్ల రెండు ఎముకలు ఒక దానికొకటి రాసుకోవటం జరిగి కీళ్ళనొప్పికి దారి తీస్తుంది. దీనినే ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇది ఎక్కువగా వృద్ధులలో వచ్చే సమస్య. అందుకే దీనిని ‘ఓల్డ్‌పర్సన్స్ ఆర్థరైటిస్’ అని కూడా అంటారు. ఎముకలు ఇన్‌ఫ్లమేషన్‌కి గురై ఎక్కువ బరువు మోపటంతో కీళ్ళ నొప్పి వస్తుంది. అంతేకాకుండా కాలు కదపలేకపోవటం జరుగుతుంది. ఇది ఎక్కువగా 45 ఏళ్ళు పైబడిన వారిలో మగవారి కంటే స్త్రీలలో ఎక్కువ, అంతేకాకుండా కీళ్ళకు దెబ్బలు తగిలి ఇన్‌ఫ్లమేషన్ రావటం, యాక్సిడెంట్స్ వల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఊబకాయం వల్ల ముఖ్యంగా మోకాళ్ళు, కీళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్‌కి గురవుతున్నాయి. వంశానుగత కారణాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.

లక్షణాలు

[మార్చు]

85 శాతం మందిలో ఏ లక్షణాలూ లేకుండా ఉన్నా ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్ధారణ అవుతుంది. 35-50 శాతం మందిలో వ్యాధి లక్షణాలు తక్కువ నుంచి విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చేతి కీళ్ల నొప్పులతో స్త్రీలు పనిచెయ్యడానికి ఇబ్బంది పడుతుంటారు. బరువు మోపే కీళ్ళు, మోకాళ్ళు, తుంటి,, అరికాళ్ళు, వెన్నుపూస ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతాయి. మొదట ఒకటి రెండు కీళ్ళలో నొప్పి ఉండి బిరుసుగా ఉంటాయి. కదలికలు కష్టంగా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువసేపు నిలబడలేకపోవటం, ఎక్కువ దూరం నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేక పోవటం, రాత్రిపూట నొప్పి ఎక్కువ, చల్లగాలికి నొప్పులు ఎక్కువ అవ్వటం కింద కూర్చోనివ్వలేక పోవడం వీటి ముఖ్య లక్షణాలు.

ఆస్టియో పోరోసిస్

[మార్చు]

వృద్ధాప్యం వల్ల ఎముకలల్లో ఉన్న సాంద్రత (bone mass) కోల్పోయి, కణజాలం ఆకృతి, నాణ్యతను కోల్పోయి, ఎముకలలో ఉండే శక్తి తగ్గిపోతుంది. దీనినే ఆస్టియో పోరోసిస్ అంటారు. ఆస్టియోపోరోసిస్‌లో ఎముకలు ఎక్కువగా విరుగుతాయి.. ఎముకల బలహీనత, bone mass తగ్గిపోవటం మగవాళ్ళ కన్నా స్త్రీలలో ఎక్కువ, 35 శాతం స్త్రీలలో నెలసరి ఆగిపోయిన తరువాత కొన్ని హార్మోన్‌ల ఉత్పత్తి తగ్గి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది.

పురుషులలో స్త్రీల కంటే bone mass ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరగటంతో రక్తంలో టెస్టోస్టిరాన్, గ్రోత్ హార్మోన్స్, అడ్రినల్ యాండ్రోజెన్స్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనితోపాటు వారి జీవన విధానం, న్యూట్రిషనల్ డెఫీషియన్సీ ముఖ్యంగా క్యాల్షియం, ప్రోటీన్ డెఫీషియన్సీ, బోన్ మాస్ తగ్గించటానికి కారణమవుతాయి.

లక్షణాలు

[మార్చు]

కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండక ఎముక బలహీనత వల్ల విరిగే ప్రమాదముంది.ముఖ్యంగా మణికట్టు, మోచేతి పై ఎముక (humerus), తుంటి ( hip), పక్కటెముకలు (ribs) విరిగే ప్రమాదానికి గురవుతున్నాయి.

వెన్నుపూస ఎముకల బలహీనత వల్ల నడుమునొప్పి రావటం దీని ముఖ్య లక్షణం. మోకాళ్ళ కీళ్ళలో బోన్ మాస్ తగ్గి నొప్పి, ఎక్కువ దూరం నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, కొంతమందిలో వెన్నుపూస వంగిపోవటం వంటి లక్షణాలు ఉంటాయి.

ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్ధారణ చెయ్యవచ్చు: స్త్రీల నెలసరి ఆగిపోయిన తర్వాత తమ జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకొనవలసిన అవసరం ఉంది. 40-50 ఏళ్ళు పైబడినవారు వైద్యుడిని సంప్రదించటం వలన ఆస్టియో పోరోసిస్ రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకొని కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

హోమియో చికిత్స

[మార్చు]

హోమియో చికిత్స వలన ఆస్టియో పోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్‌లను అరికట్టే అవకాశం ఉంది. ఇప్పుడు స్టార్‌హోమియోపతిలో ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ మీద రీసెర్చ్ చేసి గొప్ప అనుభవం ఉన్న సీనియర్ డాక్టర్లచే రోగి యొక్క శారీరక, మానసిక లక్షణాలను, వ్యాధి లక్షణాలను పరిశోధన చేసి వారికి సరిపడే కాన్‌స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వబడుతుంది. ఈ కాన్‌స్టిట్యూషనల్ మెడిసిన్ శరీరంలోని క్యాల్షియం డెఫీషియన్సీని, ప్రొటీన్ డెఫీషియన్సీ, హార్మోన్స్‌ను సరైన క్రమంలో జరుగుటకు, బోన్ మాస్, బోన్ స్ట్రెంగ్త్‌ని పెంచడానికి దోహదపడతాయి. వీటితో పాటు ఆహార నియమాలు, అవసరమైన వ్యాయామాలు, మంచి సలహాలు ఇవ్వబడతాయి.

హోమియోలో కాన్‌స్టిట్యూషనల్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని కాల్కేరియా గ్రూపునకు సంబంధించినవి. ఎక్కువగా ఎముకలు, కీళ్ళ మీద ప్రభావం చూపి ఎముకల పటుత్వానికి దోహదపడతాయి. నేట్రమ్ గ్రూపు, ఫాస్ఫరస్, రస్టాక్స్ మొదలైనవి ఎక్కువగా ఎముకల మీద ప్రభావం చూపి బోన్ స్ట్రెంగ్త్ పెంచుతాయి. కాన్‌స్టిట్యూషనల్ మెడిసిన్స్ వల్ల ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్‌ను చాలావరకు పరిష్కరించవచ్చు.

వృద్ధాప్యం లో ఆహారం

[మార్చు]

వృద్ధుల్లో విటమిన్‌ డి, క్యాల్షియం, విటమిన్‌ బీ12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం చాలా ఎక్కువ.

  • వృద్ధులు నిత్యం తక్కువ కొవ్వు పాల పదార్థాలు, ఆకు కూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్‌ డి, క్యాల్షియం లభిస్తుంది. ఇవి ఎముక పుష్టికి దోహదం చేస్తాయి.
  • చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాసం నుంచి విటమిన్‌ బీ 12 అందుతుంది.
  • సాధారణంగా వృద్ధాప్యంలో తప్పనిసరిగా వేధించే సమస్య మలబద్ధకం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం దండిగా తీసుకుంటే ఈ బాధ నుంచి తేలికగా బయటపడొచ్చు. వీటన్నింటిలో పీచు సమృద్ధిగా ఉంటుంది.
  • పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాల్లో వృద్ధులకు అవసరమైన పొటాషియం కూడా ఉంటుంది.
  • అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్ధాలు, వేపుళ్లు తగ్గించటం శ్రేయస్కరం. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దుతిరుగుడు నూనె వంటివి, అదీ మితంగా తీసుకుంటే మంచిది.

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]