Jump to content

జిలిక్ భట్టాచార్జీ

వికీపీడియా నుండి
జిలిక్ భట్టాచార్జీ
జననం1 జూన్[1]
ఇతర పేర్లుతులియా
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2013 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రీతిరంజన్ ఘరాయ్ (2020)[2]
తల్లిదండ్రులుమృత్యుంజయ్ భట్టాచార్జీ (తండ్రి)
సుమనా భట్టాచార్జీ (తల్లి)

జిలిక్ భట్టాచార్జీ, ఒడియా, బెంగాలీ సినిమా నటి.[3] భరతనాట్యం, కథక్‌లలో శిక్షణ పొందిన నృత్యకారిణి.

తొలి జీవితం

[మార్చు]

జిలిక్, జూన్ 1న మృత్యుంజయ్ భట్టాచార్జీ - సుమనా భట్టాచార్జీ దంపతులకు పశ్చిమ బెంగాల్‌లో జన్మించింది. షియామాక్ దావర్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ నుండి డ్యాన్స్ కూడా నేర్చుకుంది. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేసింది. [4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2020, మార్చి 11న చిలికాలో జిలిక్ కు ఎమ్మెల్యే ప్రీతిరంజన్ ఘడాయ్‌తో వివాహం జరిగింది. జిలిక్ మామ మాజీ ఆర్థిక మంత్రి, బిజెడి ఉపాధ్యక్షుడు శ్రీ ప్రఫుల్ల చంద్ర ఘడాయ్.[5]

సినిమారంగం

[మార్చు]

జిలిక్ 2013లో వచ్చిన తోమాయే భలో బాషి అనే బెంగాలీ సినిమాలో తొలిసారిగా నటించింది. ఆ తరువాత క్లాస్‌మేట్, ఐడెంటిటీ, నీల్ లోహిత్, ఎన్‌కౌంటర్ వంటి అనేక బెంగాలీ సినిమాలలో కూడా నటించింది. 2013లో టార్గెట్‌ సినిమాతో ఒడియా సినిమారంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత అఖిరే అఖీరే, లేఖ లెఖు లేఖి దేలి, సూపర్ మిచువా, జబర్దస్త్ ప్రేమిక, లవ్ యు హమేషా వంటి అనేక ఒడియా సినిమాలను నటించింది.[6]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష మూలాలు
2013 తోమయ్ భలో బాషి బంగ్లా
2013 టార్గెట్ ఒడియా
2013 ఐడెంటిటీ బంగ్లా
2014 అమర్ అమీ బంగ్లా
2014 క్లాస్‌మేట్ బంగ్లా
2014 అఖిరే అఖిరే ఒడియా
2014 లేఖ లెఖు లేఖి దేలీ ఒడియా
2015 సూపర్ మిచువా ఒడియా
2015 జబర్దస్త్ ప్రేమిక ఒడియా [7]
2015 లవ్ యూ హమేషా ఒడియా
2015 జగ హతరే పాఘా ఒడియా
2015 నీల్ లోహిత్ బంగ్లా [8]
2015 ఎన్‌కౌంటర్ బంగ్లా [9]
2016 అగస్త్య ఒడియా
2016 బేబీ ఒడియా
2017 తు మో హీరో ఒడియా
2017 తమకు దేఖిల పారే ఒడియా
2018 ఓలే ఓలే దిల్ బోలే ఒడియా
2018 ప్యార్ అలగ్ ప్రకర్ ఒడియా
2019 ఇది మాయ రే బయ ఒడియా
2019 అమీ షుడు తోర్ హోలం బంగ్లా

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం ఫలితం
2015 తరంగ్ సినీ అవార్డు అఖీరే అఖిరేకి ఉత్తమ నటి [10] గెలుపు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Jhilik Bhattacharjee Biography". OdiaLive. Retrieved 2022-03-01.
  2. Odisha News (12 March 2020). "Sukinda MLA Pritiranjan ties knot with Odia film actress Jhilik". Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
  3. "Actress Jhilik looked beautiful in traditional dress". News Track (in English). 2020-05-30. Retrieved 2022-03-01.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. Singha, Minati (June 17, 2016). "Looking forward to a long innings, says Odia actress Jhilik Bhattacharjee". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-01.
  5. "Actress Jhilik tied knot with BJD MLA - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-01.
  6. "Bong beauty rocking in Odia film industry". The New Indian Express. Retrieved 2021-07-27.
  7. "Jhilik Bhattacharjee Biography". entdairy.com. Archived from the original on 2016-08-11. Retrieved 2022-03-01.
  8. "Neellohit Movie Review". Retrieved 2022-03-01.
  9. "Jhilik Bhattacharjee movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2021-04-19. Retrieved 2022-03-01.
  10. "6th Tarang Cine Awards 2015 winners". Incredible Orissa. 2015-03-22. Retrieved 2022-03-01.

బయటి లింకులు

[మార్చు]