జి.ఆర్. గోపినాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోరూర్ రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్
జి.ఆర్. గోపినాథ్
జననం (1951-11-13) 1951 నవంబరు 13 (వయసు 72)
గోరూర్, కర్ణాటక రాష్ట్రం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు

జి.ఆర్.గోపినాథ్ (ಗೊರೂರ್ ರಾಮಸ್ವಾಮಿ ಅಯ್ಯಂಗಾರ್ ಗೋಪಿನಾಥ್ ) ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు. ఆయన పూర్తి పేరు గొరుర్ రామాస్వామి గోపినాథ్. ఈయన భారత సైనిక దళం లో కెప్టెన్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఈయన రచయిత, రాజకీయవేత్త.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన నవంబరు 13 1951 లో కర్ణాటక రాష్ట్రం లోని మెల్‌కోట్ నందు జన్మించారు. ఈయన తన 8 మంది సహోదరులలో రెండవవాడు. ఆయన తండ్రి పాఠశాల ఉపాధ్యాయుదు. కావున వారి కుటుంబసభ్యులు అందరూ కూడా ఆ గ్రామంలోనే జీవించేవారు.అందువలన గోపినాథ్ ఆ గ్రామంలో ఉన్న కన్నడ మాధ్యమంలో ఐదవ తరగతి వరకు విధ్యాభ్యాసం చేశారు.ఆయన ఐదవ తరగతిలో వారి పాఠశాలలో డిఫెన్స్ ఫోర్‌ పాఠశాల వారు ప్రవేశ పరీక్ష నిర్వహించారు.ఆ పరీక్ష ఆంగ్లములో నిర్వహించడం వలన ఆయన రాయలేక పోయారు. 1962 లో గోపీనాథ్ బీజాపూర్ సైనిక పాఠశాల నందు చేరారు. ఈ పాఠశాల ఆయనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA) లో చేరుటకు సహాయపడింది. 3 సంవత్సరముల శిక్షణ అనంతరం ఆయన ఎన్.డి.ఎ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ లో పట్టభద్రుడైనాడు.

కాలక్రమ పట్టిక[మార్చు]

 • 1997: డెక్కన్ ఏవియేషన్ కార్యకలాపాల ప్రారంభం
 • 2003: ఎయిర్ డెక్కన్ కార్యకలాపాల ప్రారంభం
 • 2004: డెక్కన్ ఏవియేషన్ శ్రీలంకకు విస్తరణ.
 • 2007: ఎయిర్ డెక్కన్ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం
 • 2009: దక్కన్ 360 ను ప్రారంభించి లోక్సభ ఎన్నికలలో పోటీ

ఎయిర్ డెక్కన్ సంస్థ[మార్చు]

ఎయిర్ డెక్కన్ సంస్థను రాజకీయ వేత్త, రచయిత అయిన కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ ప్రారంభించారు. ఇది భారత దేశంలో తొలి చవక ధరల విమానసంస్థ గా తన సేవలను ఆగస్టు 23, 2003లో బెంగళూరు నుంచి హుబ్లీకి ప్రారంభించింది.[3] సామాన్యుల విమాన సంస్థగా దీనికి పేరుంది. ఈ సంస్థ లోగో రెండు అరచేతులు కలిపి ఓ పక్షి ఎగురుతున్నట్లుగా ఉంటుంది. ఈ సంస్థ నినాదం “సింప్లీ-ఫ్లై” అని రాస్తారు. సామాన్యులు కూడా విమానాల్లో ఎగురవచ్చని ఈ సంస్థ నిరూపించింది. తన జీవిత కాలంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే ప్రతి భారతీయుని కల నెరవేర్చాలని కెప్టెన్ గోపీనాథ్ అంటుండేవారు. హుబ్లీ, మంగళూరు, మధురై, విశాఖపట్టణం వంటి రెండో శ్రేణి నగరాలకు బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో పాలిటన్ నగరాల నుంచి విమానాలను నడిపించిన తొలి విమాన సంస్థ ఇదే. ఎయిర్ డెక్కన్ ఆరంభమైన అతి కొద్ది కాలంలోని అద్భుత పురోగతి సాధించించి. అయితే ఈ సంస్థ నష్టాల భారిన పడడంతో 2007లో దీని నిర్వహణ బాధ్యతలను కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ తీసుకుంది. అప్పుడు దీనిని కింగ్ ఫిషర్ రెడ్ ఎయిర్ లైన్స్ గా పేరు మార్చారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ విమాన ప్రయాణ ఛార్జీలను బాగా తగ్గించారు. ఎంతగా తగ్గించారంటే భారత దేశంలో ఉన్నత శ్రేణి రైలు ప్రయాణ ఛార్జీలతో సమానంగా ఈ విమాన రేట్లునిర్ణయించి విమాన ప్రయాణికులకు సేవలందించారు. అయితే ఈ సంస్థ కాలక్రమంలో స్పైస్ జెట్, ఇండి గో ఎయిర్ లైన్, జెట్ లైట్, గో ఎయిర్ ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. ప్రస్తుతం దీని కార్యకలాపాలు ఆపివేశారు. [4] ఇది బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేది. అప్పుడు చౌక ధరల విమాన సర్వీసులకు ఇది పేరొందింది. కానీ తర్వాత నష్టాలు ఎక్కువ కావడంతో 2008లో ఎయిర్‌ డెక్కన్‌ను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ దీన్ని కింగ్‌ఫిషర్‌ రెడ్‌గా రీబ్రాండ్‌ చేసింది. కానీ తర్వాత ఆర్థికపరమైన సమస్యల కారణంగా 2012లో మూతపడింది.

కాగా మార్చిలో జరిగిన తొలి రౌండ్‌ బిడ్డింగ్‌లో దేశవ్యాప్తంగా 120 రూట్లలో విమానాలు నడపటానికి ఉడాన్‌ పథకం కింద ఐదు సంస్థలు అనుమతి పొందాయి. వాటిలో అలయన్స్‌ ఎయిర్, స్సైస్‌ జెట్, ఎయిర్‌ ఒడిషాతో పాటు ఎయిర్‌ డెక్కన్, తెలుగు రాష్ట్రాలకు చెందిన టర్బో మేఘా ఎయిర్‌లైన్స్‌ (ట్రూ జెట్‌) కూడా ఉన్నాయి. ట్రూజెట్‌ ఇప్పటికే తన ఉడాన్‌ సేవలు ప్రారంభించింది. ఎయిర్‌డెక్కన్‌ ఇపుడు ప్రారంభిస్తోంది. గంట విమాన ప్రయాణానికి కనీస టికెట్‌ ధర రూ.2,500. టైర్‌–2, టైర్‌–3 పట్టణాలకు విమాన సర్వీసులకు విస్తరించటం, సామన్యులకు విమాన ప్రయాణం చేరువ చేయడం అనే లక్ష్యంతో కేంద్రం ఉడాన్‌ స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది.

ప్రమాదాలు, సంఘటనలు[మార్చు]

ఎయిర్ డెక్కన్ తన సేవలను సెప్టెంబరు 24, 2003లో ఒడి దొడుకుల మధ్య ప్రారంభించిన నాడే ఆ సంస్థకు సంబంధించిన తొలి విమానం అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగాయి.[5][6] ఆ సమయంలో విమానంలో చాలా ముంది ముఖ్యులు ఉన్నారు. అప్పటి బి.జె.పి.అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు, the then Minister of State for పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి , రాజీవ్ ప్రతాప్ రూఢీ, తెలుగుదేశం పార్టీ నేత కె.ఎర్రన్నాయుడు వంటి ప్రముఖులు విమానంలో ఉన్నారు. అయితే సకాలంలో మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. తిరిగి మార్చి 29, 2004 నాడు గోవా నుంచి బెంగళూరు వెళ్తుండగా టేకాఫ్ అయిన అరగంట తర్వాత ఎయిర్ డెక్కన్ విమానంలోని క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. [7] మార్చి 11, 2006 నాడు కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్లే ఎయిర్ డెక్కన్ విమానం బెంగళూరు లోని హెచ్ఎఎల్ విమానాశ్రయంలో దిగుతుండగా అదుపు తప్పి రన్ వే పై పడిపోయింది.[8] ఈ సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులు, 4గురు విమాన సిబ్బంది ఉన్నప్పటికీ ఎవరికీ ప్రమాదం జరగలేదు. అయితే ఈ విమానం పూర్తిగా దెబ్బతింది.

గోపినాథ్ స్వీయ రచనలు[మార్చు]

 • "You Cannot Miss This Flight: Essays on Emerging India", Harper Collins, 2017, ISBN 9789352644797

మూలాలు[మార్చు]

 1. Bengaluru, Sudha Narasimhachar (1 May 2012). "Adored by millions, Capt Gopinath is a man of many faces". The Weekend Leader. Archived from the original on 25 June 2012. Retrieved 1 May 2012.
 2. "Captain G R Gopinath: Founder of Air Deccan". Matpal.com. February 8, 2012. Archived from the original on 27 April 2013. Retrieved 1 May 2012.
 3. "About Air Deccan". Archived from the original on 2014-02-22. Retrieved 2015-04-16.
 4. "Deccan IPO scrapes through". Financialexpress.com. 24 May 2006. Retrieved 30 August 2010.
 5. Our Bureau / Hyderabad 25 September 2003 (25 September 2003). "Fire grounds Air Deccan". Business-standard.com. Retrieved 30 August 2010.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 6. "Major plane accident averted". Hinduonnet.com. 25 September 2003. Archived from the original on 30 January 2005. Retrieved 30 August 2010.
 7. "Low-cost flight under a cloud". Hindu.com. 11 April 2004. Archived from the original on 21 జూన్ 2014. Retrieved 30 August 2010.
 8. "Air Deccan aircraft skids off runway". Thehindubusinessline.com. 12 March 2006. Retrieved 30 August 2010.

ఇతర లింకులు[మార్చు]