జి.కొండూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.కొండూరు
—  రెవిన్యూ గ్రామం  —
జి.కొండూరు is located in Andhra Pradesh
జి.కొండూరు
జి.కొండూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°40′56″N 80°34′23″E / 16.682211°N 80.573037°E / 16.682211; 80.573037
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం జి.కొండూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి పజ్జూరి అంజన
జనాభా (2001)
 - మొత్తం 8,158
 - పురుషులు 3,583
 - స్త్రీలు 3,348
 - గృహాల సంఖ్య 1,666
పిన్ కోడ్ 521229
ఎస్.టి.డి కోడ్ 08865


జి.కొండూరు (గడ్డమణుగు కొండూరు), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్ కోడ్ నం 521 229., ఎస్.టి.డి.కోడ్ = 0866.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

[1] పినపాక 2 కి.మీ, చెవుటూరు 4 కి.మీ, వెల్లటూరు 5 కి.మీ, వెలగలేరు 5 కి.మీ, కందులపాడు 5 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

మైలవరం, ఇబ్రహీంపట్నం, విజయవాడ గ్రామీణ, యెర్రుపాలెం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మైలవరం, కొండపల్లి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: కొండపల్లి, రామవరప్పాడు, విజయవాడ 20 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

 1. వివేకానంద ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల.
 2. శ్రీ వేంకటేశ్వర విద్యాలయం.
 3. ఆక్స్ ఫర్డ్ హైస్కూల్:- ఈ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ జి.అశోక్, ఇటీవల నిర్వహించిన ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, "ఆచార్య దేవోభవ" పురస్కారాన్ని అందుకున్నారు. [11]
 4. ఓం మానసిక వికలాంగుల పాఠశాల:- ఈ పాఠశాల స్థానిక కొత్తూరు రహదారిలో ఉంది.
 5. శాఖా గ్రంథాలయం.
 6. శ్రీ శాయ్ హైస్కూల్, జి.కొండూరు ఆక్స ఫర్డ్ కన్చెప్ట్ హైస్కూల్, జిల్లాపరిషత్ హైస్కూల్, కొండూరు

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

 1. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- జాతీయ ఆరోగ్య మిషన్ ఫేజ్-2 క్రింద, ఈ క్లేంద్రం ఆవరణలో, 2008 లో ఒక హోమియో వైద్యశాలను ఏర్పాటుచేసారు. ఒక డాక్టరునూ, ఒక కాంపౌండరును గూడా ఏర్పాటుచేసారు. [15]
 2. ఈ గ్రామంలో స్థానిక నృసింహస్వామి దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్.ఎం.ఆర్ క్లినిక్ ను దసరా పండుగ సందర్భంగా 14-10-2013న ప్రారంభించారు. జి.కొండూరులో ఇప్పటివరకూ, అర్హత గలిగిన వైద్యులు లేని కొరత తీరినట్లైనది. [3]
 3. ఓం శాంతి మానసిక వికాసకేంద్రం:- ఈ కేంద్రం స్థానిక కొత్తూరు రహదారిపై ఉంది.
 4. పశువైద్యశాల.

బ్యాంకులు[మార్చు]

 1. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (K.D.C.C.Bank)
 2. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 0866/2802226.
 3. సప్తగిరి గ్రామీణ బ్యాంక్:- స్థానిక పాల కేంద్రం సమీపంలో గడ్డమణుగు రహదారిలో, ఈ బ్యాంక్ శాఖ కార్యాలయాన్ని, 2015,సెప్టెంబరు-30వ తేదీనాడు ప్రారంభించారు. [10]

మీ-సేవా కేంద్రం[మార్చు]

గ్రామంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ శాఖా కార్యాలయానికి ఎదురుగా నూతనంగా ఏర్పాటుచేసిన సి.ఎస్.సి.మీ-సేవాకేంద్రాన్ని, 2015,అక్టోబరు-15వ తేదీనాడు ప్రారంభించారు. గ్రామంలో ఇంతకు ముందు రెండు మీ-సేవా కేంద్రాలు పనిచేయుచుండగా, ఇది మూడవ కేంద్రం. [12]

మన రైతు బజార్[మార్చు]

స్థానిక గడ్డమణుగు రహదారిలో 2016,జనవరి-1వ తేదీనాడు, మన రైతుబజార్ ను ప్రారంభించారు. [14]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

 1. స్థానిక నరసింహస్వామి గుట్ట సమీపంలోని చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి పజ్జూరి అంజన సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం[మార్చు]

గ్రామంలో నూతనంగా నిర్మించుచున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పునర్నిర్మాణం చేస్తున్నారు. [4]

శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం[మార్చు]

ఈ 2 ఆలయాల 14వ వార్షికోత్సవ వేడుకలను, 2016,మే-18వ తేదీ బుధవారం నుండి నాలుగు రోజులపాటు వైభవంగా నిర్వహించారు. [16]

శ్రీ కోదండరామాలయం[మార్చు]

స్థానిక నూజివీడు రహదారిలోని ఈ ఆలయంలో, 2014,డిసెంబరు14, ఆదివారం నాడు, సామూహిక అనఘాష్టమి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అలంకరణలతోపాటు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో మహిళలు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [8]

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

స్థానిక ప్రధాన కూడలిలో జాతీయ రహదారి ప్రక్కన, పంచాయతీ కార్యాలయం ప్రక్కనే, నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో, శిఖర, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014,జూన్-16, సోమవారం నాడు, అంకురార్పణ, వాస్తుపూజ, హోమం నిర్వహించారు. మంగళవారం ఉదయం, పంచగవ్యారాధన, పంచగవ్యాప్రాసన, క్షీరాధివాసం, జలాధివాసం, ఆదివాస హోమాది ప్రధాన హోమాలు, గ్రామ బలిహరణ, గ్రామోత్సవం, శాంతిహోమం నిర్వహించారు. బుధవారం ఉదయం పూజాదికాలు నిర్వహించి 11-12 గంటలకు స్వామివారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, అనంతరం శాంతికల్యాణం, తీర్ధప్రసాదాల పంపిణీ చేసారు. శిఖరనిర్మాణం పూర్తి అయిన తరువాత, ఈ ఆలయంలో 2014, అక్టోబరు-1, బుధవారం నాడు, శిఖర, బ్రహ్మకపాల పూజలు నిర్వహించారు. బ్రహ్మకపాల పూజలలో భాగంగా, అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు, శిఖర రంధ్రాలలో నవధాన్యాలు, పూర్ణాలు వేసి పూజలు నిర్వహించారు. [5],[6]&[7]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

 • స్థానిక నృసింహస్వామి గుట్టపై నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో ధ్వజస్తంభ, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మే నెల-2వ తేదీ శనివారం ఉదయం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం, స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన, స్వామివారి ప్రసాదంగా భావించే అన్నదాన కార్యక్రమానికి, భక్తులు, వేలసంఖ్యలో పాల్గొన్నారు. [9]
 • ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని 2016,మే-19వ తేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. [16]
 • ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా ఈ ఆలయంలోని స్వామివారికి విశేషపూజలు, అభిషేకాలు నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించెదరు. [17]
 • ఈ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ అభయాంజనేయస్వామివారల ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వాయు శివలింగ, నవగ్రహాల విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమాన్ని 2017,ఆగష్టు-17వఫేదీ గురువారంనాడు నిర్వహించెదరు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసెదరు. [19]

శ్రీ సిద్ది, బుద్ధి సమేత శ్రీ వినాయకస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం, స్థానిక ఆత్కూరు క్రాస్ సమీపంలో ఉంది.

శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ గ్రామం గ్రామంలోని నరసింహస్వామి గుట్టకు సమీపంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణ పనులు జరుగుచున్నవి. [18]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

జి.కొండూరు గ్రామానికి చెందిన ఒక సామాన్య కుటుంబానికి చెందిన శ్రీ మందా రాజానందకుమార్, కాకినాడలోని జె.ఎన్.టి.యూ.లో 1994లో బి.టెక్.పూర్తిచేసి, 1995లో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన "మెకాన్ లిమిటెడ్"లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆ సంస్థలో రాంచీలో అసిస్టెంట్ జెనరల్ మేనేజరుగా పనిచేయుచున్న ఆయన ఇటీవల జాతీయస్థాయిలో డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య-2015 పురస్కారం అందుకున్నారు. ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థ వారు 2015,డిసెంబరు-18న అసోం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ లో వీరికి, ఈ పురస్కారాన్నీ, స్వర్ణ పతకాన్నీ అందజేసినారు. [13]

గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు :[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అతుకూరు 366 1,385 707 678
2. భీమవరప్పాడు 202 837 426 411
3. చెగిరెడ్డిపాడు 158 556 283 273
4. చెరువు మాధవరం 406 1,725 840 885
5. చెవుటూరు 740 2,829 1,423 1,406
6. దుగ్గిరాలపాడు 245 1,072 542 530
7. గడ్డమణుగు 450 1,780 896 884
8. గంగినేనిపాలెం 603 2,566 1,269 1,297
9. గుర్రాజుపాలెం 209 863 432 431
10. హవేలి ముత్యాలంపాడు 333 1,381 718 663
11. కొండులపాడు 281 1,047 540 507
12. కవులూరు 1,738 7,155 3,702 3,453
13. కోడూరు 911 3,682 1,865 1,817
14. జి.కొండూరు 1,666 6,931 3,583 3,348
15. కుంతముక్కాల 704 3,462 1,484 1,978
16. మునగపాడు 313 1,390 685 705
17. నందిగామ 312 1,252 658 594
18. పినపాక 323 1,413 711 702
19. సున్నంపాడు 188 754 376 378
20. తెల్లదేవరపాడు 158 549 270 279
21. వెలగలేరు 1,243 4,975 2,523 2,452
22. వెల్లటూరు 1,054 4,455 2,269 2,186
23. వెంకటాపురం 366 1,440 732 708

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 6,931 - పురుషుల సంఖ్య 3,583 - స్త్రీల సంఖ్య 3,348 - గృహాల సంఖ్య 1,666

వనరులు[మార్చు]

 1. "http://www.onefivenine.com/india/villages/Krishna/G.konduru/G-Konduru". Retrieved 14 June 2016. External link in |title= (help)
 2. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-03.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,ఆగస్టు-6; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013,అక్టోబరు-16; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జనవరి-26; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జూన్-17; 2వ పేజీ. [6] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జూన్-19; 2వపేజీ. [7] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,అక్టోబరు-2; 3వపేజీ. [8] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,డిసెంబరు-15; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,మే-3; 35వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-1; 28వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-6; 27వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-16; 29వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-28; 28వపేజీ. [14] ఈనాడు అమరావతి; 2016,జనవరి-2; 28వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-2; 28వఫేజీ. [16] ఈనాడు అమరావతి/మైలవరం; 2016,మే-23; 3వపేజీ. [17] ఈనాడు అమరావతి/మైలవరం; 2016,మే-30; 2వపేజీ. [18] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,ఫిబ్రవరి-27; 2వఫేజీ. [19] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,ఆగస్టు-14; 2వపేజీ.