జి. కుమార పిళ్లై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జి. కుమార పిళ్లై ( 1923 ఆగస్టు 22 - 2000 ఆగస్టు 16) ఒక మలయాళ భాషా కవి, రచయిత, వ్యాసకర్త. అతను దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, గాంధేయవాది. ఇంకా కేరళలోని అనేక మానవ హక్కుల ఉద్యమాలలో పాల్గొన్నాడు. రచయితగా, కవిగా అతను తన రచనలకు అనేక పురస్కారాలను అందుకున్నాడు. కేరళ రాష్ట్రంలో ఆంగ్లంలో ఆచార్యులుగా ఉన్న రచయితలలో కుమార పిళ్లై ఒకడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

కుమార పిళ్ళై ప్రస్తుత కేరళలోని కొట్టాయం జిల్లాలోని వెన్నిమలలో 1923 ఆగస్టు 22 న పెరింగర పి.గోపాల పిళ్లై, పార్వతి అమ్మ దంపతులకు జన్మించాడు. అతను చంగనాస్సేరీలోని ఎస్.బి. కళాశాల నుండి తన విద్యను పూర్తి చేసాడు. బొంబాయిలోను తరువాత కేరళ సచివాలయంలోనూ గుమస్తాగా పనిచేశాడు. అతను నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.[2] అతను తిరువనంతపురం విశ్వవిద్యాలయ కళాశాలలో ఆంగ్ల భాషాచార్యులుగా సుమారు 40 సంవత్సరాలు పనిచేశాడు. అతడికి సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల, అలప్పుజ్హకు చెందిన మాజీ ఆచార్యురాలు లీలను వివాహం చేసుకున్నాడు.

స్వాతంత్ర్యోద్యమంలో[మార్చు]

అతను భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 1944-46 కాలంలో కొచ్చి ప్రజామండలం సభ్యునిగా పనిచేసాడు. [2] అతను తన జీవితమంతా గాంధేయవాదిగా ఉన్నాడు. కేరళలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలలో పాల్గొన్నాడు. కేరళ రాష్ట్రంలోని మద్యం విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాడు. అతను పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. అతను దాని కేరళ విభాగానికి ప్రారంభ రోజుల్లో అధ్యక్షుడిగాను, 1980 నుండి 1996 వరకు దాని జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. అతనికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా చాప్టర్తో కూడా సంబంధం ఉంది.[3]

అతను దాదాపు 20 పుస్తకాలను రచించాడు. అతను 1985 లో "సప్తస్వరం" అనే కవితా రచన కోసం కేరళ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.[4] మలయాళ చిత్ర దర్శకుడు జి. అరవిందన్ చిత్రం ఉత్తరాయణం లోని "హృదయదిన రొమాంజం" అను పాటకు అతను సాహిత్యం అందించారు.

అతను 2000 ఆగస్టు 16 న త్రిస్సూర్‌లో మరణించాడు.[2]

రచనలు[మార్చు]

అతని రచనలలో కొన్ని ఇక్కడ ప్రస్తావించబడ్డాయి.

  • అరలి పూక్కల్ (1951) -అతడు ప్రచురించిన మొదటి కవితా సంకలనం [2]
  • మరుభూమియుడే కినవుకల్
  • ఓర్మాయుడే సుగంధం
  • సప్తస్వరం
  • బేబీ కాంప్బెల్ ఎంప్టీ క్యూబ్ 2 (Baby Campbell Empty Cube Two) (2001 జనవరి)[5]
  • ఇన్నం ఇన్నాలేయుం నాళేయుమ్ (1999)
  • ఎ బుక్ ఆఫ్ మోడర్న్ షార్ట్ స్టొరీస్ (1977)

పురస్కారాలు[మార్చు]

  • 1984: సప్తస్వరానికి ఒడక్కుజల్ పురస్కారం
  • 1985: సప్తస్వరానికి కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం
  • ఆశన్ పురస్కారం [2]

మూలాలు[మార్చు]

  1. https://timesofindia.indiatimes.com/city/kochi/sense-and-sentience/articleshow/78070445.cms
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "പ്രൊഫ.ജി.കുമാരപിള്ള അന്തരിച്ചു". malayalam.oneindia (in మలయాళం). 2000-08-17.
  3. "Obituary" Archived 2015-09-24 at the Wayback Machine. People's Union for Civil Liberties|People's Union for Civil Liberties (PUCL). Retrieved 12 April 2014.
  4. "Kerala Sahitya Akademi Awards". Kerala Sahitya Akademi. Retrieved 12 April 2014.
  5. https://www.amazon.in/Books-G-Kumara-Pillai/s?rh=n%3A976389031%2Cp_27%3AG.Kumara+Pillai