Jump to content

జి ఎస్ ఎల్ వి - ఎఫ్12

వికీపీడియా నుండి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ) చేపట్టిన జియో సింక్రోనస్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ( జి ఎస్ ఎల్ వి ) ఎఫ్ -12 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది[1]. 2023 మే 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి జి.ఎస్.ఎల్.వి - ఎఫ్ 12 వాహక నౌక ద్వారా రెండో తరం నావిక్ ఉపగ్రహ శ్రమలో మొదటిది అయిన 2,232 కిలోల బరువు కలిగిన ఎన్ వి ఎస్ ( ఐ ఆర్ ఎన్ ఎస్ ఎస్ - జె) - 01 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు[2]. ఇస్రో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. 12 సంవత్సరాల పాటు సదరు ఉపగ్రహం సేవలు అందించనుంది. త్వరలో నావిక్ పేరుతో దేశీయ నావిగేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి[3]. నావిగేషన్ సాటిలైట్ సిస్టం బలోపేతం కోసం భారత క్షత్రియ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ ( ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం - ఐ ఆర్ ఎన్ ఎస్ ఎస్ ) వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఎన్ వి ఎస్ - 01 పేరుతో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించారు.

జి ఎస్ ఎల్ వి - ఎఫ్ 12 విశేషాలు :

. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ( జి ఎస్ ఎల్ వి - ఎఫ్ 12 ) పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు[4].

. జి ఎస్ ఎల్ వి : చంద్రయాన్, గగన్ యాన్ వంటి భారీ మెషిన్ల కోసం జియో సింక్రోనస్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ( జి ఎస్ ఎల్ వి ) ను ఇస్రో వినియోగిస్తున్నది. జి ఎస్ ఎల్ వి శ్రేణిలోని తొలి రాకెట్ ను 2001 ఏప్రిల్ లో ఇస్రో ప్రయోగించింది.

ఎన్ వి ఎస్ - 01 ఉపగ్రహం ప్రత్యేకతలు:

. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్ వి ఎస్ - 01 మొదటిది.

. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్ళు.

. ఉపగ్రహం రెండు సౌర పలకల శ్రేణులు ద్వారా శక్తిని పొందుతుంది. దీని ద్వారా 12 సంవత్సరాలపాటు నిరంతరాయంగా ఇది పనిచేస్తుంది. . దేశీయంగా అభివృద్ధి చేసిన రూబీడియం అటామిక్ క్లాక్ ను ఉపగ్రహంలో అమర్చారు. అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో దీన్ని నిర్మించారు. ఇటువంటి టెక్నాలజీ అతి తక్కువ దేశాల వద్ద మాత్రమే ఉంది.

. వైమానిక సేవలు, నావిగేషన్, వ్యవసాయం, సర్వేయింగ్, అత్యవసర సేవలు, సముద్ర చేపల పెంపకం మొదలైన రంగాలకు ఈ ఉపగ్రహం నిర్దిష్టమైన సమాచారాన్ని అందించనుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "ISRO: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం విజయవంతం". EENADU. Retrieved 2023-08-27.
  2. "GSLV F-12 Rocket: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతం". Sakshi Education. Retrieved 2023-08-27.
  3. "GSLV-F12 : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ శాటిలైట్". Samayam Telugu. Retrieved 2023-08-27.
  4. Satyaprasad, Bandaru. "ISRO GSLV-F12 Success : జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం సక్సెస్, కక్ష్యలోకి ఎన్వీఎస్-01 ఉపగ్రహాం!". Hindustantimes Telugu. Retrieved 2023-08-27.