జీపుల కొనుగోలు కుంభకోణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జీపుల కొనుగోలు కుంభకోణం 1948లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని భారత హైకమీషనర్ వికె కృష్ణ మీనన్ ప్రోటోకోల్‌లను త్రోసిరాజని ఒక విదేశీ సంస్థతో ఆర్మీ జీపుల కొనుగోలు కోసం రూ. 80 లక్షల ఒప్పందంపై సంతకం చేయడంతో జరిగింది.[1][2]

ఆర్డరు ప్రకారం సరఫరా చేయడంలో వైఫల్యం కారణంగా లండన్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్, ఈ ఒప్పందాన్ని తరువాత రద్దు చేశారు.[3] మీనన్‌తో సహా ఎవరికీ వ్యతిరేకంగా ఏమీ కనిపించకపోవడంతో 1955 లో ఈ విషయంపై విచారణ ముగిసింది.[4][5]

కొనుగోలు

[మార్చు]

1947-1948 నాటి భారత-పాకిస్తాన్ యుద్ధం కొనసాగుతున్న సందర్భంలో, భారత సైన్యానికి మరిన్ని జీప్‌లు అవసరమయ్యాయి. బ్రిటన్‌ లోని భారత హైకమిషనర్ VK కృష్ణ మీనన్, 2,000 పాత జీప్‌ల కోసం ఆర్డర్ ఇచ్చాడు. అదే ధరకు యునైటెడ్ స్టేట్స్ లేదా కెనడా నుండి కొత్త జీపులే వచ్చేవి. ఈ పాత జీపులను వెంటనే సరఫరా చేస్తారని, విడిభాగాలతో సహా చేస్తారనీ కృష్ణమీనన్ తన చర్యను సమర్థించుకున్నాడు. జీప్‌ల కోసం ఆర్డరు వేసిన కంపెనీ, అంతగా తెలియని యాంటీ-మిస్టాంటెస్. దాని మూలధనం £605 మాత్రమే. కృష్ణ మీనన్ వేసిన ఆర్డరు విలువ $172,000. ఈ మొత్తంలో 65% ఎలాంటి తనిఖీ సర్టిఫికేట్ లేకుండా ముందస్తుగానే చెల్లించారు. సరఫరా చేసే జీపుల్లో కేవలం 10% జీపులను మాత్రమే తనిఖీ చేస్తామని అతను ఒప్పుకున్నాడు. ఆర్డరు ప్రకారం తనిఖీ అయ్యాక 65% చెల్లించాలి. 20% డెలివరీ ఇచ్చాక, మిగిలిన మొత్తం డెలివరీ చేసిన నెల తర్వాత చెల్లించాలి. వచ్చిన 155 జీపుల్లో ఒక్కటి కూడా పనిలో దిగలేదు. రక్షణ మంత్రిత్వ శాఖ వాటిని అంగీకరించడానికి నిరాకరించింది. యాంటీ-మిస్టాంటెస్, జీప్‌ల సరఫరాను నిలిపివేసింది. మీనన్, ఆ కంపెనీని సంప్రదించలేకపోయాడు. SCK ఏజెన్సీస్‌ అనే కంపెనీతో 1,007 జీపుల సరఫరా కోసం, నెలనెలా 68 జీపులు డెలివరీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాత కాంట్రాక్టు వలన కలిగిన నష్టాన్ని ఈ కంపెనీ పూడుస్తుంది కూడా. ప్రతి జీపు ధర £458.10 కాగా యాంటీ-మిస్టాంటెస్ ఒక జీప్‌ను £300కి విక్రయించింది. ఆరు నెలల పాటు నెలకు 12 జీపుల చొప్పున డెలివరీ చేసి, ఆ తర్వాత నెలకు 120 జీపులను డెలివరీ చేసేలా ఒప్పందాన్ని మార్చేందుకు మీనన్ అంగీకరించాడు. అయితే ఆ కంపెనీ రెండేళ్లలో కేవలం 49 జీపులను మాత్రమే సరఫరా చేయగలిగింది. ప్రభుత్వానికి పరిహారం ఇవ్వడానికి నిరాకరించింది.[6] బ్రిటన్ ఈ జీపుల ఖర్చు పెట్టుకోవడం అనేది రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుండి బ్రిటన్ భారతదేశానికి తీర్చాల్సిన యుద్ధ రుణంలో భాగం.[7]

విచారణ

[మార్చు]

మీనన్ ప్రోటోకాల్‌ను దాటవేసి రూ. జీపుల కొనుగోలు కోసం విదేశీ సంస్థకు 80 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు.[8][9]

1955 సెప్టెంబరు, 30 న మీనన్‌తో సహా ఎవరికీ వ్యతిరేకంగా ఏమీ కనబడకపోవడంతో ఈ విషయంపై దర్యాప్తును మూసివేసారు.[4][5][10] వెంటనే, 1956 ఫిబ్రవరి 3 న మీనన్ పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా నెహ్రూ మంత్రివర్గంలో చేరాడు.[11][12] ఆ తర్వాత మీనన్, రక్షణ మంత్రిగా ఉంటూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు నమ్మకమైన మిత్రుడు అయ్యాడు. మీనన్ వ్యక్తిగత చిత్తశుద్ధిని శంకించడానికి ఎలాంటి ఆధారాలు కనబడలేదు.[13]

మూలాలు

[మార్చు]
  1. Paul, Dipankar (30 April 2011). "The Republic of Scams: Jeep purchase (1948)". MSN. Archived from the original on 17 August 2011. Retrieved 20 December 2011.
  2. "On Your Marks". Outlook. India. 1 February 2010. Archived from the original on 15 May 2013.
  3. Ray, J.K. (2013). India's Foreign Relations, 1947-2007. South Asian History and Culture. Taylor & Francis. pp. 63–64. ISBN 978-1-136-19714-7.
  4. 4.0 4.1 Kutty, V.K.M. (1988). V.K. Krishna Menon. Builders of modern India. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 93. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Kutty 1988 p." అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. 5.0 5.1 Kapoor, R.S. (2000). More Equal Than Others: A Study of the Indian Left. Vision Books. p. 155. ISBN 978-81-7094-381-5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Kapoor 2000 p." అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. Ray, Jayanta Kumar (3 April 2013). India's Foreign Relations, 1947-2007. ISBN 9781136197147.
  7. Cohen, Stephen P. (2010). Arming Without Aiming: India's Military Modernization. ISBN 9780815704027.
  8. "Media support crusade against corruption". The Hindu. India. 18 April 2011. Archived from the original on 23 April 2011.
  9. "Scamstory". Outlook. India. 13 August 1997. Archived from the original on 1 February 2014.
  10. The Illustrated Weekly of India. Published for the proprietors, Bennett, Coleman & Company, Limited, at the Times of India Press. 1970. p. 30.
  11. Upadhyay, R. (30 March 2001). "Political Corruption in India: An Analysis". South Asia Analysis Group. Archived from the original on 18 December 2010. Retrieved 17 November 2011.
  12. "Worst political scandals of independent India". India TV News. 3 January 2013. Retrieved 15 January 2013.
  13. Viswanathan, S. "Media support crusade against corruption". hindu.com. Archived from the original on 23 April 2011. Retrieved 12 October 2021.