జీరో విడ్త్ నాన్ జాయినర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ZWNJ కోసం ISO కీబోర్డులో ఉండే చిహ్నం

జీరో-విడ్త్ నాన్-జాయినర్ (ZWNJ) అనేది కళ్ళకు కనిపించని, తెరపై ప్రింటవని క్యారెక్టరు. లిగేచర్‌లను (రెండు వేరు చిహ్నాలు కలిసి ఒకే కొత్త చిహ్నాన్ని చూపించేవి - తెలుగులో ఒత్తుల లాగా) ఉపయోగించే రాత వ్యవస్థలను కంప్యూటరీకరించేటపుడు దీన్ని ఉపయోగిస్తారు. ఒక అక్షరపు పొల్లు పక్కనే మరొక అక్షరాన్ని ఉంచినపుడు మొదటి దానికి రెండవ అక్షరం ఒత్తుగా మారడం తెలుగుకు సహజం. కానీ వాటి మధ్య జీరో-విడ్త్ నాన్-జాయినరును ఉంచినప్పుడు, వాటిని విడివిడిగా రెండు అక్షరాలుగా చూపిస్తుంది. రెండు అక్షరాల మధ్య స్పేస్ క్యారెక్టరును ఉంచినపుడు ఎలాంటి ప్రభావం కనిపిస్తుందో, అలాంటి ప్రభావమే జీరో-విడ్త్ నాన్-జాయినరును ఉంచినప్పుడూ కనిపిస్తుంది. అయితే ZWNJ వాడినపుడు ఆ రెండు అక్షరాలూ పక్కపక్కనే కనిపిస్తాయి.

ZWNJ ప్రయోజనం[మార్చు]

తెలుగు వంటి భారతీయ (ఇండిక్) లిపులలో, హల్లుతో లేదా ఆధారిత అచ్చుకు ముందు హల్లు తర్వాత ZWNJ ని చొప్పించడం వలన మొదటి దానికి రెండవ అక్షరం ఒత్తుగా మారకుండా నిరోధిస్తుంది: [1]

ఉదాహరణకు "హైదరాబాద్‌లో" అనే పదంలో ద్ అనే పొల్లు అక్షరం తరువాత "లో" అనే అక్షరం వచ్చింది. ఈ రెండింటి మధ్య జీరో-విడ్త్ నాన్-జాయినరును వాడకపోతే "హైదరాబాద్లో" అని రాస్తుంది, అది వాడితే "హైదరాబాద్‌లో" అని రాస్తుంది. అలాగే "ఫైర్ఫాక్స్" అనే పదంలో ZWNJ వాడితే "ఫైర్‌ఫాక్స్" అని సరిగ్గా రాయవచ్చు. ఐన్‌స్టీన్ అనే మాటలో ZWNJ వాడనట్లైతే "ఐన్స్టీన్" అవుతుంది.

ZWNJ ను కన్నడం, బెంగాలీ, దేవనాగరి వంటి ఇతర లిపుల్లో కూడా వాడతారు. జర్మను, హీబ్రూ వంటి భాషల్లో కూడా ZWNJ ని వాడతారు.

ZWNJ ను చేర్చడం ఎలా[మార్చు]

వికీపీడియా:టైపింగు సహాయం పేజీలో చూపినట్లుగా, లిప్యంతరీకరణ పద్ధతిలో తెలుగులో రాస్తున్నట్లైతే ⇧ Shift+6 (క్యారట్) కీలను వాడి ZWNJ ను చేర్చవచ్చు. అయితే పొల్లు అక్షరం పక్కనే ఈ కీలను నొక్కినపుడు మాత్రమే ZWNJ చేరుతుంది. ఇతర సందర్భాల్లో ^ అనే సింబలు పడుతుంది.

యాండ్రాయిడ్ మొబైళ్ళలో గూగుల్ కీబోర్డులో కింది పటంలో చూపిన విధంగా ZWNJ కీ ఉంంటుంది.

యండ్రాయిడ్ మొబైలు గూగుల్ కీబోర్డులో ZWNJ కీ స్థానాన్ని చూపించే తెరపట్టు

విండోస్ ఇన్స్క్రిప్ట్[మార్చు]

ZWNJ=<Ctrl+Shift+2>

లినక్స్ ఇన్స్క్రిప్ట్[మార్చు]

(ibus, scim m17n-tables వాడేటప్పుడు)

ZWNJ=<shift+b>,

తెలుగు వికీపీడియాలో[మార్చు]

తెలుగు వికీపీడియాలో ZWNJ ను చేర్చడానికి, పైన చెప్పిన పద్ధతులతో పాటు {{ZWNJ}} అనే మూసను కూడా వాడవచ్చు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "FAQ - Indic Scripts and Languages". www.unicode.org. Retrieved 2020-03-15.