జీవనాటకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జీవితాన్ని అనుకరించేది నాటకం. లోకంలోని సన్నివేశాలు, సంఘటనలు ఆధారంతో లేదా ప్రేరణతో నాటకాలు రాసి ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలు కాలానికనుగుణంగా మారుతూ ఉంటాయి. పూర్వకాలంలో రంగస్థలాలంటూ ప్రత్యేకంగా ఉండేవికావు. కాబట్టి వీధుల్లో నాటకాలు వేసేవారు. దాదాపు అన్ని ప్రదర్శనలు నేలపైనే జరిగేవి. కొంతకాలం గడిచాక నాలుగురోడ్ల కూడలిలోగానీ, ధనవంతుల ఇళ్లముందు గానీ మట్టిని దిబ్బగాపోసి వెనుకవైపు తెరను ఉంచి మూడువైపులా ఉన్న ప్రేక్షకులకు కనిపించేవిధంగా ప్రదర్శనలు జరిగేవి. దీనిని మొదటి నాటకరంగంగా భావించారు. ఆంగ్ల నాటకప్రభావంతో కొంత మార్పు వచ్చింది. నిర్ణీతమైన కొలతలతో తాత్కాలికంగా గానీ, శాశ్వతంగా గానీ రంగస్థలాన్ని నిర్యించి మూడు వైపులా తెరలుకట్టి ప్రదర్శన ఇచ్చేవారు. రంగస్థలానికి అభిముఖంగా ప్రేక్షకులు కూర్చునేవారు. ఇది నాటకరంగంలో రెండవదశ. దీనిని ’ప్రొసీనియం థియేటర్‘ అంటారు. నాటకం రంగస్థలాన్ని వదిలి తిరిగి నేలపైకే వచ్చింది. దానని ఆధునిక వీధి నాటకం అని అంటారు. ’ప్రొసీనియం థియేటర్, ఆధునిక వీధి నాటకం దశలమధ్య మరో వినూతనత్వం చోటు చేసుకుంది. అదే ’ఎన్విరాన్మెంట్ థియేటర్‘ (సహజ పరికరాల నాటకరంగం).[1]

జీవనాటక సిద్ధాంతంలో వచ్చిన నాటికలు[మార్చు]

ఈ ప్రభావంతో నటులు, రచయిత, దర్శకులు ఎ.ఆర్.కృష్ణ మేధస్సులో నుండి పుట్టిన ప్రయోగం మాలపల్లి[2] ప్రదర్శన. కీలుబొమ్మలు, యథాప్రజా తథారాజా, రాళ్ళపల్లి ముగింపులేని కథ, పాటిబండ్ల ఆనందరావు పడమటి గాలి నాటకాలు ఈ కోవలోకి వస్తాయి.

మూలాలు[మార్చు]

  1. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు - ప్రయోగాలు, (పుట. 473), రచన. డా. కందిమళ్ళ సాంబశివరావు
  2. నవతెలంగాణ, జాతర-స్టోరి (8 December 2015). "నాటకం-వామపక్ష భావజాలం". Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020. Check date values in: |archivedate= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=జీవనాటకం&oldid=2896770" నుండి వెలికితీశారు