జుబేదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జుబేదా బేగం
జుబేదా బేగం (1934)
జననం
జుబేదా బేగం

1911
మరణం1988 సెప్టెంబరు 21(1988-09-21) (వయసు 76–77)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1922–1949
జీవిత భాగస్వామిమహారాజ్ నర్సింగిర్ ధనరాజ్గిర్ జ్ఞాన్ బహదూర్
పిల్లలు2
తల్లిదండ్రులుఫాతిమా బేగం
నవాబ్ సిదీ ఇబ్రహీం ముహమ్మద్ యాకుత్ ఖాన్ III
బంధువులుసుల్తానా (సోదరి)
రియా పిళ్లై (మనవరాలు)

జుబేదా బేగం ధనరాజ్‌గిర్ (1911 - 1998 సెప్టెంబరు 21) గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి. మొదటి భారతీయ టాకీ సినిమా ఆలం అరా (1931)లో నటించింది. దేవదాస్ (1937), మేరీ జాన్ సినిమాలు ఉన్నాయి. మూకీ యుగం నుండి టాకీలకు మారిన కొద్దిమంది నటీమణులలో జుబేదా ఒకరు.

ఆలం అరా (1931)లో మాస్టర్ విఠల్‌తో జుబేదా

జననం

[మార్చు]

జుబేదా 1911లో నవాబ్ సిదీ ఇబ్రహీం ముహమ్మద్ యాకుత్ ఖాన్ III - ఫాతిమా బేగం దంపతులకు గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్ నగరంలో జన్మించింది. ఆమెకు సుల్తానా, షెహజాదీ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారిద్దరు కూడా నటీమణులే. గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు సరైన వృత్తిగా భావించని కాలంలో కూడా చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ప్రవేశించిన అతికొద్ది మంది అమ్మాయిల్లో జుబేదా కూడా ఒకరు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జుబేదా హైదరాబాద్‌కు చెందిన మహారాజ్ నర్సింగిర్ ధనరాజ్‌గిర్ జ్ఞాన్ బహదూర్‌ను వివాహం చేసుకున్నది. వారికి హుమాయున్ ధనరాజ్‌గిర్, ధుర్రేశ్వర్ ధనరాజ్‌గిర్‌ సంతానం కలిగారు.

నటనారంగం

[మార్చు]

జుబేదా కేవలం 12 ఏళ్ళ వయసులోనే కోహినూర్‌లో అరంగేట్రం చేసింది. 1920ల నాటికి ఆమె సుల్తానాతోపాటు కొన్ని సినిమాలలో నటించింది. భారతీయ సినిమాకు చెందిన ప్రముఖ మహిళల్లో ఒకరిగా నిలిచింది.[2] ఇద్దరు సోదరీమణులు నటించిన చిత్రాలలో 1924లో వచ్చిన కళ్యాణ్ ఖాజినా ఒకటి. అంతకు రెండు సంవత్సరాల ముందు విడుదలైన జుబేదా మొదటి బ్లాక్‌బస్టర్ వీర్ అభిమన్యులో కూడా వారిద్దరు స్క్రీన్‌ను పంచుకున్నారు. అందులో వారి తల్లి ఫాతిమా బేగం కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది.

1925లో జుబేదా నటించిన తొమ్మిది సినిమాలు విడుదలయ్యాయి. అలం అరా తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ రావడానికి ముందు జుబేదా మూకీ సినిమాలలో నటించి విజయాన్ని సాధించింది.[3] దాంతో భారతీయ సినిమారంగంలో జబేదా ఎక్కువ పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగింది.[4]

'30లు, 40వ దశకం ప్రారంభంలో సుభద్ర, ఉత్తర, ద్రౌపది వంటి అనేక విజయవంతమైన చారిత్రక పురాణ సినిమాలలో నటించింది. 1934లో నానుభాయ్ వకీల్‌తో కలిసి మహాలక్ష్మి మూవీటోన్‌ని స్థాపించింది. గుల్-ఎ-సోనోబార్, రసిక్-ఎ-లైలా సినిమాలతో బాక్సాఫీస్ బొనాంజాలను అందుకుంది. 1949 వరకు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలలో నటించింది. నిర్దోష్ అబ్లా ఆమె చివరి సినిమా.

సినిమాలు

[మార్చు]
  1. గుల్-ఎ-బకావలి (1924)
  2. మనోరమ (1924)
  3. పృథ్వీ వల్లభ్ (1924)
  4. సతీ సర్దర్బా (1924)
  5. కాలా చోర్ (1925)
  6. దేవదాసి (1925)
  7. ఇంద్రసభ (1925)
  8. రా నవ్ఘన్ (1925)
  9. రాజ్‌నగర్ రంభ (1925)
  10. దేశ్నా దుష్మన్ (1925)
  11. యశోదేవి (1925)
  12. ఖందానీ ఖవీస్ (1925)
  13. సతీ సిమంతిని (1925)
  14. బుల్బుల్ పారిస్తాన్ (1926)
  15. కాశ్మీరా (1926)
  16. రాజా భోజ్ (1926)
  17. ఇంద్రజల్ (1926)
  18. సతీ మేనాదేవి (1926)
  19. లైలా మజ్ను (1927)
  20. నానంద్ భోజాయ్ (1927)
  21. బాలిదాన్ (1927)
  22. చమక్తి చందా (1928)
  23. సామ్రాట్ అశోక్ (1928)
  24. గోల్డెన్ గ్యాంగ్ (1928)
  25. హీర్ రంఝా (1928)
  26. కనకతార (1929)
  27. మహాసుందర్ (1929)
  28. మిలన్ దినార్ (1929)
  29. షాహి చోర్ (1929)
  30. జై భారతి (1929)
  31. దేవదాసి (1930)
  32. గర్వా ఖండన్ (1930)
  33. జోబన్ నా జాదు (1930)
  34. వీర్ రాజ్‌పుత్ (1930)
  35. సిన్హ్ నో పంజా (1930)
  36. మీతీ చూరి (1931)
  37. దివానీ దునియా (1931)
  38. రూప్ సుందరి (1931)
  39. హూర్-ఎ-మిసార్ (1931)
  40. కర్మనో కహెర్ (1931)
  41. నదీరా (1931)
  42. ఆలం అరా (1931)
  43. మేరీ జాన్ (1931)
  44. వీర్ అభిమన్యు (1931)
  45. మీరాబాయి (1932)
  46. సుభద్ర హరన్ (1932)
  47. జరీనా (1932)
  48. హరిజన్ (1933)
  49. బుల్బుల్ పంజాబ్ (1933)
  50. పాండవ్ కౌరవ్ (1933)
  51. మహాభారతం (1933)
  52. గుల్ సనోబర్ (1934)
  53. నానంద్ భోజాయ్ (1934)
  54. రాధా మోహన్/నంద్ కే లాలా (1934)
  55. రాసిక్-ఎ-లైలా (1934)
  56. సేవా సదన్ (1934)
  57. బీర్బల్ కీ బేటీ (1935)
  58. గుల్షానే ఆలం (1935)
  59. మిస్టర్ అండ్ మిసెస్ బాంబే (1936)
  60. ఔరత్ కి జిందగీ (1937)
  61. కిస్కి ప్యారీ (1937)
  62. దేవదాస్ (1937)
  63. నిర్దోష్ అబ్లా (1949)
  64. అవారా (1951): యంగ్ రీటా

మరణం

[మార్చు]

జుబేదా తన చివరి సంవత్సరాలను బొంబాయి ప్యాలెస్, ధనరాజ్ మహల్‌లో గడిపింది. 1988 సెప్టెంబరు 21న మరణించింది.[5] దక్షిణ ముంబైలోని అపోలో బండర్, కోల్బా ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గ్ లో అంత్యక్రియలు జరిగాయి.

మూలాలు

[మార్చు]
  1. Nazir, Asjad. "Lighting Up the Big Screen."Eastern Eye, 26 July 2013, pp. 21-33. ProQuest.
  2. Willemen, Paul (2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. pp. 241–242. ISBN 9781135943189.
  3. Nazir, Asjad. "Lighting Up the Big Screen."Eastern Eye, 26 July 2013, pp. 21-33. ProQuest.
  4. Khurana, Ashleshaa (16 March 2011). "Google features 80th anniversary of India's first talkie 'Alam Ara'". The Times of India. Retrieved 12 August 2021 – via ProQuest.
  5. With Rani Zubeida Dharajgir's death:Curtain comes down on silent movie. ది ఫ్రీ ప్రెస్ జర్నల్ 17 October 1988 Archived 16 జూలై 2011 at the Wayback Machine

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=జుబేదా&oldid=3845219" నుండి వెలికితీశారు