Jump to content

ఫాతిమా బేగం

వికీపీడియా నుండి
ఫాతిమా బేగం
జననం1892
భారతదేశం
మరణం1983 (aged 90–91)
భారతదేశం
వృత్తిసినిమా నటి, దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత్రి
జీవిత భాగస్వామినవాబ్ సిదీ ఇబ్రహీం ముహమ్మద్ యాకుత్ ఖాన్ III
పిల్లలు3, జుబేదా, సుల్తానా, షెహజాదీ
బంధువులురియా పిళ్లై (ముని మనవరాలు)

ఫాతిమా బేగం (1892–1983) ఒక భారతీయ సినిమా నటి, దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత్రి. భారతీయ సినిమా మొదటి మహిళా చిత్ర దర్శకురాలిగా పరిగణించబడుతోంది.[1] నాలుగు సంవత్సరాలలో ఆమె అనేక చిత్రాలకు రచయిత్రిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవహరించింది. ఫాత్మా ఫిల్మ్స్‌ పేరుతో స్వంత నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది, అది తరువాత విక్టోరియా-ఫాత్మా ఫిల్మ్స్‌గా మార్చబడింది. 1926లో బుల్బుల్-ఎ-పరిస్థాన్‌ అనే సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించింది.[2][3]

జీవిత విశేషాలు

[మార్చు]
1925లో ఫాత్మా బేగం

ఫాతిమా బేగం 1892లో ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబంలో జన్మించింది. సచిన్ రాష్ట్రానికి చెందిన నవాబ్ సిదీ ఇబ్రహీం ముహమ్మద్ యాకుత్ ఖాన్ IIIని వివాహం చేసుకున్నది.[4] వారికి ముగ్గరు (జుబేదా, సుల్తానా, షెహజాదీ) సంతానం.[5] ఆ ముగ్గురు కూడా మూకీ సినిమాలలో నటించి పేరు పొందారు. ముని మనవరాలు రియా పిళ్లైకి మోడలింగ్, నటనారంగంలో రాణించింది.[6]

సినిమారంగం

[మార్చు]

ఫాతిమా మొదటగా నటిగా ఉర్దూ నాటకరంగంలోకి అడుగుపెట్టింది. తరువాతికాలంలో సినిమారంగంలోకి వచ్చింది. అర్దేశిర్ ఇరానీ 1922లో తీసిన వీర్ అభిమన్యు అనే మూకీ సినిమాలో తొలిసారిగా నటించింది.[7] అప్పటి రోజులలో నాటకాలు, సినిమాలలో పురుషులు స్త్రీ పాత్రలను పోషించడం సాధారణం కాబట్టి, ఫాతిమా మహిళా సూపర్‌స్టార్‌గా ఎదిగింది.

1926లో ఫాత్మా ఫిల్మ్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది, అది తర్వాతికాలంలో 1928లో విక్టోరియా-ఫాతిమా ఫిల్మ్స్‌గా పిలువబడింది. ఫాంటసీ సినిమాకి మార్గదర్శకురాలైన ఫాతిమా స్పెషల్ ఎఫెక్ట్‌ల కోసం ట్రిక్ ఫోటోగ్రఫీని ఉపయోగించింది. కోహినూర్ స్టూడియోస్, ఇంపీరియల్ స్టూడియోస్‌ తీసిన సినిమాలలో నటిగా, తన ఫాత్మా ఫిల్మ్స్‌ తీసిన సినిమాలకు రచయిత్రిగా, నిర్మాతగా, దర్శకురాలిగా చేస్తూ నటనను కొనసాగించింది.

ఫాతిమా 1926లో దర్శకత్వం వహించినబుల్బుల్-ఎ-పరిస్తాన్‌ సినిమాకుగానూ భారతీయ సినిమాకి మొదటి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందింది.[8] సినిమా ప్రింట్‌లు ప్రస్తుతం అందుబాటులోలేవు, అధిక బడ్జెట్ నిర్మాణంతోపాటు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్న ఫాంటసీ సినిమాగా వర్ణించబడింది. నిజమైతే, ఈ సినిమా జార్జ్ మెలీస్ వంటి ఫాంటసీ సినిమా ప్రారంభకులలో ఒకరిగా ఫాతిమా నిలుస్తోంది. తన స్వంత నిర్మాణ సంస్థ నుండి సినిమాలను నిర్మించడంతోపాటు 1938లో తన చివరి చిత్రం దునియా క్యా హై? వరకు కోహినూర్ స్టూడియోస్, ఇంపీరియల్ స్టూడియోస్ సినిమాలలో కూడా నటించింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1922 వీర్ అభిమన్యు నటి అర్దేశిర్ ఇరానీ మూకీ చిత్రంతో అరంగేట్రం చేసింది
1926 బుల్బుల్-ఎ-పరిస్తాన్ దర్శకురాలు భారతీయ సినిమా తొలి మహిళా దర్శకురాలు; సొంత నిర్మాణ సంస్థ 'ఫాత్మా ఫిల్మ్స్'
1929 గాడెస్ ఆఫ్ లక్ దర్శకురాలు
1938 దునియా క్యా హై? నటి

మరణం

[మార్చు]

ఫాతిమా తన 91వ ఏట 1983లో మరణించింది.

వారసత్వం

[మార్చు]

ఫాతిమా వారసత్వాన్ని తన కుమార్తె జుబేదా కొనసాగించింది. జుబేదా మూకీ సినిమాలతోపాటు, భారతదేశపు మొట్టమొదటి టాకీ సినిమా ఆలం అరాలో కూడా నటించింది.[9]

మూలాలు

[మార్చు]
  1. Rajadhyaksha, Ashish, ed. (1999). Encyclopedia of Indian Cinema (2 ed.). New York: Routledge. p. 95. ISBN 1579581463.
  2. "Bollywood's unforgettable women - Times of India". The Times of India. Archived from the original on 2 February 2017. Retrieved 2023-02-18.
  3. Pandya, Sonal. "Fatma Begum, Jaddanbai: The earliest female filmmakers of Indian cinema". Cinestaan. Archived from the original on 26 February 2020. Retrieved 2023-02-18.
  4. "Sachin Princely State (9 gun salute)". Archived from the original on 23 April 2017. Retrieved 2023-02-18.
  5. Encyclopedia of Indian Cinema.
  6. "Who is Rhea Pillai- Daily Bhaskar". Archived from the original on 22 August 2019. Retrieved 2023-02-18.
  7. Encyclopedia of Indian Cinema.
  8. "100 Years of Indian Cinema: The first women directors". IBNLive. Archived from the original on 12 March 2016. Retrieved 2023-02-18.
  9. Encyclopedia of Indian Cinema.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.