సుల్తానా (నటి)
సుల్తానా | |
---|---|
జననం | సుల్తానా |
వృత్తి | నటి, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1922–1937 |
జీవిత భాగస్వామి | సేథ్ రజాక్ |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు | ఫాతిమా బేగం నవాబ్ సిది ఇబ్రహీం ముహమ్మద్ యాకుత్ ఖాన్ III |
బంధువులు | జమీల రజాక్ (కుమార్తె) వకార్ హసన్ (అల్లుడు) జుబేదా (సోదరి) రియా పిళ్లై (ముని మనవరాలు) |
సుల్తానా (సుల్తానా రజాక్), భారతీయ తొలితరం సినిమా నటీమణి. మూకీ, టాకీ సినిమాలలో నటించింది. భారతదేశపు తొలి మహిళా సినిమా దర్శకురాలు ఫాతిమా బేగం కుమార్తె. భారతదేశ మొదటి టాకీ సినిమా ఆలం ఆరా (1931) నటి జుబేదాకు సోదరి.[1]
జననం, కుటుంబం
[మార్చు]సుల్తానా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో జన్మించింది. తండ్రి నవాబ్ సిది ఇబ్రహీం ముహమ్మద్ యాకుత్ ఖాన్ III, తల్లి ఫాతిమా బేగం. ఆమెకు ఇద్దరు సోదరీమణులు (జుబేదా, షెహజాది) ఉన్నారు. వారిద్దరూ కూడా నటీమణులు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]సుల్తానాకు సేథ్ రజాక్ తో వివాహం జరిగింది. కుమార్తె జమీలా రజాక్, ప్రముఖ పాకిస్థానీ క్రికెటర్ వకార్ హసన్‌ను వివాహం చేసుకుంది. ఇతను చిత్రనిర్మాత ఇక్బాల్ షెహజాద్ సోదరుడు. అతను కరాచీలో నేషనల్ ఫుడ్స్ పేరుతో వ్యాపారాన్ని నడుపుతున్నాడు.[2]
నటనారంగం
[మార్చు]సుల్తానా మూకీ సినిమాల యుగంలో ప్రసిద్ధ నటిగా వెలుగొందింది. శృంగార పాత్రలలో నటించింది. 1922లో వచ్చిన వీర్ అభిమన్యు సినిమాతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత అనేక మూకీ సినిమాల్లోనూ, టాకీ సినిమాల్లోనూ నటించింది. 1947లో భారతదేశం విభజించబడినప్పుడు, ఆమె తన భర్తతో కలిసి పాకిస్తాన్‌కు వలస వెళ్ళింది. సుల్తానా ప్రోత్సాహంతో కూతురు జమీలా రజాక్ కూడా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. సుల్తాని నిర్మాతగా పాకిస్తాన్‌లో హమ్ ఏక్ హైన్ (1961) అనే సినిమాని కూడా నిర్మించింది. దీనిని ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ ఫయాజ్ హష్మీ రచించాడు. ఈ సినిమా సరిగా ఆడకపోవడంతో తర్వాత ఏ సినిమాలను నిర్మించలేదు.[3]
నటించినవి
[మార్చు]మూకీ సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | నిర్మాత/నిర్మాణ సంస్థ | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1922 | వీర్ అభిమానియు | స్టార్ ఫిల్మ్స్ | ఉత్తరి | తొలి సినిమా |
1924 | గుల్ బకావళి | కోహినూర్ & ఇంపీరియల్ | ||
కళ్యాణ్ ఖాజినా | కోహినూర్ & ఇంపీరియల్ | ఒక ఫెయిర్ మైడెన్ | [4] | |
కాలా నాగ్ | కోహినూర్ & ఇంపీరియల్ | |||
మనోరమ | కోహినూర్ & ఇంపీరియల్ | |||
పృథ్వీ వల్లభ | అశోక్ పిక్చర్స్ | |||
సతీ సర్దర్బా | సరస్వతి ఫిల్మ్ కంపెనీ | |||
1925 | ఇంద్ర సభ | కోహినూర్ & ఇంపీరియల్ | ||
1928 | చంద్రావళి | విక్టోరియా ఫాతిమా ఫిల్మ్ కంపెనీ | ||
1929 | కనక్ తార | ఫాతిమా ఫిల్మ్ కంపెనీ | ||
యంగ్ ఇండియా | ఇందులాల్ యాగ్నిక్ | |||
1930 | ఫేట్ బ్రాండ్ | ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ | ||
గ్లోరీ ఆఫ్ ఇండియా | రంజిత్ ఫిల్మ్ కంపెనీ | |||
రెవెన్స్ | ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ | |||
కామెట్ | సూర్య ఎఫ్. కో. | |||
1931 | వేజెస్ ఆఫ్ సిన్ | శారదా మైసూర్ పిక్చర్స్ కార్పొరేషన్ |
టాకీ సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | నిర్మాత/నిర్మాణ సంస్థ | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1931 | మిల్క్ మెయిడ్ | రంజిత్ ఫిల్మ్ కంపెనీ | సుల్తానా తొలి భారతీయ టాకీ చిత్రం | |
కమర్-అల్-జమాన్ | మైమూనాహ్ | |||
1933 | ఇంతేకం | అమర్ మల్లిక్ | ||
షాన్-ఎ-సుభాన్ | బ్రహ్మ ఫిల్మ్ కంపెనీ | |||
1934 | ఆఫ్ఘన్ అబ్లా | కుమార్ ఎం. | ||
అమీర్జాది | కుమార్ ఎం. | |||
సౌభాగ్య లక్ష్మి | కుమార్ ఎం. | |||
1935 | బెహన్ కా ప్రేమ్ | ప్రోస్పెరిటీ ఫిల్మ్స్ | ||
బిద్రోహీ | ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ | |||
కమ్రూ దేశ్ కీ కామినీ | కుమార్ ఎం. | |||
మౌత్ కా తూఫాన్ | ఆల్ ఇండియా సినిమా | |||
స్టెప్ మదర్ | ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ | |||
1936 | హూర్-ఇ-సముందర్ | విష్ణు సినీ | ||
సాగర్ కి కన్య | విజయ్ పిక్చర్స్ | |||
దేవదాస్ | పార్వతి | |||
1938 | తల్వార్ కా ధాని | |||
1939 | ఇంద్రమాలతి | |||
1940 | ఉషా హరన్ | జనాదరణ పొందిన చిత్రాలు | ||
1949 | గిర్ధర్ గోపాల్ కి మీరా |
నిర్మాత
[మార్చు]సంవత్సరం | పేరు | ఇతర వివరాలు |
---|---|---|
1961 | హమ్ ఏక్ హై | పాకిస్థానీ సినిమా |
మూలాలు
[మార్చు]- ↑ "sultana". Cineplot.com. Retrieved 2023-02-22.
- ↑ "sultana". Cineplot.com. Retrieved 2023-02-22.
- ↑ "sultana". Cineplot.com. Retrieved 2023-02-22.
- ↑ Garga, Bhagavan Das (1996). So Many Cinemas. Eminence Designs. p. 32,43,52. ISBN 9788190060219. Retrieved 2023-02-22.