జూలియన్ గిల్బే
జూలియన్ గిల్బే | |
---|---|
జననం | |
వృత్తి | దర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు |
బంధువులు | నిగెల్ బ్రూస్ (ముత్తాత) విల్ గిల్బే (సోదరుడు) |
జూలియన్ గిల్బే బ్రిటిష్ సినిమా దర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. భయానక సినిమాలకు పనిచేసి ప్రసిద్ధి చెందాడు. నటుడిగా కూడా పాత్రలను పోషించాడు.
జననం
[మార్చు]జూలియన్ గిల్బే యుకెలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]2002లో రెకోనింగ్ డే అనే భయానక సినిమాతో గిల్బే తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఇందులో దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మేకప్ ఆర్టిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.[1] 2006లో 'రోలిన్ విత్ ది నైన్స్' అనే క్రైమ్ సినిబాకు దర్శకత్వం వహించడంతోపాటు ఎడిటింగ్ కూడా చేశాడు.[2] 2007లో రైజ్ ఆఫ్ ది ఫుట్ సోల్జర్ కు దర్శకత్వం వహించి, ఎడిటింగ్ చేశాడు.[3] 2009లో జేక్ వెస్ట్ తీసిన డాగ్హౌస్ అనే హాస్య భయానక సినిమాకు ఎడిటర్ గా పనిచేశాడు.[4]
2011లో తన సోదరుడు విల్ గిల్బేతో కలిసి రాసిన సర్వైవల్ థ్రిల్లర్ ఎ లోన్లీ ప్లేస్ టు డై అనే సినిమాకు దర్శకత్వం వహించి ఎడిటింగ్ చేశాడు.[5]
2013లో గిల్బే విల్ గిల్బే, క్రిస్ హోవార్డ్లతో కలిసి రాసిన అంతర్జాతీయ థ్రిల్లర్ ప్లాస్టిక్ కు దర్శకత్వం వహించాడు.[6]
2014లో "ది ఎబిసి'స్ ఆఫ్ డెత్ 2" అనే లఘు చిత్ర విభాగానికి దర్శకత్వం వహించాడు.
2018లో ఫ్రెడ్డీ థోర్ప్, ఎమ్మా టాచర్డ్ - మాకీ నటించిన డ్రామా సినిమా సమ్మిట్ ఫీవర్ కు దర్శకత్వం వహించాడు.[7][8]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఇతని ముత్తాత బ్రిటిష్ నటుడు నిగెల్ బ్రూస్, ఇతని సోదరుడు విల్ స్క్రీన్ ప్లే రచయిత.[9]
సినిమాలు
[మార్చు]- రీకోనింగ్ డే (2000)
- రోలిన్ ' విత్ ది నైన్స్ (2005)
- రైజ్ ఆఫ్ ది ఫుట్ సోల్జర్ (2007)
- ఎ లోన్లీ ప్లేస్ టు డై (2010)
- ప్లాస్టిక్ (2013) - డైరెక్టర్/ఎడిటర్/రైటర్
- సమ్మిట్ ఫీవర్ (2022)
మూలాలు
[మార్చు]- ↑ Julian Gilbey exclusive interview: British director talks ‘Reckoning Day’
- ↑ Film4
- ↑ Rise of the Footsoldier
- ↑ Art & Features for Doghouse DVD, Blu-Ray
- ↑ Bradshaw, Peter (2011-09-08). "A Lonely Place to Die – review". Guardian.co.uk.
- ↑ "Julian Gilbey helming Plastic". firefly company. 20 December 2012. Retrieved 26 December 2012.
- ↑ "Summit Fever | Carnaby International Sales and Distribution". www.carnabysales.com. Archived from the original on 2019-01-14.
- ↑ "Carnaby International Adds Three Genre Titles to Cannes Slate". 8 May 2018.
- ↑ The Rise of the Gilbeys - Screendaily