జేమ్స్ గోస్లింగ్
జేమ్స్ ఆర్థుర్ గొస్లింగ్ | |
---|---|
జననం | |
జాతీయత | కెనడా |
విద్యాసంస్థ | కార్నిగే మెలన్ విశ్వవిద్యాలయం, కల్గెరి విశ్వవిద్యాలయం |
వృత్తి | కంప్యూటర్ శాస్త్రవేత్త |
ఉద్యోగం | లిక్విడ్ రాబొటిక్స్ [1] |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | జావా ప్రొగ్రామింగ్ ల్యాంగ్వేజ్ |
పురస్కారాలు | Officer of the ఆర్డర్ ఆఫ్ కెనడా |
వెబ్‌సైటు | జేమ్స్ గొస్లింగ్ బ్లాగ్ |
జేమ్స్ ఏ.గొస్లింగ్ (19, మే 1955 న కాల్గేరికి దగ్గరలో, ఆల్బెర్టా, కెనడాలో జన్మించారు) ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, జావా అనే కంప్యూటర్ భాషకు తండ్రి లాంటి వారు .
చదువు, వృత్తి
[మార్చు]1977 లో గొస్లింగ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో కాల్గెరి విశ్వవిద్యాలయం నుంచి బి.యసి పట్టా పొందారు .1983 లో కంప్యూటర్ సైన్స్ విబాగంలో కార్నిగె మిల్లన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెడి పట్టా పొందారు. గొస్లింగ్ చేసిన పరిశోధనాపత్రం పేరు 'ఆల్జీబ్రాయిక్ కన్స్ట్రైన్ట్స్ ' దీనిని రాజ్ రెడ్డి ఆద్వర్యంలో పూర్తిచేశారు. పరిశోధనాపత్రం కోసం పని చేసేటప్పుడు ఈమ్యాక్ ను రాశారు, సన్ మైక్రొసిస్టమ్స్లో చేరకముందే కార్నిగె మిల్లన్ విశ్వవిద్యాలయంలో గొస్లింగ్ యూనిక్స్కు మల్టిప్రాసొసెర్ వెర్షన్ తయారు చేశారు, ఇవే కాకుండా కొన్ని కంపైలర్స్ మరియూ మైల్ సిస్టమ్స్ తయారు చేశారు. 1984 నుంచి 2010 వరకు సన్ మైక్రొసిస్టమ్స్తో పనిచేశారు, జావా అనే కంప్యూటర్ భాషకు తండ్రి లాంటి వారుగా పరిగణించబడ్డారు. ఏప్రిల్ 2, 2010 న గొస్లింగ్ సన్ మైక్రొసిస్టమ్స్ నుంచి వైదొలిగారు, ఇటీవల సన్ మైక్రొసిస్టమ్స్ని ఓరాకిల్ కార్పొరేషన్ కొనుగొలు చేసింది. 28 మార్చి, 2011 న గొస్లింగ్ కు గూగుల్లో ఉద్యొగం వచ్ఛిందని తన బ్లాగులో రాసుకున్నాడు. 5 నెలల తరువాత తను కొత్త కంపెనీ అయిన లిక్విడ్ రాబొటిక్స్లో చేరినట్లు ప్రకటించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]వివాహితుడు, ఇద్దరు కుమార్తెలు .