జేమ్స్ లిల్లీవైట్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జేమ్స్ లిల్లీవైట్, జూనియర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వెస్ట్ హాంప్నెట్, ససెక్స్, ఇంగ్లాండ్ | 1842 ఫిబ్రవరి 23|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1929 అక్టోబరు 25 చిచెస్టర్, ససెక్స్, ఇంగ్లాండ్ | (వయసు 87)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమ-చేతివాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతివాటం స్లో మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 7) | 1877 మార్చ్ 15 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1877 ఏప్రిల్ 4 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1862–1883 | ససెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరుగా | ||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన టెస్టులు | 6 (1881–1899) | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2008 సెప్టెంబరు 21 |
జేమ్స్ లిల్లీవైట్ (1842 ఫిబ్రవరి 23 - 1929 అక్టోబర్ 25) ఒక ఇంగ్లీష్ టెస్ట్ క్రికెటర్, అంపైర్ . 1876-77లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి ఇంగ్లీష్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ అయిన మొదటి వ్యక్తిగా చరిత్రకెక్కాడు.[1] వీటిలో మొదటిది ఓడిపోయి, రెండవది గెలిచారు.
లిల్లీవైట్ సస్సెక్స్‌లోని వెస్ట్‌హాంప్‌నెట్‌లో ఇటుకలు తయారుచేసే జాన్ లిల్లీవైట్ కి జన్మించాడు. 1861 జనాభా లెక్కల ప్రకారం 19 ఏళ్ల జేమ్స్ వృత్తి ఇటుకల తయారీ. అతని మేనమామ విలియం లిల్లీవైట్, మేనమామ కొడుకులు జేమ్స్ లిల్లీవైట్ సీనియర్, జాన్, ఫ్రెడ్, హ్యారీలు క్రికెటర్లుగానో, ఆ ఆటతో సంబంధం ఉన్న వృత్తితోనో ప్రసిద్ధులు. లిల్లీవైట్‌కు, అతని బంధువు జేమ్స్ సీనియర్‌కు మధ్య తేడాను గుర్తించడానికి వివిధ రచనల్లో ఇతన్ని "జూనియర్" అని పిలుస్తారు. అతను ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యాకా 1862, 1883ల నుంచి ససెక్స్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. అతను 1885లో ఒక చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. లిల్లీవైట్ కూడా 1868లో ఉత్తర అమెరికా పర్యటనలను ఎడ్గార్ విల్‌షెర్ నేతృత్వంలోని జట్టులో, 1873-74లో ఆస్ట్రేలియాకు WG గ్రేస్ నేతృత్వంలోని జట్టులో చేశాడు. అతను 1881-82, 1884-85, 1886-87ల్లో ఆల్ఫ్రెడ్ షా నేతృత్వంలోని జట్లలో ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ జట్టు చేసిన పర్యటనల్లో భాగమయ్యాడు.
- ↑ "International cricketers turned umpires". International Cricket Council. Retrieved 7 April 2018.