Jump to content

జెయ్మ్స్ డొయ్రన్ లన్ట్

వికీపీడియా నుండి
(జేయ్మ్స్ డొయ్రన్ లన్ట్ నుండి దారిమార్పు చెందింది)
జెయ్మ్స్ డొయ్రన్ లన్ట్
జననం1917
మరణం2001
వృత్తిసైనికాధికారి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సైనిక చరిత్రాకారుడు
జీవిత భాగస్వామిముర్యెల్ బిర్ట్ (1940)

జెయ్మ్స్ డొయ్రన్ లన్ట్ (1917–2001) లేదా జేమ్స్ డొయ్రన్ లంట్ భారతదేశంలో సేవలందించిన ఆంగ్లేయ సైనికాధికారీ, సైనిక చరిత్రాకారుడు. ఇతను వ్రాసిన కొన్ని పుస్తకాలు గ్లబ్ పాషా (1984), హుసేన్ ఒఫ్ జోర్డాన్ (1989), జై సిక్స్త్ (1994).

జీవిత విశేషాలు

[మార్చు]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

లన్ట్ లివర్‌పూల్‌లో పుట్టారు. ఐల్ ఒఫ్ మెన్‌లోని (Isle of Man) కింగ్ విల్యమ్ కళాశాలలోనూ (King William), సెన్డ్‌హర్స్ట్‌లోని రొయల్ మిలిటరి కొలెజ్ (Royal Military College, Sandhurst)లోనూ చదివారు. 1940లో ముర్యెల్ బిర్ట్‌తో ఇతనికి పెళ్ళైంది. వీరికి ఒక కొడుకూ, ఒక కూతురూ.

వృత్తి జీవితం

[మార్చు]

సైన్యంలో చేరాక, డ్యూక్ ఒఫ్ వెలింగ్టన్ (Duke of Wellington) దళంలోని 2వ పటాళంలో నియమితుడైయ్యాడు. నాటి అవిభాజ్య భారతదేశంలో మొదట ముల్తాన్[గమనిక 1]లోనూ, తరువాత అమృతసర్‌లోనూ ఈయనకి విధులు వేసారు. 1939లో నాలుగో పటాళం ఐన బర్మా రైఫల్స్ పటాళానికి బదిలీ చేసారు. రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన ఈయన 1942లో జరిగిన రిట్రీట్ ఫ్రమ్ బర్మ (retreat from Burma)లో పాల్గొన్నాడు. ఆ తరువాత దెహరాదూన్‌లోని భారత సైనిక అకాడమీలో శిక్షణ పొందాడు. శిక్షణ తరువాత 1949–52 వరకు 16వ/5వ క్వీన్స్ రొయల్ లేన్సర్స్ (16th/15th Queen's Royal Lancers)[గమనిక 2]లో సేవలందించారు. ఇందులో భాగంగా కొన్నాళ్ళు ఈజిప్టులో కూడా విధులు నిర్వర్తించారు. అది ముగిసాక 1952–55 వరకు జోర్డాన్‌లోని ఒక అరబీ ఆర్మర్డ్ కార్ రెజిమెన్ట్‌కు (armoured car regiment)‌[గమనిక 3] నాయకత్వం వహించారు. దాని తరువాత తన పాత దళం 16వ/5వ క్వీన్స్ రొయల్ లేన్సర్స్ ఇంగ్లన్డ్‌లోని కెటరిక్ (Catterick) పల్లెలో శిక్షణా దళంగా నున్నప్పుడు దానికి నాయకుడిగా ఉన్నాడు‌. 1961లో ఏడెన్ (ఆధునిక యెమెన్‌లోని నగరం)లో ఫెడరల్ రెగ్యులర్ ఆర్మీ (Federal regular army)కి నాయకుడిగా నియమితుడయ్యి, 1964 వరకు ఆ హోదాలో కొనసాగాడు. ఆ పిమ్మట యు.కె రక్షణ మంత్రిత్వ శాఖలో సేవలందించాడు. ఈ సమయంలో ఆయన భారతదేశంలోని బ్రిటిష్ హై కమిషనర్‌కు (High commissioner) సలహాదారుగా వ్యవహరించాడు. 1969 నుండి ఎచ్.క్యు షెయ్ప్‌లో (HQ SHAPE) స్టాఫ్ ఒఫ్ కన్టిన్జెన్సి ప్లెనింగ్‌కు (Staff of Contingency Planning) చీఫ్‌గా (chief) ఉన్నాడు. 1971లో వైస్ ఎజుటన్ట్ జనరల్‌గా (Vice-Adjutant General) పదవి చేపట్టి, 1973 వరకూ కొనసాగి, ఆదే ఏడు ఆగస్టులో పదవీ విరమణ చేసాడు.

పదవీ విరమణానంతరం 1975–80 వరకు 16వ/5వ క్వీన్స్ రొయల్ లేన్సర్స్‌కు కల్నల్ కమన్డాన్ట్ (Colonel commandant)గా ఉన్నాడు. దీనితో పాటే 1973–83 వరకు ఒక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భాగమైన వొడమ్ కళాశాలకు డమెస్టిక్ బర్సర్‌గా (Domestic Bursar)[గమనిక 4] పనిచేసాడు.

రచనలు

[మార్చు]

ఈయన జీవితచరిత్రలూ, సైనిక చరిత్రా రచనలూ వ్రాసారు. వీటిలో కొన్ని:

  • గ్లబ్ పాషా (1984)
  • అ హెల్ ఒఫ్ అ లికింగ్: రిట్రీట్ ఫ్రమ్ బర్మ,1941–42 (1986) (A hell of a licking: Retreat from Burma)
  • హుసేన్ ఒఫ్ జోర్డాన్ (1989)
  • స్కార్లెట్ లేన్సర్స్: ద స్టోరీ ఒఫ్ 16th/5th క్వీన్స్ రొయల్ లేన్సర్స్ 1689–1992 (1993) (Scarlet Lancers: The story of 16th/15th Queen's Royal Lancers)
  • జై సిక్స్త్ (1994)- 6వ గోర్ఖా రైఫల్స్ చరిత్ర

గౌరవాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. ఆధునిక పాకిస్తాన్‌లోని నగరం
  2. ఆంగ్లేయ సైన్యంలో ఒక అశ్వదళం
  3. నాలుగు చక్రాల యుద్ధ వాహనాలలో తిరుగుతూ సైనిక భూపరిశీలన చేసే దళం
  4. కళాశాల రోజువారీ నిర్వహణ చూసుకునే అధికారి
  5. ఇవి ఏదైనా రంగంలో విశేష కృషి చేసినందుకు గాను బ్రిటిష్ రాజరికం ఇచ్చే పురస్కారాలు.

మూలాలు

[మార్చు]
  • Obituary, The Times, 5 October 2001
  • "Major-General James Lunt". The Daily Telegraph. London, UK. 22 October 2001. Retrieved 18 February 2016.
  • Allen, Charles (1990). The Savage Wars of Peace: Soldiers' Voices 1945-1989. London, UK: Joseph. ISBN 9780718128821.