జైమిని భారతం

వికీపీడియా నుండి
(జైమని భారతం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పక్షులతో జైమిని

జైమిని భారతం వ్యాసుని శిష్యుడైన జైమిని మహర్షి చేత రచించబడింది.

నేపథ్యం[మార్చు]

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసినతరువాత, బంధుమిత్రులూ, గురువులూ, దాయాదులతో సహా అశేష జనానీకం ఆయుధ్ధంలో మరణించినందున ధర్మరాజు వ్యథ చెందుతూంటే, వ్యాసమహర్షి అశ్వమేధయాగం చేయమని సూచించడంతో ప్రారంభమవుతుంది. ఆ కథను తన శిష్యుడయిన జైమిని మహర్షిని వ్రాయమని ఆదేశించాడు. ఇదీ సూక్ష్మంగా జైమినీభారతానికి నాంది.[1]

పుస్తకంలో అంశాలు[మార్చు]

ఇందులో కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గురించి అశ్వం దేశం నలుమూల తిరుగునప్పుడు అర్జునుడు, శ్రీకృష్ణుడు ఏవిధంగా అశ్వాన్ని రక్షించి అశ్వమేధ యాగం సమాప్తి చేయించిన విశేషాలు పొందుపరచబడ్డాయి.

ఈ పుస్తకాన్ని వేంకట కృష్ణప్పకవి తెలుగులో అనువదించాడు. ఇది ఐదు అధ్యాయముల వచనకావ్యం. ఇది రచించిన కాలము 18వ శతాబ్దం ప్రథమార్థం కావచ్చును. ఈ గ్రంథానికి జయంతి రామయ్య ఇంగ్లీషులోనూ, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి తెలుగులోనూ విపుల పీఠికలు రాసేరు.

మూలాలు[మార్చు]

  1. మాలతి, రచయిత (2017-11-05). "జైమినీభారతం – చిన్న పరిచయం". తెలుగు తూలిక. Retrieved 2021-05-02.

వనరులు[మార్చు]