జోగాట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డప్పు వాయిద్యకారులు

ఆంధ్ర దేశంలో ఇతర ప్రాంతాల్లో అంతగా ప్రచారంలో లేని ఈ జోగాట తెలంగాణాలో ప్రచారంలో ఉంది. హరిజనులలో ఒక తెగకు సంబంధించిన వారే ఈ జోగువారు. వీరు డప్పు వాయిద్యతో పాటు నృత్యాన్ని చేస్తారు. ఇలా చేసే వారిని సర్కారాంధ్ర దేశంలో మాదిగ వారంటారు. వీరు చెప్పులు కుట్టటంతో పాటు చర్మ కారులుగా వృత్తిని సాగిస్తారు. చాటింపు వేయడం, జాతర్లకూ, వుత్సవాలకూ డప్పు వాయిద్యాలను వాయించుట చేస్తుంటారు. తెలంగాణాలో వున్న జోగు వారు డప్పుల వాయిద్యంతో పాటు నైపుణ్యంగా నృత్యం చేస్తారు. వారి తెగలో ఎవరైనా మరణిస్తే వారిని శ్మశాన వాటికకు ఉత్సవంగా తీసుకు పోతూ డప్పుల వాయిద్యంతో నృత్యం చేస్తారు. కేవలం నృత్యం చేయటమే కాక, నృత్యంతో పాటు గొల్ల కలాపంలో మాదిరి పిండోత్పత్తి క్రమాన్ని వివరంగా వివరిస్తారు. జీవుడు మాతృ గర్భంలో పిండోత్పత్తిలో ప్రవేశించింది మొదలూ నవ మాస క్రమంలో పిండం యొక్క చలనాన్నీ అభివృద్ధి క్రమ్మాన్ని వివరిస్తారు. కేవలం చావు సందర్భాలలోనే కాక సంతోష సందర్భాలలో, వేడుకలలో, వివాహాలలో, ఉత్సవాల్లో కూడా ఈ జోగుల వారు వారి డప్పుల నృత్య విన్యాసాన్ని ప్రదర్శిస్తారు. ఈ డప్పు వాయిద్యం చూపరులకు ఉత్తేజాన్ని కలుగ జేస్తుంది.

సూచికలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జోగాట&oldid=3276050" నుండి వెలికితీశారు