జోరంతంగ
జోరంతంగ | |||
![]() జోరంతంగా | |||
పదవీ కాలం 2018 డిసెంబరు 15 – 2023 డిసెంబరు 07 | |||
గవర్నరు | పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై | ||
---|---|---|---|
పదవీ కాలం 1998 డిసెంబరు 3 – 2008 డిసెంబరు 11 | |||
గవర్నరు | ఎం.ఎం.లఖేరా | ||
ముందు | లాల్ తాంహ్వల | ||
తరువాత | లాల్ తాంహ్వల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సంతాంగ్, అస్సాం ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత మిజోరం, భారతదేశం) | 13 జూలై 1944||
రాజకీయ పార్టీ | మిజో నేషనల్ ఫ్రంట్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | ||
జీవిత భాగస్వామి | రోనెఇహసంగి | ||
సంతానం | 2 | ||
నివాసం | ఐజాల్, మిజోరం, భారతదేశం |
జోరంతంగ, (జననం 1944 జులై 13) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. మిజోరం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఇతను మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షుడు.[1]
బాల్యం
[మార్చు]జోరంతంగ 1944 జులై 13న దర్ఫవుంగా, వాంహ్నునిచ్చింగి దంపతులకు సంతాంగ్ గ్రామంలో జన్మించాడు. ఇతనికి నలుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు.[2]
విద్య
[మార్చు]1950లో జోరంతంగ సంతాంగ్ గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో తన చదువుని ప్రారంభించాడు. ఆ తరువాత గాంధీ మెమోరియల్ హైస్కూల్ లో చదువు కొనసాగించాడు.[3] ఆ సమయంలో మిజోరం రాష్ట్రంలో సరైన విద్యా సదుపాయాలు లేకపోవడం వల్ల, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేక జోరంతంగ చదువు సాగించడం కష్టంగా ఉందని అతను చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. ఆ తరువాత తంగ మణిపూర్ లోని ఇంఫాల్ వెళ్లి అక్కడ ధనమంజురి (డి.ఎం.) కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో ప్రీ - యూనివర్శిటీ కాలేజీ (పియుసి, హయ్యర్ సెకండరీకి సమానం)లో చేరాడు. 1962లో పియుసి పూర్తి చేసి, 1966లో బి.ఎ. ఆంగ్లంలో పట్టభద్రుడయ్యాడు.
వృత్తి జీవితం
[మార్చు]జోరామ్‌తంగా 1965 లో తన కళాశాల చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు మిజో నేషనల్ ఫ్రంట్ స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు.[4] 1966 లో ఎంఎన్ఎఫ్ తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు, అతను గెరిల్లా ఉద్యమంలో చేరి బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) సరిహద్దు ప్రాంతంలోని ఒక అండర్ గ్రౌండ్ స్థావరానికి వెళ్ళాడు. 1969 లో, ఎం.ఎన్.ఎప్. కార్యకర్తలందరు తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) కి వెళ్లారు. ఆ దళానికి లాల్డెంగా అధ్యక్షుడుగా ఉండేవాడు. తరువాత లాల్డెంగా మిజోరం ముఖ్యమంత్రి పదవికూడా చేపట్టాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Early Christmas For Mizoram's MNF, Zoramthanga To Be New Chief Minister". NDTV.com. Retrieved 2021-06-22.
- ↑ "Biodata of Shri Zoramthanga". mizoram.nic.in. Retrieved 2021-06-22.
- ↑ Dec 12, Prabin Kalita / TNN / Updated:; 2018; Ist, 08:46. "Zoramthanga: Mizoram results: This former guerrilla scripted Congress defeat | Guwahati News - Times of India". The Times of India. Retrieved 2021-06-22.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Sharma, Shantanu Nandan. "Zoramthanga: From being an insurgent to becoming Mizoram CM". The Economic Times. Retrieved 2021-06-22.
- ↑ "MNF chief Zoramthanga: The Sun Tzu of Mizoram". The New Indian Express. Retrieved 2021-06-22.