Jump to content

జోహాన్స్ కెప్లర్

వికీపీడియా నుండి
జోహాన్స్ కెప్లర్
A 1610 portrait of Johannes Kepler by an unknown artist
జననం(1571-12-27)1571 డిసెంబరు 27
వీల్ డెర్ స్టాడ్ట్ స్టట్ గార్ట్ సమీపం, జర్మనీ
మరణం1630 నవంబరు 15(1630-11-15) (వయసు 58)
రగెన్స్ బర్గ్, బవేరియా, జర్మనీ
నివాసంBaden-Württemberg; Styria; Bohemia; Upper Austria
రంగములుఖగోళ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, గణిత శాస్త్రము and ప్రాకృతిక తత్వం
వృత్తిసంస్థలులిన్జ్ యూనివర్శిటీ
చదువుకున్న సంస్థలుటుబింగెన్ యూనివర్సిటీ
ప్రసిద్ధికెప్లర్ గ్రహగమన సిద్ధాంతం
Kepler conjecture

జోహాన్స్ కెప్లర్ (Johannes Kepler) (డిసెంబరు 27, 1571నవంబరు 15, 1630) ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. ఇతడు గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్య శాస్త్రవేత్త. 17వ శతాబ్దం జరిగిన ఖగోళశాస్త్ర ప్రభంజనంలో కీలక పాత్ర పోషించాడు. ఇతన్ని కెప్లర్ గ్రహగమన సిద్ధాంతం ద్వారా అందరూ గుర్తిస్తారు. ఇతన్ని గ్రహాల పరిభ్రమణంతోపాటు, ఈయన ప్రతిపాదించిన వివిధ సిద్ధాంతాలు 17 శతాబ్దంలో విప్లవాన్ని సృష్టించాయనే చెప్పవచ్చు.

కనుక్కోనదాన్ని గురించీ

[మార్చు]
Epitome astronomiae copernicanae, 1618

గ్రహాల పరిభ్రమణానికి సంబంధించి ఈయన మూడు సూత్రాలు ప్రతిపాదించాడు. టుబెజిన్ యూనివర్సిటీలో ఆయన తత్వశాస్త్రం, గణితం, అంతరిక్షశాస్త్రానికి చెందిన నైపుణ్యాలను బాగా వృద్ధి చేసుకున్నాడు. ఈయన అప్పటి కాలానికే చెందిన గెలిలియోకు సమకాలీనుడు. గ్రహాల కదలికలపై కెప్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు, తర్వాతి కాలంలో న్యూటన్ సిద్ధాంతాలను ప్రతిపాదించడానికి ఎంతగానో ఉపయోగపడింది. . ఆస్ట్రియా గ్రాజ్‌లోని ప్రొటెస్టెంట్ పాఠశాలలో గణితం, ఖగోళశాస్త్రాల ఉపాధ్యాయుడిగా చేరారు. తర్వాత టుబిన్‌జెన్ విశ్వవిద్యాలయంలో బోధకుడిగా పనిచేశారు. ఖగోళ, జ్యోతిష, గణిత, తత్వ శాస్త్రాలపై అధ్యయనం చేశారు. గ్రహాల కొత్త కక్ష్యల గురించి అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త టైకో బ్రాహి కెప్లర్‌ని తన సహాయకుడిగా నియమించుకున్నాడు. టైకో బ్రాహి మరణాంతరం ఇంపీరియల్ గణిత శాస్త్రవేత్తగా కెప్లర్ పదవిని పొందారు. గణన చేయడానికి వర్గమానాలను ఏవిధంగా ఉపయోగించవచ్చో వివరించారు. గ్రహగతులకు సంబంధించి మూడు నియమాలు ప్రతిపాదించారు. కోపర్నికస్ తెలియజేసిన విషయాలను మెరుగుపరిచి వాటిని అభివృద్ధి చేశారు. కెప్లర్ గతి నియమాలు, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడ్డాయి.

1630లో నవంబరు 15న తన 58వ ఏట జర్మనీలోని రెజెన్స్‌బెర్గ్‌లో మరణించారు.

స్మృతి చిహ్నాలు: చెక్ రిపబ్లిక్ ప్రేగ్‌లో టైకోబ్రా, కెప్లర్ శిలావిగ్రహాలు ప్రతిష్ఠించారు. 2002లో కెప్లర్ చిత్రం ఉన్న 10 యూరోల వెండి నాణెం విడుదల చేసారు. జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆయన చిత్రాన్ని కలిగి ఉన్న తపాలా బిళ్ల విడుదలజేసింది.

కెప్లర్ గౌరవార్థం, నామకరణాలు

[మార్చు]

నాసా కెప్లర్ గౌరవార్థం 2009 మార్చి6న ఒక మిషన్‌ను ఏర్పాటు చేసింది

ఇవీ చూండండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయోగ్రఫీ

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]