టాస్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టాస్క్
TASK logo.jpg
టాస్క్ లోగో
ప్రదేశంతెలంగాణ, భారతదేశం
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం
వెబ్‌సైటుటాస్క్ అధికారిక వెబ్ సైట్

టాస్క్ కు పూర్తిపేరు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (తెలంగాణ నైపుణ్య, విజ్ఞానాభివృద్ధి సంస్థ). విద్యార్థుల పరిజ్ఞానాన్నీ, నైపుణ్యాలనూ పెంచేందుకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం దీనిని ఏర్పాటుచేసింది. ఐటీ, ఐటీ ఆధారిత సేవల నుంచి ఏరోస్పేస్‌, హెల్త్‌కేర్‌, ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ లాంటి ఇతర రంగాలకు సంబంధించిన శిక్షణను కూడా నిర్వహిస్తుంది. [1]

సామ్ సంగ్ టాస్క్ అకాడమీ
టాస్క్ ప్రారంభోత్సవం

సభ్యత్వం[మార్చు]

అర్హత: బీటెక్‌ రెండు, మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్ విద్యార్థులకు... డిగ్రీ ముగించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విద్యార్థులకు టాస్క్‌లో సభ్యత్వం వేరువేరుగా ఉంటుంది. నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటెక్‌తో సహా, ఏ రంగంలోనైనా డిగ్రీ లేక పీజీ చేస్తున్న విద్యార్థులు, పాలిటెక్నిక్‌ ఐటీఐ చదువుతున్న విద్యార్థులు సభ్యత్వం నమోదు చేసుకోవడానికి అర్హులు.

విద్యార్థులు తమ పూర్తి వివరాల (ఆధార్‌ సంఖ్య, ఇంటి చిరునామా, విద్యార్హత వివరాలు, ఫొటో వివరాలు) తో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. సభ్యత్య రుసుము కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించే వీలుంది. సభ్యత్వం కోర్సు ముగిసేంతవరకూ చెల్లుబాటవుతుంది.[1]

సభ్యులకు టాస్క్ అందించే సహాయ సహకారాలు[మార్చు]

 • ఆంగ్ల భాష, సాఫ్ట్‌స్కిల్స్‌లో ప్రావీణ్యం
 • సోషల్‌ మీడియా, మొబైల్‌, అనలిటిక్స్‌, క్లౌడ్‌ వంటి సరికొత్త సాంకేతికతల్లో శిక్షణ, సర్టిఫికేషన్‌ అవకాశం
 • వివిధ రకాల సెమినార్లలో పాల్గొనే అవకాశం
 • డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ విద్యార్థులకు ఐటీ, మౌలికాంశాలపై అవగాహన, నేర్పుల్లో శిక్షణ
 • సహజ సామర్థ్యం, హేతువుల్లో మూల్యాంకన పరీక్షలు
 • ప్రోగ్రామింగ్‌లో సహజ సామర్థ్య పరీక్షలు
 • కార్పొరేట్‌ సంస్థల సందర్శనకు అవకాశం
 • ఈ- శిక్షణ వనరులు అందుబాటులో ఉండడం
 • మదింపు పరీక్షల వనరులు ఆన్‌లైన్‌లో లభ్యం
 • ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సహకారంతో టెక్నాలజీ ఉద్యోగపతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం
 • కృత్రిమ (వర్చువల్‌) ప్రయోగశాలల ప్రవేశం
 • కోడింగ్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం
 • నూతన టెక్నాలజీ ఆవిష్కరణలకు సహకారం
 • కెరియర్‌ కౌన్సెలింగ్‌, మార్గదర్శనం
 • సమర్థంగా ప్రాజెక్టులు చేయడంలో మార్గదర్శనం, సహాయం
 • వేసవిలో శిక్షణకు సంబంధించిన మలిదశ (ఇంటర్న్‌షిప్‌)[1]

శిక్షణలు[మార్చు]

1. టెక్నాలజీ ఉద్యోగపతుల కార్యక్రమం, 2. ఐఓటీ- మేకర్స్‌ స్పేస్‌, 3. ఈఎస్‌డీఎం, 4. సూపర్‌ క్యాంపస్‌, 5. టాస్క్‌- సిడాక్‌ వంటి అయిదు అంశాలలో శిక్షణలు ఇస్తారు.[1]

టాస్క్‌ ఏర్పాటు లక్ష్యాలు[మార్చు]

 • యువత కార్పొరేట్‌ ఉద్యోగాలు పొందడంలో విఫలమవడం
 • వారివారి కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం సంపాదించకపోవడం
 • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోవడం
 • సంస్థాపరమైన అవగాహన లేకపోవడం[2]

2015లో 5వేల మందికి పైగా శిక్షణ[మార్చు]

2015లో టాస్క్ ఆధ్వర్యంలో 1100మంది డిగ్రీ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌పై, 600మందికి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌పై, 550 మందికి ఐటీ స్కిల్స్‌పై, 2100మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు పీఓపీ స్కిల్స్‌పై, ఇంకా వివిధ అంశాల్లో 676 దాదాపు ఐదు వేల మందికిపైగా శిక్షణ పొందారు.[3]

లెక్చరర్లకు టాస్క్ ప్రత్యేక శిక్షణ[మార్చు]

వివిధ కాలేజీల్లోని విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న టాస్క్ లెక్చరర్లకు కూడా ప్రత్యేక శిక్షణను నిర్వహించింది. మొదటి బ్యాచ్ లో మహిళా లెక్చరర్లకు ప్రాధాన్యమిచ్చి శిక్షణను పూర్తి చేసింది. ఐఎస్‌బీతో కలిసి టాస్క్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను రూపొందించిన టాస్క్ ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు శిక్షణ ఇచ్చింది. 14 అంశాలను నిర్దేశించుకొని కమ్యూనికేషన్, నూతన నైపుణ్యాలు, తరగతి గదిలో వ్యవహారశైలి వంటి అంశాల్లో రెండురోజుల శిక్షణను పూర్తిచేసింది.[4]

టాస్క్ గణాంకాలు[మార్చు]

 • నమోదు చేసుకున్న కళాశాలలు - 527 (2016-17)
 • నమోదు చేసుకున్న విద్యార్థులు - 87305 (2014-17)
 • శిక్షణ పొందిన బోధకులు - 2005 (2015-17)
 • శిక్షణ పొందిన విద్యార్థులు - 62769 (2014-17)
 • ఉద్యోగాలు పొందిన విద్యార్థులు - 3249 (2014-17)

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 ఈనాడు, ఉద్యోగనైపుణ్యాలు. "నైపుణ్యాలకు 'టాస్క్‌' నగిషీ!". Archived from the original on 2 జనవరి 2017. Retrieved 31 December 2016. CS1 maint: discouraged parameter (link)
 2. ఆంధ్రజ్యోతి, ముఖ్యాంశాలు. "యువతకు 'టాస్క్‌' బాసట". Retrieved 31 December 2016. CS1 maint: discouraged parameter (link)
 3. నమస్తే తెలంగాణ. "టార్గెట్ దిశగా టాస్క్!". Retrieved 31 December 2016. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
 4. నమస్తే తెలంగాణ. "లెక్చరర్లకు టాస్క్ ప్రత్యేక శిక్షణ". Retrieved 31 December 2016. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=టాస్క్&oldid=2974590" నుండి వెలికితీశారు