Jump to content

టి.ఎస్.చంద్రశేఖర్

వికీపీడియా నుండి
టి.ఎస్.చంద్రశేఖర్
జననం (1956-07-14) 1956 జూలై 14 (వయసు 68)
మదురై, తమిళనాడు
వృత్తిగ్యాస్ట్రో ఎంటెరాలజిస్ట్
వైద్య నిర్వాహకుడు
క్రియాశీల సంవత్సరాలు1977 నుండి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఎండోస్కోపీ
మెడ్‌ఇండియా హాస్పిటల్స్
పురస్కారాలుపద్మశ్రీ
TNMGRMU, తమిళనాడు వారి అత్యుత్తమ డాక్టరు పురస్కారం

తొగులువ శేషాద్రి చంద్రశేఖర్ (జననం 1956) భారతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, చెన్నైలోని మెడిండియా హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్.[1] అతను 23,000 కంటే ఎక్కువ ఎండోస్కోపీ ఆపరేషన్లు చేసిన ఘనత సాధించాడు.[2] దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం 2015 లో తయారు చేసిన వ్యక్తిగత పరిశుభ్రతపై బ్రెయిలీ చార్ట్‌కు ప్రసిద్ధి చెందాడు.[3] వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2016 లో పద్మశ్రీని ప్రదానం చేసింది.[4]

జీవిత చరిత్ర

[మార్చు]

TS చంద్రశేఖర్, 1956 జూలై 14 న జన్మించాడు. 1977 లో మదురై మెడికల్ కాలేజీ నుండి మెడిసిన్ పట్టభద్రుడయ్యాడు.[5] అత్యుత్తమ విద్యార్థిగా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుండి MD, DM డిగ్రీలను పొందాడు.[6][7]కోయంబత్తూరు మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ సభ్యునిగా వృత్తిని ప్రారంభించి, అక్కడ అతను మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాన్ని స్థాపించాడు.[8] తరువాత, అతను చెన్నై, నుంగంబాక్కంలో మెడిండియా హాస్పిటల్స్‌ను స్థాపించాడు. ఇది గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ వ్యాధుల కోసం సూపర్-స్పెషాలిటీ హెల్త్‌కేర్ సెంటర్‌గా ఎదిగింది.[9]

చంద్రశేఖర్ మెడిండియా ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపకుడు. ఇది పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, రాయితీ చికిత్సల ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలలో పాల్గొంటుంది.[10] అతను సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ ఆఫ్ ఇండియా (2007–08) కు అధ్యక్షుడుగా పనిచేసినపుడు, దాని జర్నల్ సలహా బోర్డులో సభ్యుడిగా ఉన్నాడు.[11] ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి జాతీయ అధ్యక్షుడు.[12] 23,000 పైచిలుకు ఎండోస్కోపీ ఆపరేషన్లు చేసిన ఘనత సాధించాడు.[6] 2015 లో అతను, దృష్టి లోపం ఉన్నవారి కోసం వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒక బ్రెయిలీ చార్ట్‌ను తయారు చేశాడు. ఎండోస్కోపిక్ సర్జికల్ విధానాలను బోధించడానికి పద్నాలుగు CD-ROMలను రూపొందించాడు. ఆహార పైపులోని అడ్డంకులను తొలగించడానికి అన్నవాహికలోకి కత్తిని చొప్పించడంతో కూడిన ఎండోస్కోపిక్ సర్జికల్ టెక్నిక్ అయిన పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీకి సంబంధించి భారతదేశంలో మార్గదర్శకులలో అతనొకడు.[13] అతను ఈ అంశంపై అనేక వ్యాసాలను ప్రచురించాడు. వాటిలో చాలా వరకు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.[14] అతను తమిళనాడు డాక్టర్ MGR మెడికల్ యూనివర్శిటీ [5] వారి ఉత్తమ వైద్యుడు పురస్కారాన్ని పొందాడు. ఆ విశ్వవిద్యాలయంలో అనుబంధ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు కూడా. 2009 లో గ్లాస్గోలోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ [15] వారు అతనిని ఫెలోషిప్‌తో సత్కరించారు. భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పౌర గౌరవాన్ని అందించింది [16]

మూలాలు

[మార్చు]
  1. "Endoscopy cancer unit launched". The Hindu. 6 December 2010. Retrieved 15 August 2016.
  2. "Dr. T.S. Chandrasekar awarded with Padma Shri Award". Chennaisonline. 15 February 2016. Retrieved 15 August 2016.
  3. "Meet the Padma awardees from Tamilnadu". DTnext. 27 January 2016. Archived from the original on 26 August 2016. Retrieved 15 August 2016.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 3 August 2017. Retrieved 9 August 2016.
  5. 5.0 5.1 "Padma League Comprises 112 Achievers, Including Rajinikanth, Saina, Others". Indian Express. 16 August 2016. Archived from the original on 27 January 2016. Retrieved 16 August 2016.
  6. 6.0 6.1 "Padma Shri Award for Dr. T.S. Chandrasekar". Live Chennai. 30 January 2016. Retrieved 15 August 2016.
  7. "Highlights of Biography". Medindia. 2016. Archived from the original on 30 అక్టోబరు 2017. Retrieved 15 August 2016.
  8. "Awardees happy, vow to rededicate". The Hindu. 26 January 2016. Retrieved 15 August 2016.
  9. "Services". Medindia Hospitals. 2016. Archived from the original on 30 అక్టోబరు 2017. Retrieved 16 August 2016.
  10. "MedIndia Charitable Trust". MedIndia Hospitals. 2016. Archived from the original on 18 అక్టోబరు 2017. Retrieved 16 August 2016.
  11. "National Advisory Board". Society of GastroIntestinal Endoscopy of India. 2016. Retrieved 16 August 2016.
  12. "Office bearers". Indian Society of Gastroenterology. 2016. Retrieved 16 August 2016.
  13. "City doctor prescribes POEM to help swallow food". Indian Express. 21 July 2014. Archived from the original on 21 January 2016. Retrieved 16 August 2016.
  14. "Publications authored by T S Chadrasekar". PubFacts. 2016. Retrieved 16 August 2016.
  15. "Chairman Profile". Medindia Hospitals. 2016. Retrieved 16 August 2016.
  16. "Dr V Shanta gets Padma Vibhushan; Padma Bhushan for Dr D Nageshwar Reddy". India Medical Times. 25 January 2016. Retrieved 15 August 2016.