కుహరాంతర దర్శనం

వికీపీడియా నుండి
(ఎండోస్కోపీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
A flexible endoscope.

కుహరాంతర దర్శనం లేదా ఎండోస్కోపీ (Endoscopy) ఒక విధమైన వైద్య పరీక్ష. ఎండోస్కోపీ అనగా లోపలికి చూడడం; అనగా సాధారణంగా బయటికి కనిపించని భాగాలను ఎండోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించి చూడడం. ఇవి చాలా రకాల వ్యాధులను గుర్తించడానికి, వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కడుపులో పేగు పుండు అయినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించి దాని తీవ్రతను పరిశీలించి వైద్యం చేస్తారు. ఇందులో భాగంగా ఒక చివరన మైక్రో కెమెరా కలిగిన ఒక సన్నటి ట్యూబును నీటి గుండా కడుపులోకి నెమ్మదిగా పంపిస్తారు. దానికి అమర్చి ఉన్న సూక్ష్మ కెమెరా పేగులోపలి భాగం యొక్క ఫోటోలను తీసి దానికి అనుసంధానించిన కంప్యూటర్కు పంపిస్తుంది. ఈ ఫోటోల ద్వారా పుండు ఎంతమేరకు అయ్యిందని నిర్ణయిస్తారు.

ఉపయోగాలు[మార్చు]