ఫెలోపియన్ నాళాలు

వికీపీడియా నుండి
(ఫెల్లోపియన్ నాళాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఫెలోపియన్ నాళాలు
Schematic frontal view of female anatomy
Vessels of the uterus and its appendages, rear view. (Fallopian tubes visible at top right and top left.)
లాటిన్ tuba uterina
గ్రే'స్ subject #267 1257
ధమని tubal branches of ovarian artery, tubal branch of uterine artery
లింఫు lumbar lymph nodes
Precursor Müllerian duct
MeSH Fallopian+Tubes
Dorlands/Elsevier t_21/12827008

ఫెలోపియన్ నాళాలు (Fallopian tubes) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో ఒక భాగము. ఈ నాళాలు అండాశయం నుండి గర్భకోశం వరకు వ్యాపించి ఉంటాయి. ఇటలీకి చెందిన వైద్య శాస్త్రవేత్త గాబ్రియల్ ఫెలోపియో (Gabriele Fallopio) పేరుమీద వీటికి నామకరణం జరిగింది.

నిర్మాణము

[మార్చు]

మనుషులలో రెండు ఫెలోపియన్ నాళాలు గర్బాశయానికి పైభాగంలో రెండు వైపులా కార్నువా ప్రాంతంలో తెరుచుకుంటాయి. వీని రెండవ చివర కటి ప్రాంతంలో అండకోశం చుట్టుప్రక్కల ఫింబ్రియా అనే సీ అనిమోన్ వంటి నిర్మాణంలో అంతమౌతుంది. ఈ విధంగా ఇవి కడుపును బయటికి కలుపుతాయి. ఇవి ఇంచుమించు 7 నుండి 14 సెం.మీ. పొడవుంటాయి.


భాగాలు

[మార్చు]

ఫెలోపియన్ నాళాలు నాలుగు భాగాలుగా చేయవచ్చును:[1]

ఫెలోపియన్ నాళంలోని పొరలు.

ఫెలోపియన్ నాళంలో మూడు పొరలుంటాయి:[2]

ఫలదీకరణం

[మార్చు]

అండాశయంలో అండాలు అభివృద్ధి చెందినప్పుడు ఒక తిత్తిలో అమరి ఉంటాయి. సరైన సమయంలో ఇవి పగిలి అండం విడుదలయి ఫెలోపియన్ నాళంలోనికి చేరుతుంది. అక్కడి నుండి గర్భాశయం వైపు ప్రయాణిస్తుంది. శుక్రకణాలతో ఫలదీకరణం జరిగి, అది గర్భాశయం చేరి ప్రతిస్థాపించబడుతుంది. దీనితో గర్భం ప్రారంభమౌతుంది.

అరుదుగా ఫెలోపియన్ నాళంలోనే ప్రతిస్థాపన జరిగి ఫెలోపియన్ గర్భం వస్తుంది. ఇవి సాధారణంగా గర్భస్రావం జరిగి ఎక్కువకాలం నిలువలేవు.

పిండాభివృద్ధి

[మార్చు]

పిండ వ్యవస్థలో రెండు జతల నాళాలు బీజకణాలు ను బయటకు తీసుకొనిపోతాయి. ఒక జత ముల్లేరియన్ వాహిక (Mullerian duct) ల నుండి స్త్రీలలో ఫెలోపియన్ నాళాలు, గర్భకోశం, యోని తయారౌతాయి. రెండవ జత ఉల్ఫియన్ వాహిక (Wolffian duct) ల నుండి పురుషులలో శుక్ర వాహిక తయారౌతాయి.

వ్యాధులు

[మార్చు]

కటి ప్రాంతంలోని ఇన్ ఫెక్షన్ ఫెలోపియన్ నాళాలకు సోకవచ్చును. కొన్ని క్షయ వ్యాధులు కూడా ఇలా వచ్చి నాళాలు కుంచించుకొని పోయి ప్రవాహానికి అడ్డం కలిగించవచ్చును. దీని వలన వంద్యత్వం లేదా గర్భం కలుగవచ్చును.

శస్త్రచికిత్స

[మార్చు]

కుటుంబ నియంత్రణలో భాగంగా ఫెలోపియన్ నాళాలలో చిన్న భాగాన్ని తొలగించడాన్ని ట్యూబెక్టమీ అంటారు. వీనిలోని అడ్డంకుల్ని తొలగించి నాళాన్ని సరిచేసే శస్త్రచికిత్సను ట్యూబోప్లాస్టీ అంటారు.

మూలాలు

[మార్చు]
  1. మూస:SUNYAnatomyLabs - "The Female Pelvis: The Oviduct"
  2. మూస:USCHistology
  3. మూస:USCHistology
  4. "Oviduct". Archived from the original on 2008-05-17. Retrieved 2008-05-07.