తిక్కవరపు సుబ్బరామిరెడ్డి

వికీపీడియా నుండి
(టి.సుబ్బిరామిరెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తిక్కవరపు సుబ్బరామిరెడ్డి
T.Subbarami Reddy.jpg
తిక్కవరపు సుబ్బరామిరెడ్డి
జననంతిక్కవరపు సుబ్బరామిరెడ్డి
సెప్టెంబరు 17, 1943
నెల్లూరు
ప్రసిద్ధిరాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త
సాధించిన విజయాలుపార్లమెంటు సభ్యుడు
పదవీ కాలము1996 మరియు 1998 సంవత్సరాలలో 11వ మరియు 12వ లోక్‌సభ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు
భార్య / భర్తఇందిరా సుబ్బరామిరెడ్డి
తండ్రిబాబు రెడ్డి,
తల్లిరుక్మిణమ్మ

తిక్కవరపు సుబ్బరామిరెడ్డి (ఆంగ్లం: T. Subbarami Reddy) (జ. సెప్టెంబరు 17, 1943) భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త. వీరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు. ఈయన గనుల శాఖామాత్యునిగా ఉన్నాడు. ఈయన 1996 మరియు 1998 సంవత్సరాలలో 11వ మరియు 12వ లోక్‌సభ లకు విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. ఇతడు 2002 సంవత్సరం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్నాడు.

సుబ్బరామిరెడ్డి 1943, సెప్టెంబర్ 17న బాబు రెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించాడు.[1] హైదరాబాదు లోని నిజాం కళాశాల నుండి బి.కామ్ పట్టాపొందాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు, 1966 ఫిబ్రవరి 6న ఈయనకు ఇందిరా సుబ్బరామిరెడ్డితో వివాహమైనది.

సినిమా నిర్మాణం[మార్చు]

ఇతడు తెలుగు, హిందీ, తమిళ, సంస్కృత భాషలలో కొన్ని సినిమాలను నిర్మించాడు. సంస్కృతంలో ఇతడు నిర్మించిన భగవద్గీత చలనచిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

ఇతడు నిర్మించిన సినిమాల పాక్షిక జాబితా:

తెలుగు
  1. జీవన పోరాటం
  2. స్టేట్ రౌడి
  3. గ్యాంగ్ మాస్టర్
  4. సూర్య ఐ.పి.ఎస్
హిందీ
  1. దిల్‌వాలా
  2. చాందినీ
  3. లమ్హే
  4. స్వామి వివేకానంద
సంస్కృతం
  1. భగవద్గీత

మూలాలు[మార్చు]