Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

టి. చంద్రకాంతమ్మ

వికీపీడియా నుండి
టి. చంద్రకాంతమ్మ
జననం
తిరుమకూడలు, మైసూరు
వృత్తినాట్య కళాకారిణి
Dancesభరతనాట్యం

టి. చంద్రకాంతమ్మ భరతనాట్య కళాకారిణి.[1]

విశేషాలు

[మార్చు]

ఈమె మైసూరు రాజ్యంలోని తిరుమకూడలు గ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఈమె తన బాల్యం నుండి భరతనాట్యానికే తన జీవితాన్ని అంకితం చేసింది. ఈమె నాట్యాన్ని అరణి అప్పయ్య వద్ద, అభినయాన్ని మైసూరు ఆస్థాన విద్వాంసుడు కాశీ గురువునుండి, సంగీతాన్ని బి.రాచప్ప నుండి అభ్యసించింది. తిరువాయూర్ సుబ్రహ్మణ్య అయ్యర్ నుండి ఉన్నత శిక్షణను తీసుకుంది.[2]

ఈమె మైసూర్ మహారాజు కృష్ణరాజ ఒడయార్ IV మెప్పును పొంది మైసూర్ సంస్థానంలో ఆస్థాన నర్తకిగా పనిచేసింది.

గీతాగోవిందం, రాజశేఖర విలాసం కావ్య భాగాలలో ఈమె అభినయాన్ని చూసి కళాప్రియులు ఈమె ప్రతిభకు తలలూపినారు. సంస్కృత శ్లోకాలకు, జావళీలకు ఈమె ధ్వనిముద్రలు జనప్రియమైనవి.


1964-65 సంవత్సరానికి కర్ణాటక సంగీత నాటక అకాడమీ అవార్డును ఈమెకు ప్రకటించింది. 1971లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో ఈమెను గౌరవించింది.

మూలాలు

[మార్చు]
  1. web master. "T.Chandrakanthamma". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 11 April 2021.
  2. web master. "ಚಂದ್ರಕಾಂತಮ್ಮ". కణజ - అంతర్జాల జ్ఞాన కన్నడ కోశ. కన్నడ & సాంస్కృతిక శాఖ, కర్ణాటక ప్రభుత్వం. Retrieved 11 April 2021.