Jump to content

టి. లలితాదేవి

వికీపీడియా నుండి

టి. లలితాదేవి తెలుగు, హిందీ సినిమా నటి. ఈమె అసలు పేరు టాన్జూరు లలితాదేవి. భారతీయ సినిమా తొలి టాకీల కాలంలోనే హిందీ సినీరంగంలోకి వెల్లి అక్కడ కథానాయికగా నటించిన తొలి హైదరాబాదు నటి.[1]

తెలుగులో అప్పటికే కెమెరామన్ ఎం.ఎ.రహమాన్ భార్య బళ్ళారి లలిత అనే నటి ఉండేది. కనుక ఈమెను అందరూ "బొంబాయి లలిత"గా వ్యవహరించేవారు. హిందీలో ఆమె సరితాదేవి గా ప్రసిద్ధురాలు.

ఈమె దాదాపు 12 హిందీ సినిమాలలో నాయికగా నటించినట్లు 1948లో వచ్చిన చిత్రకళ అనే గ్రంథంలో ప్రస్తావించారు. ఆమె ఎక్కువగా బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన సినిమాలలో నటించినట్లు తెలుస్తోంది.

చిత్రసమాహారం

[మార్చు]

తెలుగు సినిమాలు

[మార్చు]
  1. జయప్రద (1939)
  2. చండిక (1940)
  3. విశ్వమోహిని (1940) - సుశీల
  4. భీష్మ (1944)
  5. త్యాగయ్య (1946) - చపల
  6. లైలా మజ్ఞు (1949)
  7. ధర్మదేవత (1952) .... బిజిలీ

హిందీ సినిమాలు

[మార్చు]
  1. దో ఘడీకి మౌజ్ (1935) (లలితగా) .... ఆషా
  2. సమాజ్ కీ భూల్ (1934) (లలితగా) .... లలిత
  3. సందిగ్ధ (1932)
  4. రాధారాణి (1930)
  5. భారత్ రమణి (1930)
  6. గిరిబాల (1929) (లలితగా)
  7. ఇందిర (1929)
  8. రజని (1929)

మూలాలు

[మార్చు]
  1. టి లలితాదేవి, [permanent dead link]నమస్తే తెలంగాణ, 4 డిసెంబర్ 2011 అనుబంధంలో హెచ్. రమేష్ బాబు రచించిన వ్యాసం.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]