టీనా దేశాయ్
స్వరూపం
టీనా దేశాయ్ | |
---|---|
జననం | టీనా దేశాయ్ 1987 ఫిబ్రవరి 24 |
వృత్తి | సినిమా నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2011– ప్రస్తుతం |
టీనా దేశాయ్ భారతదేశానికి చెందిన సినీ నటి, మోడల్. ఆమె 2011లో ‘యే ఫాస్లే’ సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]టీనా దేశాయ్ 1987, ఫిబ్రవరి 24న బెంగుళూరులో జన్మించింది. ఆమె తల్లితండ్రులది ప్రేమ వివాహం. తండ్రి గుజరాతీ, తల్లి తెలుగు. ఆమె బెంగుళూరులోనే బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసింది. టీనా తెలుగు, గుజరాతీ, కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాట్లాడగలుగుతుంది.
సినీ ప్రస్థానం
[మార్చు]టీనా 2011లో హిందీ సినిమా ' యే ఫాస్లే’ తో సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆమె మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2011 | యే ఫాస్లే | అరుణిమ | హిందీ | |
2011 | సాహి దందే గాలాత్ బందే | నేహా శర్మ | హిందీ | |
2012 | కాక్ టెయిల్ | వెయిట్రెస్ | హిందీ | అతిధి పాత్ర |
2012 | ది బెస్ట్ ఎగ్జోటిక్ మారిగోల్డ్ హోటల్ | సునైనా | ఇంగ్లీష్ | |
2013 | టేబుల్ నెం.21 | సియా అగస్తి | హిందీ | |
2015 | ది సెకండ్ బెస్ట్ ఎగ్జోటిక్ మారిగోల్డ్ హోటల్ | సునైనా | ఇంగ్లీష్ | |
2015 | షరాఫత్ గాయి తెల్ లేనే | మేఘ | హిందీ | |
2016 | థామస్ & ఫ్రెండ్స్: ది గ్రేట్ రేస్ | అషిమా | ఇంగ్లీష్ | వాయిస్ |
2018 | దసరా | అదితి సింగ్ | హిందీ | |
2018 | గుడ్ లక్ | జెన్నీ సక్సేనా | హిందీ | షార్ట్ ఫిలిం |
2021 | బాబ్ బిస్వాస్ | విడుదల కావాల్సి ఉంది | హిందీ | పోస్ట్ -ప్రొడక్షన్ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2015–2018 | సెన్స్ 8 | కళ దండేకర్ | ఇంగ్లీష్ | ఒరిజినల్ వెబ్ సిరీస్ |
2018– ప్రస్తుతం | థామస్ అండ్ ఫ్రెండ్స్ | అషిమా | ఇంగ్లీష్ | డబ్బింగ్; 4 ఎపిసోడ్స్ లో నటించింది |
2021 | ముంబై డైరీస్ 26/11 | విడుదల కావాల్సి ఉంది | హిందీ | ఒరిజినల్ వెబ్ సిరీస్ |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 May 2021). "షారుఖ్ ఫైట్స్, డాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయా : నటి". Sakshi. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
- ↑ "Tena Desae". The Times of India. 18 November 2011. Archived from the original on 8 July 2012.